Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి నిర్మించిన రుషికొండ ప్యాలెస్ విలువ కూడా చేయదు, అంగన్ వాడీ సిబ్బందికి తాను ఇచ్చిన హామీ ఖరీదు

•  లక్షా10వేల మంది అంగన్ వాడీ సిబ్బంది జీవితాలు, రుషికొండపై నీ విలాసాలకోసం నిర్మించుకున్న ప్యాలెస్ ఖరీదు చేయవా జగన్ రెడ్డి?
• అంగన్ వాడీ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, 108-104 అంబులెన్సుల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల మొత్తం విలువ, జగన్ రెడ్డి తన విలాసాలకోసం తగలేసిన వేలకోట్ల ప్రజలసొమ్ము ముందు దిగదుడుపే
• ఇచ్చిన హామీ అమలు కోసం పోరాడుతున్నవారిపై లాఠీలు ఝళిపించి, ఎస్మాచట్టాలు ప్రయోగిస్తారా?
• గత ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి అంగన్ వాడీ సిబ్బందికి తెలంగాణ కంటే రూ.1000అదనంగా జీతం చెల్లిస్తానని హామీ ఇచ్చింది నిజం కాదా?
• నేడు తెలంగాణలో అంగన్ వాడీ సిబ్బందికి ప్రతినెలా రూ.13,600లు ఇస్తుంటే, మాట ప్రకారం జగన్ రెడ్డి రూ.14,600లు ఇవ్వాలి..కానీ ఇస్తున్నది రూ.11,500లు మాత్రమే
• లక్షా 10వేల మంది అంగన్ వాడీలకు ఇచ్చిన హామీ మేరకు పెంచిన జీతం చెల్లించాలంటే రాష్ట్రఖజానాపై ఏటా పడే భారం కేవలం రూ.395 కోట్లు
• రుషికొండపై తన విలాసాల కోసం జగన్ రెడ్డి కట్టించిన ప్యాలెస్ ఖర్చు రూ.433 కోట్లు
• చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం నిత్యం అదేచెత్తను శుభ్రపరుస్తూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు న్యాయం చేయడానికి ఎందుకు సంకోచిస్తోంది?
• ప్రతి రోజూ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టే 108-104 సిబ్బందికి కూడా జీతాలు బకాయిలు పెట్టింది ఈ దుర్మార్గపు ప్రభుత్వం
• తన బినామీ అయిన అరబిందోకు 108 అంబులెన్సుల నిర్వహణ పేరుతో జగన్ రెడ్డి ఏటా రూ.188 కోట్లు దోచిపెడుతున్న సొమ్ము ఎటుపోతోంది?
• కనీసం ప్రతినెలా సిబ్బందికి జీతాలు కూడా చెల్లించిన అరబిందో సంస్థకు వేలకోట్ల విలువైన రామాయపట్నం పోర్టు, సోలార్ పవర్ పార్కులు ఎలా దోచిపెడతావు జగన్ రెడ్డి?
• 60 శాతం నిధులు కేంద్రమే భరిస్తుంటే, రాష్ట్ర వాటాగా 40 శాతం నిధులు చెల్లించకుండా జగన్ రెడ్డి సర్వశిక్షా అభియాన్ సిబ్బంది జీతాలకు ఎగనామం పెట్టాడు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడచూసినా ఆందోళనలు, ఉద్యమాలు, సమ్మెలు, వివిధ వర్గాల నిరసనలపై పోలీసుల దాష్టీకాలే కనిపిస్తున్నాయని, ఎటువైపు చూసినా జగన్ రెడ్డి చేతిలో మోసపోయిన వారి ఆక్రందనలే వినిపిస్తున్నాయని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ అంగన్ వాడీ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, 108-104 అంబులెన్సుల నిర్వహణ సిబ్బంది సహా అనేక వర్గాల వారు జగన్ రెడ్డి చేతిలో మోసపోయి, తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకోసం ఆందోళన బాట పట్టారు. వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయకపోగా జగన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఎస్మా చట్టం ప్రయోగించింది. వైసీపీ ప్రభుత్వం జనవరి-06, 2024న ఒక గెజిట్ విడుదలచేసి మరీ సమ్మెచేస్తున్న అంగన్ వాడీ సిబ్బందిపై దారుణంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది.

చట్టప్రకారం అంగన్ వాడీ సిబ్బంది ఎసెన్షియల్ సర్వీస్ కింద లేకపోయినా, కావాలని వారిని సర్వీస్ లోకి తీసుకొచ్చి మరీ వారిపై ఎస్మాచట్టం ప్రయోగించిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. తన ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకున్నట్టు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మాయమాటలు చెప్పే జగన్ రెడ్డి, తాను ఇచ్చిన హామీలు అమలుచేయమని అడిగిన అంగన్ వాడీ సిబ్బందిపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని ఏమనాలి? అధికారంలోకి రాకముందు అమోఘమైన నటన ప్రదర్శించిన జగన్ రెడ్డి, నేడు ఇంత కర్కశంగా ప్రవర్తించడం అతని నియంత్రత్వపోకడల్లో భాగమనే చెప్పాలి.

తెలంగాణ కంటే రూ.1000లు ఎక్కువిస్తానని జగన్ రెడ్డి అంగన్ వాడీ సిబ్బందికి హామీ ఇవ్వడం నిజంకాదా? ఆ లెక్కన ఇప్పుడు వారికి అందుతున్న రూ.11,500 జీతాన్ని రూ.14,600లకు పెంచకుండా వారిని వేధించడం ఏమిటి?
గతంలో జగన్ రెడ్డి అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడంలేదు? తెలంగాణలో అంగన్ వాడీ సిబ్బందికి అందే వేతనం కంటే అదనంగా రూ.1000లు పెంచుతానని రాష్ట్రంలోని అంగన్ వాడీ సిబ్బందికి హామీ ఇచ్చింది నిజంకాదా? ప్రస్తుతం తెలంగాణలో అంగన్ వాడీ సిబ్బందికి రూ.13,600లు చెల్లిస్తున్నారు. దానికి రూ.1000 అదనంగా ఇస్తానన్న హామీ ప్రకారం జగన్ రెడ్డి రూ.14,600లు చెల్లించాలి. అలా చెల్లిస్తానని ఈ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారా..లేదా? హామీని నెరవేర్చమని అంగన్ వాడీ సిబ్బంది అడిగితే, వారిపై ఎస్మాచట్టం ప్రయోగిస్తారా?

రాష్ట్రంలో సుమారుగా లక్షా10వేలమంది అంగన్ వాడీ సిబ్బంది ఉన్నారు. వారికి గతంలో రూ.4,500లుగా ఉన్న జీతాన్ని చంద్రబాబు ఏకంగా 150 శాతం పెంచి రూ.10,500లు చేశారు. 2014-19 మధ్య ఎన్నిఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ చంద్రబాబు అంగన్ వాడీ సిబ్బంది జీతాన్ని రూ.6వేలు పెంచి వారికి న్యాయంచేశారు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ఇన్నేళ్లలో కేవలం రూ.1000 మాత్రమే పెంచి, రూ10,500ల జీతాన్ని రూ.11,500లు చేసి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణ కంటే రూ.1000 అధికంగా ఇస్తానన్న ఈ సైకో ముఖ్యమంత్రి, కేవలం రూ.1000 పెంచి అంగన్ వాడీ సిబ్బందికి తీరని అన్యాయం చేశాడు. జగన్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలి అంటే, అంగన్ వాడీ సిబ్బందికి ఇప్పుడు ఇస్తున్న రూ.11,500లకు అదనంగా రూ.3,100ల జీతం పెంచి, రూ.14,600లు చెల్లించాలి.

తాను ఇచ్చిన హామీప్రకారం జగన్ రెడ్డి అంగన్ వాడీ సిబ్బంది జీతాలు పెంచితే, ఏటా ప్రభుత్వంపై పడే భారం కేవలం రూ.395 కోట్లు మాత్రమే. రుషికొండపై తన విలాసాలకోసం నిర్మించుకున్న ప్యాలెస్ కు తగలేసిన రూ.433 కోట్లకంటే తక్కువే
తాను ఇచ్చిన హామీ ప్రకారం జగన్ రెడ్డి అంగన్ వాడీ సిబ్బంది జీతాలు పెంచినంత మాత్రాన, ఈ ప్రభుత్వంపై మోయలేనివిధంగా అదనపు భారమేమీ పడదు. రాష్ట్రంలో ఉన్న లక్షా10వేల మంది అంగన్ వాడీ సిబ్బందికి రూ.3వేలు పెంచితే (ఒక్కొక్కరికీ) రాష్ట్రప్రభుత్వంపై నెలకు రూ.33కోట్ల భారం మాత్రమే పడుతుంది. సంవత్సరానికి రూ.395కోట్లు అవుతుంది. ఆ మొత్తమేమీ ఈ ప్రభుత్వానికి భారం కానేకాదు. జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చుతో పోలిస్తే, అదేమీ పెద్ద భారం కాదు. అంగన్ వాడీ సిబ్బందికి రూ.395 కోట్లు చెల్లించడానికి మనసురాదు గానీ, రుషికొండపై అధునాతన హంగులతో తాను నిర్మించుకున్న భారీ ప్యాలెస్ నిర్మాణానికి మాత్రం జగన్ రెడ్డి రూ.433కోట్ల ప్రజలసొమ్ము తగలేశాడు.

రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి, తన విలాసాలకోసం అక్షరాలా నాలుగువందల ముప్పైమూడు కోట్లు దుర్వినియో గం చేస్తున్నారని ఆధారాలతో సహా పత్రికల్లోనే వచ్చింది. అంగన్ వాడీ సిబ్బందికి ఒక ఏడాది మొత్తానికి పెంచే జీతాల మొత్తం సొమ్ము, రుషికొండపై తన ప్యాలెస్ నిర్మాణానికి తగలేసిన సొమ్ముపాటి కూడా చేయదని జగన్ రెడ్డి గ్రహించాలి. అంగన్ వాడీ సిబ్బంది అంటే జగన్ రెడ్డికి ఆ మాత్రం విలువ కూడా లేదు. ఇదేనా జగన్ రెడ్డి పేదల పక్షాన చూపుతున్న పక్షపాతం? రూ.433కోట్లతో నిర్మిస్తున్న ప్యాలెస్ లలో నివసించే జగన్ రెడ్డి పేదవాడా?

తాను ఇచ్చిన హామీ ప్రకారం జగన్ రెడ్డి అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచితే రాష్ట్రప్రభుత్వానికి సంవత్సరా నికి రూ.395 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. ప్రతి వారం అప్పులకోసం ఆర్బీఐ వద్దకు బొచ్చెపట్టుకెళ్లే జగన్ రెడ్డి ప్రభుత్వానికి అంగన్ వాడీ సిబ్బంది న్యాయ మైన డిమాండ్లు పరిష్కరించడానికి మాత్రం డబ్బులుండవు. నేడు రాష్ట్రం యొక్క అప్పులు దాదాపు రూ.12లక్షల కోట్లు దాటిపోయి, ఏపీ యొక్క స్థూలఉత్పత్తితో సరిసమానంగా రాష్ట్ర అప్పులు చేరాయి.

108-104 వాహనాల సిబ్బందికి జీతభత్యాలు ఇవ్వలేని తన బినామీ సంస్థ అరబిందోకు, జగన్ రెడ్డి వేలకోట్ల విలువైన రామాయపట్నం పోర్టు, సోలార్ ప్రాజెక్టులు,12వేల ఎకరాల విలువైన భూములు దోచిపెట్టాడు
108-104 అంబులెన్సుల సిబ్బంది గోడు కూడా జగన్ రెడ్డికి పట్టడం లేదు. తన బినామీ కంపెనీ అరబిందోకు 108-104 వాహానాల నిర్వహణను కట్టబెట్టిన జగన్, ఆ వ్యవహారంలో కూడా భారీ స్కామ్ కు పాల్పడ్డాడు. ప్రతి సంవత్సరం కేవలం ఒక్క 108 అంబులెన్సుల నిర్వహణకోసం జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.188 కోట్లు. అరబిందో సంస్థ వాహానాల నిర్వహణ పేరుతో ఏటా ప్రభుత్వం నుంచి ఇంత సొమ్ము తీసుకుంటూ, సిబ్బందికి కనీసం జీతాలు కూడా చెల్లించడంలేదు. 108-104 సిబ్బందికి రెండునెలలుగా జీతాల్లేవు, రెండేళ్లుగా బోనస్ లు చెల్లించడం లేదు. వారికి చెల్లించాల్సిన బోనస్ బకాయిలే దాదాపుగా రూ.50కోట్లుంటే, జీతాలు రూ.25కోట్లు చెల్లించాలి.

మొత్తంగా రూ.75కోట్లు 108-104 అంబులెన్సుల సిబ్బందికి అరబిందో సంస్థ చెల్లించాలి. సదరు సంస్థ ప్రావిడెం ట్ ఫండ్ వాటా కింద ఇవ్వాల్సిన సొమ్ము కూడా చెల్లించడంలేదు. మరి ఏటా ప్రభుత్వం నుంచి నిర్వహణ పేరుతో తీసుకుంటున్న రూ.188 కోట్లు ఎక్కడికి పోతున్నాయో అరబిందో యాజమాన్యం సమాధానం చెప్పాలి. 108-104 సిబ్బందికి జీతాలు ఇవ్వని సంస్థకు జగన్ రెడ్డి ఏకంగా రామాయపట్నం పోర్టే కట్టబెట్టాడు. అంతటితో తృప్తి పడకుండా అవుకు వద్ద 800 మెగావాట్ల సోలార్ పార్క్, శింగనమల వద్ద మరో 800 మెగావాట్లు మొత్తంగా 4,800 కోట్ల విలువైన సోలార్ పవర్ పార్కుల్ని అరబిందో సంస్థకు ధారాధత్తం చేశాడు.

దాదాపుగా 12వేల ఎకరాల భూముల్ని కట్టబెట్టాడు. అంబులెన్సుల సిబ్బందికి జీతాలు ఇవ్వని సంస్థకు ఇన్నివేలకోట్లు కట్టబెట్టడం జగన్ రెడ్డికే చెల్లింది. 108-104 అంబులెన్సులు కుయ్..కుయ్ అంటూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయని జగన్ రెడ్డి చెబుతాడు. కానీ వాస్తవంలో అంబులెన్సుల సిబ్బంది మొత్తం కుయ్యో .. మొర్రో అంటూ ఏడుస్తున్నారు. ఈ వ్యవహారంపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు?

కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుధ్య కార్మికుల్ని కూడా రోడ్డున పడేసిన ఘనుడు జగన్ రెడ్డి
మున్సిపల్ కార్మికులు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పెద్దఎత్తున ఆందోళన చేస్తుంటే, చెత్తపై పన్ను వేసిన ఈ చెత్త ముఖ్యమంత్రి వారి గోడు ఎందు కు పట్టించుకోవడంలేదు? కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుధ్యకార్మికుల్ని రోడ్డున పడేస్తారా? కనీస వేతనం అడుగుతున్న వారిపై కనికరం చూపరా? కోవిడ్ సమయంలో విధినిర్వ హణలో ప్రాణాలు కోల్పోయిన మున్సిపల్ సిబ్బంది కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానన్న ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు రూపాయి కూడా సాయం చేయలేదు. అత్యంత దుర్మార్గంగా చెత్తపై కూడా పన్నువేసి రాష్టప్రజల నుంచి కోట్లరూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్న జగన్ రెడ్డి, ఆ సొమ్మంతా ఎవరికి దోచిపెడుతు న్నాడు?

రాష్ట్రమంతా ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోతున్నా.. జగన్ రెడ్డిలో స్పందనలేదు. పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలన్న న్యాయబ ద్ధమైన డిమాండ్లపై ప్రభుత్వం దేనికి దృష్టి పెట్టడంలేదు? చెత్తపై పన్ను వేస్తున్న జగన్ రెడ్డి.. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులపై లాఠీ ఛార్జ్ చేయించడం అతని కసాయితనానికి నిదర్శనం.

సర్వశిక్షా అభియాన్ సిబ్బందికి ప్రభుత్వ వాటాగా జగన్ రెడ్డి 40శాతం సొమ్ము కూడా చెల్లించడంలేదు
సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ సిబ్బందికి చెల్లించే జీతభత్యాల్లో 60శాతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. రాష్ట్రప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన 40శాతం సొమ్ముని కూడా సక్రమంగా ఇవ్వడంలేదు. జగన్ రెడ్డి సర్కార్ తన వాటాగా ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఇవ్వనందునే సర్వశిక్షా అభియాన్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందక రోడ్లెక్కారు. రాష్ట్ర వాటాగా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ కు కేటాయించా ల్సిన 40శాతం నిధులు జగన్ రెడ్డి చెల్లించనందునే, ఆ ప్రాజెక్ట్ పరిధిలోని సిబ్బంది ఆందోళన బాటపట్టారు.

జగన్ రెడ్డి అబద్ధపు రాతలతో ఇచ్చే భారీ ప్రకటనలు.. తన రంగులపిచ్చికి తగలేసిన సొమ్ముతో పోలిస్తే, న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న వివిధ వర్గాల సిబ్బందికి ఇవ్వాల్సిన సొమ్ము సగం కూడా ఉండదు
ప్రజలకోసం పనిచేసే ఏ వర్గానికి, ఏ విభాగానికి న్యాయం చేయని జగన్ రెడ్డి తన అవినీతి పత్రిక సాక్షికి మాత్రం ప్రకటనలరూపంలో ఈ నాలుగున్నరేళ్లలో వందలకోట్లు తగలేశాడు. రుషికొండపై ఇప్పుడు నిర్మించుకుంటున్న భారీ ప్యాలెస్ కంటే ముందు, తాడేపల్లిలో తాను ఉంటున్న ప్యాలెస్ సుందరీకరణ కు కూడా జగన్ రెడ్డి వందలకోట్ల ప్రజలసొమ్ము తగలేశాడు. ఇడుపుల పాయలోని ప్యాలెస్ అభివృద్ధికి కూడా కోట్లరూపాయలు దుర్వినియోగం చేశాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర నిర్మాణాలపై తన పార్టీ రంగులు పులమడానికి వేలకోట్ల ప్రజాధనాన్ని దుబారా చేసిన విషయం నేటికీ మన కళ్లెదుట కనిపిస్తోంది. తన ప్యాలెస్ ల నిర్మాణం, సాక్షి పత్రికకు ప్రకటనలకోసం, రంగులకోసం తగలేసిన వేలకోట్ల సొమ్ముతో పోలిస్తే, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నవారి డిమాండ్లు తీర్చడానికి అవసరమైన సొమ్ము సగం కూడా ఉండదు.

లక్షా10వేల మంది అంగన్ వాడీ సిబ్బంది జీవితాలకంటే జగన్ రెడ్డికి తన విలాసాలకోసం నిర్మిస్తున్న రుషికొండ ప్యాలెస్సే ఎక్కువైపోయింది. జగన్ రెడ్డి బినామీ సంస్థ అరబిందో వద్ద డబ్బులేక 108-104 సిబ్బందికి జీతాలు ఇవ్వడంలేదా? ఏటా ప్రభుత్వం నుంచి అరబిందో సంస్థకు దోచిపెడుతున్న వందలకోట్లు ఎక్కడికి పోతున్నా యి? పైకి బీదఅరుపులు..చేసేదేమో వేలకోట్ల ప్రజలసొమ్ము దుర్వినియోగం. లక్షల కోట్ల ప్రజలసొమ్ము లూఠీచేసిన జగన్ రెడ్డే దేశంలోనే అతిపెద్ద పెత్తం దారుడు. తానుఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు తెలుగుదేశం పార్టీ రోడ్లెక్కిన సిబ్బంది పక్షాన నిలిచి, వారికి అండగా పోరాడుతుంది.

మనసురాక.. మానవత్వం లేకనే ఆందోళనలు చేస్తున్న సిబ్బందిపై జగన్ రెడ్డి పోలీసుల్ని, ఎస్మా చట్టాల్ని ప్రయోగిస్తున్నాడు గానీ డబ్బులేక కాదు
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాకూడా 2014-19 మధ్యన చంద్రబాబు ఉద్యోగులకు, ప్రజలకు న్యాయంచేశారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నాకూడా లెక్క చేయకుండా అంగన్ వాడీ సిబ్బందికి రూ.6వేల జీతం పెంచారు. లక్షా 10వేల మంది అంగన్ వాడీ సిబ్బందికి నెలకు రూ.6వేల చొప్పున సంవత్సరానికి రూ.700కోట్ల జీతంపెంచారు. నేడు జగన్ రెడ్డిలాగా బీదఅరుపుల అరవడంగానీ, పోలీసులతో లాఠీఛార్జ్ లు చేయించడం గానీ చేయలేదు. జగన్ రెడ్డిలాగా చంద్రబాబు రంగులు.. ప్రకటనలు.. తన విలాసాల కోసం వేలకోట్లు తగలలేయలేదు.

ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించారు కాబట్టే, అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తి పరిచి సంతోషంగా ఉంచారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ రెడ్డి భూస్థాపితం కావడం ఖాయం. ఇంతమంది కన్నీళ్లకు కారకుడై, ఇందరి కడుపులు మాడుస్తున్న జగన్ రెడ్డికి దేవుడు కూడా వేయని శిక్షల్ని ప్రజలు వేయబోతున్నారు. నిజంగా డబ్బులేక జగన్ రెడ్డి ఆందోళనలు చేస్తున్నవారికి న్యాయం చేయడం లేదు. కేవలం మనసురాక… మానవత్వం లేకనే వివిధవర్గాలపై పోలీసుల్ని ప్రయోగిస్తూ, ఎస్మావంటి చట్టాలు ప్రయోగిస్తున్నాడు.” అని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE