Suryaa.co.in

Andhra Pradesh

ఏడాది కూటమి పాలన.. సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితం

పింఛన్ల పెంపు.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు
-పెట్టుబడులు, పరిశ్రమలకు ఆకర్షణ
– రూ.1,200 కోట్లతో రహదారులు బాగు
– అన్నదాతలకు అన్నివిధాలా అండదండలు
– ఏడాదిలోనే కూటమి ప్రభుత్వ ఘనవిజయాలు

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చరిత్రలోనే నిలిచిపోయేలా కీలక హామీలను అమలుచేశామని కూటమి ప్రభుత్వం పేర్కొంది. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, పింఛన్ల నగదు పెంపు, అన్నక్యాంటీన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిగా చేసిన 5 సంతకాలను నెరవేర్చినట్లు వెల్లడించింది.

దీపం-2 పథకం అమలుతోపాటు ఇతర సూపర్ సిక్స్ పథకాల అమలుకు రోడ్మ్యప్ సిద్ధం చేసినట్లు… సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షిస్తూ అభివృద్ధిని పట్టం కడుతున్నట్లు తెలిపింది. వైకాపా ప్రభుత్వం విధ్వంసం సృష్టించిన రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో కదలిక తెస్తూనే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలుచేస్తామని వివరించింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి తెస్తామని వెల్లడించింది. ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల వివరాలివి….

అధికారంలోకి రాగానే రూ.3వేల నుంచి రూ.4వేలకు ఒకేసారి పింఛన్ల పెంపు
నెలకు 64 లక్షల మందికి రూ.2,720 కోట్ల పంపిణీ. ఏడాదికి రూ.34వేల కోట్ల ఖర్చు
16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. త్వరలోనే ఉపాధ్యాయుల నియామకం
దీపం-2 పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు. ఇప్పటికే రెండు విడతలు అమలు. కోటిమందికి పైగా సిలిండర్లు డెలివరీ. ఏడాదికి రూ.2,684 కోట్ల ఖర్చు

గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు

మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు

వేటనిషేధ సమయంలో మత్స్యకారులకు అండగా నిలిచేలా ఒక్కొక్కరికీ రూ.20వేల అందజేత. ఇందుకు రూ.259 కోట్ల వ్యయం
పేదలకు అండగా నిలిచేలా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ. 203 క్యాంటీన్ల ఏర్పాటు. కొత్తగా మరో 61 ఏర్పాటుకు సన్నద్ధం
74 కేంద్ర పథకాల పునరుద్ధరణ

20 వేల కి.మీ. రహదారులు బాగు
రహదారులపై గుంతలు పూడ్చేందుకు రూ.1200 కోట్లు వెచ్చించి 20 వేల కి.మీ. బాగుచేశారు.
రూ.72వేల కోట్లతో హైవే ప్రాజెక్టులు

9.20 లక్షల కోట్ల పెట్టుబడులు
వైకాపా విధ్వంసంతో దెబ్బతిన్న రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడుల రాక. 78 ప్రాజెక్టుల ద్వారా రూ.9.20 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ. వీటితో 5.70 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం

అమరావతికి, పోలవరానికి కేంద్రం చేయూత
రాజధాని అమరావతికి కేంద్రం ద్వారా రూ.15వేల కోట్ల ఆర్థికసాయం
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,500 కోట్ల విడుదల
విశాఖ రైల్వేజోన్ మంజూరు, నిర్మాణ పనులు ప్రారంభం
విశాఖ స్టీల్స్టాప్లాంటుకు రూ.11,400 కోట్ల ప్యాకేజీ

పలు వర్గాలకు మేలు
ఉపాధ్యాయులకు మేలుచేసేలా 117 జీవో రద్దు
పోలీసులకు రూ.213 కోట్ల సరెండర్ లీవ్ ల సొమ్ము విడుదల
అంగన్వాడీలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు
లక్ష మంది మహిళలకు కుట్టుమిషన్లు

రూ.990 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు
పంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.990 కోట్ల కేటాయింపు..
రూ.4,500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు. 30వేల పనులకు శ్రీకారం
వాట్సప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా 350 రకాల పౌరసేవలకు శ్రీకారం
కొత్త మద్యం విధానం ద్వారా జే బ్రాండ్లకు చెల్లు. నాణ్యమైన మద్యం అందజేత
గీత కార్మికులకు 10% మద్యం దుకాణాల కేటాయింపు
దేవాలయాల్లో నాయీబ్రాహ్మణులకు వేతనాలు రూ.25వేలకు పెంపు
చేనేతలకు జీఎస్టీ ఎత్తివేత
పవర్లూమ్స్కు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు
స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు
వేద విద్యార్థులకు రూ.3వేల భృతి
అర్చకుల జీతాలు రూ.15వేలు, ఇమామ్లకు రూ.10వేలు, మౌజంలకు రూ.5వేలు, పాస్టర్లకు రూ. 5వేల వేతనాలు

చెత్త పన్ను రద్దు
వైకాపా ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచిన చెత్త పన్ను రద్దు
రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన 83 లక్షల టన్నుల చెత్త తొలగింపు
ఉచిత ఇసుక విధానం ద్వారా నిర్మాణ రంగానికి ఊతం
హంద్రీ-నీవా కాలువ విస్తరణకు ఏడాదిలో రూ.3,800 కోట్ల ఖర్చు
రైతులకు 90% రాయితీతో డ్రిప్ పరికరాల అందజేత
పాడిరైతుల కోసం రూ.2 లక్షల రాయితీతో షెడ్ల నిర్మాణం
55,57,525 టన్నుల ధాన్యం సేకరణ. రైతులకు రూ.13,584 కోట్ల చెల్లింపు. గత ప్రభుత్వం
బకాయి పెట్టిన రూ.1,674 కోట్ల విడుదల

LEAVE A RESPONSE