Suryaa.co.in

Telangana

బండి సంజయ్ చస్తే.. ఆయనకూ 5 లక్షలిస్తాం

– వ‌రి వేయ‌మ‌ని రైతుల‌ను రెచ్చ‌గొట్టింది బీజేపీ కుక్క‌లే
– వ‌డ్ల‌కు, గోధుమ‌ల‌కు తేడా తెలియ‌ని వెధ‌వ బండి సంజ‌య్
– బండి సంజయ్ కు సిగ్గు, శరం ఉందా?
– పీఎంవో ఆదేశాల‌తోనే పోటీ దీక్ష
– నాపై ఐటీ దాడులా.. ద‌మ్ముంటే చేయించు
– ఆదానీ కోసమే బీజేపీ వ్యవసాయ చట్టాలు
– కమలాన్ని కడిగిపారేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పరాకాష్ఠకు చేరింది. ఢిల్లీలో తమ దీక్షకు పోఈగా హైదరాబాద్‌లో దీక్ష నిర్వహించిన బీజేపీపై టీఆర్‌ఎస్ మరోమారు మాటల యుద్ధానికి దిగింది. తాజాగా మీడియాలో మాట్లాడిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఒకవేళ చచ్చిపోతే ఆయనకూ రైతుబీమా కింద 5 లక్షల రూపాయలు ఇప్పిస్తామంటూ చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ ప్రజలను ఇబ్బందిపెడుతున్న సంజయ్‌ను వెధవ, సిగ్గు శరం ఉందా అని కడిగిపారేశారు. బీజేపీని కుక్కులుగా అభివర్ణించారు. వాడివేడిగా సాగిన పల్లా మీడియా సమావేశంలో ఆయన ఆద్యంతం కేంద్రాన్ని, రాష్ట్రంలోని బీజేపీ నేతలపై దాడితోనే సాగింది.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చావాల‌ని కోరుకోవ‌డం లేదు.. కానీ ఆయ‌న చ‌స్తే రైతుబీమా కింద రూ. 5 ల‌క్ష‌లు ఇప్పిస్తామ‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పీఎంవో ఆదేశాల‌తోనే త‌మ‌కు దీక్ష‌కు పోటీగా బీజేపీ హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేప‌ట్టింద‌ని ప‌ల్లా నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ఎల్పీలో ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ నిన్న ఢిల్లీలో చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష విజ‌య‌వంత‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ ధ‌ర్నా త‌ర్వాత ఎఫ్‌సీఐ అధికారి తెలుగు మీడియాతో మాట్లాడారు.

నిన్న‌టి బీజేపీ ధ‌ర్నాలో బండి సంజ‌య్ పిచ్చికుక్క‌లా మాట్లాడార‌ని రాజేశ్వ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంజ‌య్ వార్డ్ మెంబ‌ర్ స్థాయి క‌న్నా త‌క్కువ‌గా దిగ‌జారి మాట్లాడార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ధాన్యం సేక‌ర‌ణ ఎలా జ‌రుగుతుందో కూడా బండికి క‌నీస అవ‌గాహ‌న లేద‌న్నారు. వ‌రి వేయ‌మ‌ని రైతుల‌ను రెచ్చ‌గొట్టింది బీజేపీ కుక్క‌లే అని విమ‌ర్శించారు. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయిస్తామ‌ని చెప్పి.. ఇవాళ ముఖం చాటేసింది బీజేపీ కుక్క‌లు కాదా? అని నిల‌దీశారు. వ‌డ్ల‌కు, గోధుమ‌ల‌కు తేడా తెలియ‌ని వెధ‌వ బండి సంజ‌య్ అని రాజేశ్వ‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నూక‌లు తిన‌డం నేర్పించాల‌ని పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానిస్తే.. ఆత్మ‌గౌర‌వం లేకుండా బండి సంజ‌య్ కేంద్రానికి వ‌త్తాసు ప‌లికాడ‌ని రాజేశ్వ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. రైతుల‌కు రెట్టింపు ఆదాయం రాలేదు కానీ కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌తో అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌న్నారు. ఆదానీ కోసమే బీజేపీ వ్యవసాయ చట్టాలు తెచ్చింది నిజం కాదా? అని అడిగారు. మోదీ, అమిత్ షా ల బూట్లు నాకడం తప్ప బండి సంజయ్ కు ఇంకేమైనా తెలుసా? సిగ్గు, శరం ఉందా? అని క‌డిగిపారేశారు.

నా పై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తావా.. ద‌మ్ముంటే చేయించాల‌ని బండి సంజ‌య్‌కు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి స‌వాల్ విసిరారు. ఇక‌పై బీజేపీ నాయ‌కులు ఒక్క‌టి అంటే తాము రెండు అంటామ‌ని తేల్చిచెప్పారు. నోరు అదుపులో పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు. పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి కుక్కకు ఏ గతి పడుతుందో సంజయ్ కు అదే గతి పడుతుందని రాజేశ్వ‌ర్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE