Suryaa.co.in

Telangana

పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి

– పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడం సీఎం చేతగానితనం కాదా?
– బీఆర్ఎస్ నేత జి .దేవీప్రసాద్

హైదరాబాద్ : పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పదవీ విరమణ అంటే ఉద్యోగులు భయపడుతున్నారు. ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు. జనవరి 25 వరకు 8,764 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి రూపాయి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తుంది.

గత మార్చి నుండి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రాలేదు. పెన్షనర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.రిటైర్డ్ అయిన ఉద్యోగులు సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారు.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రిటైర్డ్ అయిన ఉద్యోగులను అదే రోజు వారికి బెనిఫిట్స్ ఇచ్చారు. కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు రావడం లేదు. అంగన్ వాడీ,ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని చెప్పి మాట తప్పారు. 14 నెలలు అయినా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదు.

35 సార్లు సీఎం రేవంత్రెడ్డికి ఢీల్లి వెళ్లి వచ్చారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నిధులు తేలేకపోయారు. కులగణన,ఎస్సీ వర్గీకరణపై ఎవరూ సంతృప్తిగా లేరు. కులగణన సర్వేను చింపివేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటున్నారు. రాష్ట్రంలో 7వ గ్యారెంటీగా నిర్బంధం కొనసాగుతోంది.

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడం సీఎం చేతగానితనం కాదా? సీఎం రేవంత్ రెడ్డి స్వంత పార్టీని ఒప్పించి మంత్రివర్గ విస్తరణ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

LEAVE A RESPONSE