Suryaa.co.in

Andhra Pradesh

పవన్ కళ్యాణ్ అయిదేళ్ళ సంపాదన రూ.114.76 కోట్లు

  • ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.92 కోట్లు
  • అందచేసిన విరాళాలు రూ.20 కోట్లు
  • అప్పులు రూ.26 కోట్లు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు తెలిపారు. గత అయిదేళ్ళలో  పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114.76,78,300 కోట్లు. ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875 కోట్లు, జీఎస్టీకి రూ.28,84,70,000 చెల్లించారు.

పవన్ కళ్యాణ్ కి అప్పులు రూ.64,26,84,453 కోట్లు ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453 కోట్లు, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46,70,000 ఉన్నాయి.

విరాళాలు రూ.20 కోట్లుపైనే

పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు.

వివిధ సంస్థలకు రూ.3,32,11,717 కోట్లు విరాళాలు అందచేశారు. ఆ వివరాలివి..

  • కేంద్రీయ సైనిక్ బోర్డు – రూ.1 కోటి
  • పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ – రూ.1 కోటి
  • ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు
  • తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు
  • శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ – రూ.30,11,717
  • పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ – రూ.2 లక్షలు

LEAVE A RESPONSE