– సిట్‌కు లభ్యమైన ఆధారాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2018 ఎన్నికల వేళ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులకు తాజాగా ఆధారాలు లభించాయి.
ప్రణీత్‌రావు నుంచి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుకు ట్యాపింగ్ సమాచారం చేరేది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే టాస్క్‌ఫోర్స్ టీమ్ రంగంలోకి దిగింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్యారడైజ్ వద్ద భవ్య ఆనంద్‌ప్రసాద్‌కు చెందిన రూ. 70లక్షల డబ్బును టాస్క్‌ఫోర్స్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం.
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్‌రావు బంధువులకు చెందిన రూ. కోటి కూడా ఫోన్ ట్యాపింగ్‌తో వచ్చిన సమాచారం మేరకే సీజ్ చేశారని తెలుస్తోంది.
బేగంపేట పరిధిలో రాధాకిషన్‌రావు, ఆయన బృందం రూ. కోటి సీజ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. నల్గొండ కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.