Suryaa.co.in

Andhra Pradesh

నిఘా అధిపతి సారథ్యంలోనే మా ఫోన్లు ట్యాపింగ్

పీఎస్సార్ ఆంజనేయులును తప్పించాలి
కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని బోండా ఉమ తీవ్ర ఆరోపణలు.
కేశినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టు ఆధారాలు బయట పెట్టిన బోండా ఉమ
చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా అభియోగం

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ

అమరావతి: నిఘా అధిపతి పీఎస్సార్ ఆంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోంది. గతంలో తాము ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి, గుడివాడ అమర్నాధ్ వెల్లడి చేశారు. గత తెలంగాణ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినప్పుడే, ఏపీ సీఎం జగన్ అదే తరహా సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారు. మేమిచ్చిన కంప్లైంటుపై ఈసీ చర్యలు తీసుకోవాలి.

ఇవాళ పార్టీ అభ్యర్థులతో ఓ వర్క్ షాప్ నిర్వహించాం. ఆ సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారు. విశ్వేశ్వరరావు అనే వ్యక్తి మా సమావేశంలోకి వచ్చాడు. ఐజీ పంపితేనే వచ్చానని ఆ కానిస్టేబుల్ చెప్పారు. కేశినేని చిన్ని కదలికల మీద నిఘా పెట్టినట్టు మాకు తెలిసింది. కేశినేని చిన్నిని కదలికలపై నిఘా పెట్టి ఫోన్లను ట్యాప్ చేసిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి.

మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్న ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్లో మాకు లభ్యమయ్యాయి. కేశినేని చిన్ని టిడిపి విజయవాడ పార్లమెంటు అభ్యర్థి. తెలంగాణలో కూడా ఇదే తరహాలో ట్యాపింగ్ ప్రక్రియ చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు నిర్దారణైంది. ఫోన్ ట్యాపింగుపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు?

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. పీఎస్సార్ ఆంజనేయులుతో సహా ఫోన్ ట్యాపింగుకు పాల్పడిన వారిని విధుల నుంచి తప్పించాలి. వైసీపీ నేతలు బరి తెగించారు. ప్రధాని సభకు వచ్చినందుకు ఏకంగా హత్యలే చేసేశారు. దాడులు వైసీపీకి ఓ లెక్కే కాదు.

 

LEAVE A RESPONSE