Suryaa.co.in

Andhra Pradesh

సహాయక చర్యల్లో పెమ్మసాని ఫౌండేషన్

– రాయపాడు పునరావాస కేంద్రాల్లో రగ్గులు, వాటర్ క్యాన్ల పంపిణీ

తాడికొండ: గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పెమ్మసాని ఫౌండేషన్ నిర్వాహకులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నిర్విరామంగా వరద బాధితులకు చేయూతనిస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులు తాజాగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాడికొండ నియోజకవర్గంలోని రాయపూడి మండలం, పెదలంకలో 250 కుటుంబాలకు చెందిన వెయ్యి మందికి రగ్గులను గురువారం పంపిణీ చేశారు. అదే విధంగా అన్నవరపు లంకలో 250 వాటర్ క్యాన్లు, కొత్తూరు లంకలో 300 వాటర్ క్యాన్లు కలిపి గడిచిన 2 రోజుల్లో ఏడు వేల వాటర్ బాటిల్స్ అందించారు.

కొల్లిపర మండలం లంక గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు నిత్యం మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు వరద బాధితులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఫౌండేషన్ వెన్నంటే ఉంటుందని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE