Suryaa.co.in

Andhra Pradesh

సంక్షేమ సారధి జగన్ ని మళ్లీ గెలిపించుకుందాం

– నరసరావుపేట నియోజకవర్గ పార్టీ నాయకులతో ఎంపీ విజయసాయిరెడ్డి

తాడేపల్లి, జనవరి8: ప్రజా సంక్షేమమే పరమావధిగా నాలుగున్నర ఏళ్ల కాలంలో విప్లవాత్మకమైన సంస్కరణను తెచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి దక్షిణ కోస్తా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు..సోమవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గంలో ద్వితీయ తృతీయ స్థాయి నాయకుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు..నియోజకవర్గంలో సమస్యలను స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోని పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు..ఏవైనా సమస్యలు పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలని, సాధ్యమైనంతవరకు పరిష్కరిస్తానని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్తానని వారికి వివరించారు. వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కవ మెజారిటీతో గెలిపించుకోవాలని నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి 2014,2019 లో గెలిచిన విధంగానే మరోసారి గెలిపించి హాట్రిక్ సాధించాలని అన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రతి కుటుంబం సంతోషమే ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు.. నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.

పార్టీలో నాయకులు మధ్య భిన్నాయిప్రాయాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పార్టీ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి కలిసి ముందుకు వెళ్లాలన్నారు.. పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం జగన్ కృషి పట్టుదల వల్లనే వచ్చిందని ఆయన అన్నారు.. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ రాష్ట్రం దశ దిశను మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందని అన్నారు.

ఆయన సారధ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని చెప్పారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,పార్టీ నాయకులు గజ్జల బ్రహ్మారెడ్డి, ఈశ్వర్ రెడ్డి,హానిఫ్,ఓబుల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు..

LEAVE A RESPONSE