ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు నిజామాబాద్ సభలో పాల్గొని తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు
నరేంద్ర మోడీ సభ భారీగా జనం హాజరయ్యారు
ప్రధాని నరేంద్ర మోడీ మీద తెలంగాణ ప్రజలకు ప్రగాఢ నమ్మకం ఉంది
దళిత సీఎం అని దళితులకు వెన్ను పోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్
మూడెకరాలు భూమి ఇస్తాను అని శాసనసభలో చెప్పి మోసం చేశాడు
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని మోసం అలాంటి వ్యక్తి బీజేపీని విమర్శించే హక్కు లేదు
రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్బంగా కిషన్ రెడ్డి
తెలంగాణ సాధనాలో ఎంత మంది బలిదానం చేశారు. 369 మంది తెలంగాణ విద్యార్ధుల చంపిన ఘనత కాంగ్రెస్‌ది. చివరి దశ ఉద్యమంలో కూడా 1200 మంది చనిపోవడం కారణం కూడా కాంగ్రెస్.
కాంగ్రెస్ కు తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు. బీజేపీ లేకుంటే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేదా? తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ ఓటింగ్ లో పాల్గోన్నాడా? అలాంటి వ్యక్తికి తెలంగాణను ఏలే హక్కు లేదు. ప్రజలను కేసీఆర్ తాగుడుకు బానిసలు చేస్తున్నాడు. ఒక్కొ చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టి మరో చేతిలో లాక్కుంటున్నాడు. తాగుడు వల్ల అనేక మంది ఆడబిడ్డల పుస్తెలు తెగినయ్.
సంక్షేమం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదు. ఎలక్షన్స్ ముందు భూములు అమ్మాడు. మద్యం షాపులు వేసాడు. రింగ్ రోడ్ ను తెగనమ్మాడు. మధ్యం అమ్మినదే, అప్పులు చేయనిదే ప్రభుత్వం నడిచేలా లేదు. తెలంగాణ బంగారం కాలేదు కానీ కేసీఆర్ , బీఆర్ఎస్ నేతల కుటుంబం మాత్రం బంగారమయ్యాయి.
నిజాం వారసులైన మజ్లీస్ తో కేసీఆర్ చేతులు కలిపాడు. మోడీ పర్యటన తర్వాత తెలంగాణలో బీజేపీ బలం మరింతగా పెరిగింది. ఖచ్చితంగా తెలంగాణ కాషాయ జెండా ఎగురుతుంది.కేసీఆర్ మహిళ వ్యతిరేకి..మహిళల వ్యతిరేకి అయిన తెలంగాణ కాంగ్రెస్ ముగ్గురు ఎంపీ లు మహిళా రిజర్వేషన్ల బిల్లు కు దూరంగా ఉన్నారు. BRS పార్టీ చేసేవి బట్టే బాజ్ పనులు..చెప్పేవి శ్రీరంగ నీతులు. తెలంగాణలో కొన్ని మంది కుక్కలు మోడీ పై ట్విట్టర్లో మొరుగుతున్నాయి.
తండ్రిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన నాయకుడి స్థాయి ఎంత ?చదివింది అమెరికాలో థర్డ్ గ్రేడ్ లత్కొర్ మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ చాలా ప్రమాదకర స్థాయిలో పడింది.ఇతర ప్రాంతాల ముస్లింలకు ఓటర్ జాబితాలో పేర్లు నమోదుచేసుకొని పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారు.కాంగ్రెస్, BRS సహకారంతో అధికారంలోకి రావాలని MIM కుతూహలంగా ఉంది. BRS అభ్యర్థులు ప్రజల దగ్గరకు వెళ్ళడం లేదు… సుట్ కేసులతో దారుసలం వెళ్లి వంగి వంగి దండాలు పెట్టి.. తమ దగ్గర MIM అభ్యర్థిని పోటీలో పెట్టవద్దని బతిమాలుతున్నారు.
రాష్ట్రంలో సకల సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ రెండో వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని హైదరాబాద్ రావాలి దానికి మీరందరు సిద్ధం కావాలి.