Suryaa.co.in

Andhra Pradesh

నవజాత శిశువులపై ప్రత్యేక దృష్టి సారించండి

– ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

విజయవాడ:నవజాత శిశువుల అనారోగ్య పరిస్థితులపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది,బుధవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు,సభ్యులు గొండు సీతారాం,కుమారి ఆదిలక్ష్మి త్రిపర్ణ, జంగం రాజేంద్ర ప్రసాద్ లు సందర్శించారు.

ఆసుపత్రిలో గత 3 ఏళ్ళు నుండి నేటి వరకు నమోదైన నవజాత శిశువులు వివరాలు,వారు పొందిన వైద్య విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు,నవ జాత శిశువుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ ,రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లోని నవ జాత శిశువుల విభాగాలను సందర్శించి వాటిల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సిఫారసులు చేయనున్నట్టు చెప్పారు,బాలల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న తమ కమిషన్ ఆసుపత్రుల్లో వివిధ చర్యలకు ప్రణాళికతో కమిషన్ అడుగులు వేస్తున్నట్టు చెప్పారు.

ఈ పర్యటనలో ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ.డాక్టర్ యు.శోభ,వైద్యులు సునీత,అశ్వినీ,ఖ్యాతి,సౌజన్య,శేషు బాబు,ఇంచార్జ్ నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE