వ్యక్తుల కోసం పార్టీ తలొగ్గదు

– టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కేసీఆర్ పై విమర్శలు చేయడం జూపల్లి, పొంగులేటి చర్యలకు పరాకాష్ట.జూపల్లి, పొంగులేటి పార్టీ క్రమశిక్షణ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.వ్యక్తుల కోసం పార్టీ తలొగ్గదు .. పునరాలోచన చేసుకుంటారని ఇన్నాళ్లు వేచిచూశాం. పార్టీ ఎంతో సంయమనంతో వారి చర్యలను గమనించింది.తనను తిట్టిన వారిని కూడా అక్కున చేర్చుకున్న గొప్ప మనసు కేసీఆర్ ది.పార్టీలోకి ఎవరిని తీసుకున్నా తెలంగాణ ప్రయోజనాల కోసమే. పార్టీకి అతీతులమనే వ్యక్తిగత ధోరణిని ఎవరూ సహించరు.2012 లో జూపల్లి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.తెలంగాణ ఉద్యమం మొదలైన పుష్కరకాలం తర్వాత జూపల్లి పార్టీలో చేరారు.బలిదానాల గురించి జూపల్లి మాట్లాడడానికి నైతికత ఉండాలి.

గతంలో ఆయన ఉన్న పార్టీనే తెలంగాణ యువత బలిదానాలకు కారణం.పార్టీని వీడి వచ్చినందుకు 2014లో గెలిచిన జూపల్లికి అంతకుముందు నుండి ఉన్నవారిని కాదని కేసీఆర్ మంత్రిగా అవకాశం ఇచ్చారు .. మంత్రిగా ఆయన సేవలు ఉపయోగించుకోవాలని అవకాశం ఇచ్చారు.2018లో ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాల్లో ఓడిపోయింది కొల్లాపూర్ ఒక్కటే. ఆయన ఎందుకు ఓడిపోయాడో ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. వ్యక్తిగత అవకాశాలు రాలేదని జూపల్లి విమర్శిస్తున్నారు .. దానిలో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదుతెలంగాణ ఏర్పడిన తర్వాత పొంగులేటి పార్టీలో చేరారు .. తెలంగాణ ఉద్యమంలో పొంగులేటి పాత్ర లేదు.పొంగులేటి పార్టీలో ఏం చేశారో .. ఎందుకు అవకాశం రాలేదో ఖమ్మం ప్రజలకు తెలుసు.జూపల్లి స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని కాదని రెబల్స్ ను పోటీలో పెట్టారు.

జూపల్లి ఇంట్లో ఇంకా వైఎస్ ఫోటో ఉంటుంది .. కేసీఆర్ ఫోటో ఎందుకు లేదని అడిగాను.మంత్రిగా తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా వైఎస్ విగ్రహం పెట్టారు.నిన్న, మొన్న ఆంధ్ర నుండి వచ్చి పార్టీ పెట్టిన వాళ్ల మాదిరిగా పొంగులేటి, జూపల్లి విమర్శిస్తున్నారు.నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన జూపల్లి నియోజకవర్గానికి సాగునీరు రాలేదని చెప్పడం ఆయన తప్పుకాదా ? ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించడం లేదా ? గత పాలకులు రిజర్వాయర్లు నిర్మించకపోవడం మూలంగా సాగునీటికి ఇబ్బందులు ఏర్పడిన విషయం జూపల్లికి తెలియదా?మార్చి 15 తర్వాత జూరాల నుండి సాగునీళ్లు రావని అందరికీ తెలుసు .. వరి వద్దు అని ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు ప్రతిసారి విజ్ఞప్తి చేస్తున్నాం.

రైతులు ఆశాజీవులు కాబట్టి వారు పంటలు వేసుకుంటున్నారు .. వారి సమస్య ఎలా పరిష్కరించాలో సూచనలు ఇవ్వాలి .. వారికి ధైర్యం ఇవ్వాలి.ఇదేదో ఈ ప్రభుత్వంలోనే జరిగినట్లు జూపల్లి మాట్లాడడం మంచి పద్దతి కాదు.జూపల్లి విమర్శలు కేసీఆర్ ను , తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులు మాట్లాడే మాటలే.మొన్నటి వరకు దేశంలో అద్భుత పాలన కేసీఅర్ ది .. పాలమూరు పచ్చబడగొట్టింది .. పేదరికాన్ని దూరం చేస్తున్నది కేసీఆర్ అని చెప్పింది జూపల్లి. ప్రజలకు న్యాయం జరగకుంటే గత ప్రభుత్వంలో ఏం చేశారు ? గత నాలుగేళ్లుగా ఏం చేస్తున్నారు.గత కొంతకాలంగా జూపల్లి, పొంగులేటి ఎవరి ట్రాప్ లో ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి , ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు

Leave a Reply