Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతేనే ప్రజా సమస్యలు పరిష్కారం

-బీఆర్ఎస్ పాలనలో తండాలు, బస్తీల్లో స్కూళ్లన్నీ మూసేస్తున్రు
– బిజెపి తెలగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్

5 నుంచి 6 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు… టీచర్లు, వీఆర్ఏలు, వీఆర్వోలు అందరినీ ఇబ్బందిపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 14 ఏళ్లు తెలంగాణలో ఉద్యమంలో, రెండు సార్లు పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశా. ఎంతోమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నాడు.. .జీతాలు రావట్లేదని దరఖాస్తులు ఇచ్చిన్రు.

ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. ఉద్యోగులే ఎక్కువ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవాళ్లు. ప్రజలు చైతన్య వంతం కావాలి.. అప్పుడే, తప్పుచేసే వాళ్లను గల్లా పట్టి అడుగుతారు. బీఆర్ఎస్ పాలనలో తండాలు, బస్తీల్లో స్కూళ్లన్నీ మూసేస్తున్రు.రేషనలైజేషన్ పేరిట టీచర్లను తగ్గించుకుపోతున్రు. చాలాచోట్ల గవర్నమెంట్ స్కూళ్లలో స్కావెంజర్లు లేరు. హెడ్మాస్టర్లే వార్డెన్లుగా, అటెండర్లుగా పని చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు.

భూములమ్మితే తప్ప రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి. ధనిక రాష్ట్రమని, సంపదకు కొదవలేదని, అన్నింట్లో నెంబర్ వన్ అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. అప్పులకుప్పగా మార్చిండు.

సమైక్య రాష్ట్రంలో 294 మంది ఉన్న సభలో అసెంబ్లీలో మాట్లాడటానికి టైం ఇచ్చేది. కానీ నేడు అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మేం కొట్లాడుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతేనే ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి.

LEAVE A RESPONSE