Suryaa.co.in

Andhra Pradesh

‘జగనన్న తోడు’ కార్యక్రమం వాయిదా

– సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం మరియు ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో 22వ తేదీ మంగళవారం నాడు నిర్వహించతలపెట్టిన ‘జగనన్న తోడు’ మూడవ విడత సాయం అందజేత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28 (సోమవారానికి) కి వాయిదా వేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో సోమవారం (21.02.2022) తెలిపారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచనగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించిందని, స్వర్గీయ మంత్రి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించ తలపెట్టిన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

LEAVE A RESPONSE