– పీపీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఫైర్
2022-2023 బడ్జెట్ రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టారు.ప్రతిపక్షంలో ఉన్నాం ఏం మాట్లాడినా విమర్శిస్తారు అనే అవకాశం సందర్భం కనబడుతుంది. పాలకులు కూడా ప్రతిపక్షాల్లో ఉన్న అంశాలను గుర్తు చేసుకుంటే ఎటువంటి వివాదాలకు తావు ఉండదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.ప్రతిపక్షంలో ఉంది.ఇలాంటి బడ్జెట్ లను ఎన్నో రూపకల్పన చేసింది.మేము ప్రభుత్వంలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా బడ్జెట్ గురించి మాట్లాడే అవకాశం వివర్ణాత్మకంతో చెప్పాము.ఈ రాష్ట్ర బడ్జెట్ లో పెట్టుబడి వ్యయం 29 వేల కోట్లు అన్నారు.
11 శాతం కూడా పెట్టుబడి వ్యయం లేదన్నది చాలా స్పష్టంగా అర్ధమవుతుంది.11 శాతం పెట్టుపడి తో వచ్చే సంవత్సరాల్లో అభివృద్ధి జరగదు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 2004 – 14 వరకు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెట్టుబడి వ్యయం ఎక్కువ పెట్టిన చరిత్ర మాది.పెట్టుబడి వ్యయం మీదనే వీళ్ళ డొల్లతనం కనబడుతుంది..ఆ పెట్టుబడి వ్యయం తో రాష్ట్ర భవిష్యత్ కి ఆలోచన లేదు.
నిన్నగాక మొన్న వచ్చిన వారి వల్ల ఈ అభివృద్ధి జరగలేదు. ఆ నాడు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదుల వల్లే అభివృద్ధి జరిగింది.పెట్టుబడి వ్యయం ఎక్కువ పెట్టగలిగితేనే భవిష్యత్ కి రాష్ట్రానికి అది ఒక పునాది అవుతుంది.ఉమ్మడి రాష్ట్రంలో ఉభయగోదావరి జిలాల్లో కంటే కరీంనగర్ లో ఎక్కువ సాగు జరిగింది.ప్రభుత్వం పెట్టుబడి వ్యయాన్ని పెంచాల్సిన అంశాన్ని నీరుగార్చింది.
అప్పుల తెలంగాణ గా చేసి ఈ year లో మరో 55,000 Crores loan తీసుకుంటున్నారు కదా ? తీసుకంటున్న అప్పుల్లో సగం కూడా పెట్టుబడి వ్యయం లేదు కదా ? ఈ విధంగా పరిపాలనా ?మొన్న వరి ధాన్యం పై గోల చేసిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికంటే ఒక టన్ను అయిన ఎక్కువ తీసుకున్నారా?ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలం చేసమంటున్న మీరు వరి ఎందుకు వేయద్దంటున్నారు? మరి ప్రత్యామ్నాయ పంటల గురించి బడ్జెట్ ప్రసంగంలో ఉందా?
64 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్తున్న మీరు వారికి ఎం భరోసా ఇస్తున్నారు.ఏమైనా మాట్లాడితే రైతు బందు అంటున్న కెసిఆర్ రైతుబంధు ఎవ్వరికి వెళ్తుందో తెలియదా.వ్యవసాయం చేయనివారికి పట్టణాల్లో బిజినెస్లు చేసుకునేవారికి రైతుబంధు వెళుతుంది.14 లక్షల మంది కౌలు రైతులకు ఏం లాభం లేదు కదా.కౌలు రైతులకు ఇన్సూరెన్స్ లేదు ఈ ఏడు సంవత్సరాల్లో పంట నష్టపరిహారం ఇవ్వడం లేదు కదా… రాష్ట్ర ప్రభుత్వం మద్దతుదరులకు డబ్బులు కేటాయించడం లేదు.
కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే మద్దతు ధరల ఫండ్ నుండి ఒక్క నయాపైసా తీసుకునే అవకాశం లేదు.విత్తనాల ధరలు తగ్గించిన చరిత్ర కాంగ్రెస్ది.మీ రుణమాఫీ ఎక్కడ ? ఇప్పటివరకు అతీగతీ లేదు కదా కేసీఆర్.ధరణి గురించి గొప్పలు చెప్తున్నారు అది ఎందుకు పెట్టారో మాకు తెలియదా. అన్యాక్రాంతం భూములను తమ వాళ్ళకి ఇచ్చుకోవడానికి ధరణి.
Sc St sub plan – ఇప్పటివరకు చట్టబద్ధంగా ఖర్చు పెట్టాల్సిన 48 వేల కోట్లు ఖర్చు పెట్టలేదు కదా.నియోజకవర్గానికి వందమందికి చొప్పున దళిత బంధు ఇస్తామంటూ 17 వేల కోట్లు పెట్టారు.17 లక్షల కుటుంబాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు వారందరికీ ఇవ్వాలంటే 136 సంవత్సరాలు పడుతుంది.
డబుల్ బెడ్ రూమ్ కి 6:30 లక్షలు అని ఇప్పుడు మూడు లక్షలు ఇస్తామని చెబుతున్నారు.
( 22 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పిన మీరు ) ఇప్పుడు మూడు లక్షలు డబ్బులు ఇస్తే డబుల్ బెడ్ రూమ్ అవుతుందా.స్థలం ఉన్న వాళ్ళకే మూడు లక్షలు ఇస్తే జాగా లేని వాళ్ళకి మూడు లక్షలతో అవుతాదా.మోడీ కేసీఆర్ సాష్టాంగ నమస్కారం పెడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెబుతాడు.పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాలని సాధించలేదు కదా కేసీఆర్.
సర్వ శిక్ష అభియాన్ లో ఏడు వేల కోట్లు ఉంటే ఒక్క నయాపైసా ఖర్చు పెట్టలేదు.ఇప్పటికీ లక్ష కోట్లు ఖర్చుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర పదిహేను వందల కోట్లతో టూరిజం చేస్తారట.సాగునీటి పేరుతోటి వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు… ఒక్క చుక్క నీరు రాలేదు ఒక్క చుక్క నీటిని కూడా వాడలేదు కదా.మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం రోజున సినిమాలు తీయవచ్చని చెబుతున్నారు సిగ్గుచేటు కదా.
లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి Tourism కోసమా ?పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేస్తారా ..?చేవెల్లకు ఆదిలాబాద కు నీల్లు ఎక్కడ ?చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు.స్వచ్ఛందంగా వివాదాలు లేకుండా తెలంగాణలో ముప్పై నాలుగు ప్రాజెక్టులు ప్రారంభం చేసాం.ఎవరి ముందు నాటకాలు చేస్తున్నావు కెసిఆర్?
పెన్షన్ ల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది కేసీఆర్?నిరుద్యోగ భృతి గురించి ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్.. ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు ఉన్న వాళ్లనే తీసేసారు.ఎంప్లాయిమెంట్ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది కేసీఆర్..( No notifications at all )పవర్ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు.. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం సోలార్ పాలసీని తీసుకురావడం వల్ల నాలుగు వేల మెగావాట్లు వచ్చింది.చర్చకు వస్తే నీ సంగతి తెలుస్తుంది కేసీఆర్.యాదాద్రి తీసుకొచ్చావు ( No coal & water at Yadadri – most expensive Power when produced – much cheaper power available thru National grid ) ఎనిమిది సంవత్సరాలు అయితుంది ఏమీ లేదు.
24 గంటల కరెంటు ఇస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్నారు.డ్రగ్స్ విషయంలో ఏమైనా పాలసీ తీసుకున్నారా? డ్రగ్స్ మొదలైంది మీకు సంబంధించిన వాళ్ళ బార్లలో నే కదా?సిరిసిల్ల ఖమ్మంలో జరిగిన హత్య గురించి మాట్లాడారా?