– సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై సీఎస్ శాంతి కుమారి కి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి,ఎంఎల్ఏ వివేకానంద, ఎంఎల్ఏ సజయ్ కుమార్
హైదరాబాద్: సిరిసిల్లలో కేటీఆర్ పై అభిమానంతో ఓ అభిమాని టీ షాప్ నిర్వహిస్తున్నారు.
ట్రేడ్ లైసెన్స్ లేదని షాప్ క్లోజ్ చేయడమే కాకుండా, వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని ఇబ్బందుల గురిచేస్తున్నారు. సిరిసిల్ల కలెక్టర్ అధికార దర్పంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారం దుర్వినియోగం చేసి ప్రజల్ని భయపెడుతున్నారు.
సిరిసిల్ల కలెక్టర్ తీరుపై సి ఎస్ కు ఫిర్యాదు చేశాం. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మిల్క్ సెంటర్ ని క్లోజ్ చేశారు. బీఆర్‌ఎస్ కు అనుకూలంగా ఉన్న వారి నీ అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర పాలన పాలన ఏ విధంగా ఉందో సీఎం మాటలను బట్టి అర్థమవుతుంది. ఒక పైరవీ చేయమని అంటే.. నాలుగు పైరవీలు చేస్తున్నారని సీఎం అన్నారు. పాలన పై పట్టు ఎలా ఉందో సీఎం మాటలో కనిపిస్తుంది.
అధికారులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ పని చేస్తున్నారు . టీ షాప్ యజమానిని ఇప్పుడు ఇబ్బంది పెట్టారు. ఇలా మొదటి సారి కాదు. కొంత మంది అధికారులు బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నారు. కొందరు ఐపీఎస్ లు కేటీఆర్,హరీష్ రావు ల పేర్లు చెప్పాలని అని ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో అధికారుల పనితీరుపై సీఎస్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. కొంత మంది అధికారులు కాంగ్రెస్ కు తొత్తు లాగా పనిచేస్తున్నారు. చర్యలు తీసుకొని నియంత్రించాలి లేకపోతే బీఆర్‌ఎస్ పార్టీ నుండి ఆందోళన చేస్తాం