Suryaa.co.in

Political News

తెలుగుదేశం పార్టీ అప్పుల విలువ రూ.30 కోట్లు

– వివరాలు వెల్లడించిన ఏడీఆర్
– బీజేపీకి రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు
– రెండోస్థానంలో బీఎస్పీ (రూ.698 కోట్లు)
– అప్పుల్లో కాంగ్రెస్ టాప్

దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని పార్టీల్లోకి బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. జాతీయ పార్టీలa మొత్తం ఆస్తుల విలువలో ఇది 69.37 శాతం. ఆ తర్వాతి స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉంది. బీఎస్పీకి ఆస్తుల విలువ రూ.698.33 కోట్లు కాగా, పెద్ద పార్టీ కాంగ్రెస్ కు రూ.588.16 కోట్ల ఆస్తులున్నాయి. ఇక aప్రాంతీయ పార్టీల విషయానికొస్తే… సమాజ్ వాదీ పార్టీకి అత్యధికంగా రూ.563.47 కోట్ల ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. రెండోస్థానంలో తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి రూ.301.47 కోట్ల ఆస్తులున్నాయి. రూ.267.61 కోట్లతో అన్నాడీఎంకే పార్టీ మూడోస్థానంలో ఉంది. ఫిక్స్ డ్ డిపాజిట్లు, రుణాలు, ముందస్తు చెల్లింపులు, పెట్టుబడులు, ఇతరత్రా వివరాల ప్రాతిపదికన ఈ ఆస్తుల విలువ లెక్కకట్టారు. జాతీయ పార్టీల అప్పుల విషయానికొస్తే… కాంగ్రెస్ అగ్రభాగాన నిలుస్తుంది. హస్తం పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులున్నాయట. తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (రూ.11.32 కోట్లు) ఉంది. ప్రాంతీయ పార్టీల సంగతి చూస్తే… టీడీపీకి అత్యధిక అప్పులు ఉన్నాయి. టీడీపీ అప్పులు విలువ రూ.30.342 కోట్లు. రూ.8.05 కోట్ల అప్పుతో డీఎంకే రెండోస్థానంలో ఉంది.

LEAVE A RESPONSE