Suryaa.co.in

Telangana

ప్రశాంత్ కిషోర్ ఓ రాజకీయ వ్యభిచారి

– కేసీఆర్ చేస్తున్నది శిఖండి రాజకీయం
– బీజేపీ కోవర్ట్ గా కేసీఆర్ ఆడుతున్న నేషనల్ డ్రామా
– కేసీఆర్ పక్కన చేరడానికి ప్రకాష్ రాజ్ కి సిగ్గు లేదా?
– ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్

కేసీఆర్ చేస్తున్నది శిఖండి రాజకీయం. యుద్ధం చేయడానికి సైన్యం లేకపోతే శిఖండిని ముందు పెట్టుకున్నట్లు కేసీఆర్ కూడా శిఖండి రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ కి నమ్మకం పోయింది. పధకాల్లో విఫలం, పని తీరులో విఫలం, అవినీతిలో నెంబర్ వన్, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో నెంబర్ వన్ .. తెలంగాణని కల్వకుంట్ల ఎస్టేట్ గా మార్చిన తర్వాత ప్రజల్లో వస్తున్న తిరుగుబాటు తప్పించుకోవడానికి కేసీఆర్ ఆడుతున్న నేషనల్ డ్రామా ఇది.

ప్రశాంత్ కిషోర్ ఓ రాజకీయ వ్యభిచారి.టీఆర్ఎస్ ని అధికారంలో తీసుకురావడం కోసం కేసీఆర్ తో ప్రశాంత్ కిశోర్ కు 500కోట్లకు అగ్రిమెంట్ కుదిరింది. ప్రజలని మభ్యపెట్టి టీఆర్ఎస్ ని గెలిపించడానికి ప్రశాంత్ కిశోర్ అనే రాజకీయ వ్యభిచారి 500కోట్లు తీసుకుంటున్నాడు. ఇది కేసీఆర్ సొమ్ము కాదు. ప్రజల రక్త మాంసాలతో వచ్చింది.

ప్రకాష్ రాజ్ ఓ పొలిటికల్ బపూన్ . పేదలకు, రైతులకు, నిరుద్యోగులకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతుంటే ప్రశ్నించడం పోయి, కేసీఆర్ పక్కన చేరడానికి ప్రకాష్ రాజ్ కి సిగ్గు లేదా ?
”కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న జనాదరణ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బిజేపి కోవర్టుగా సీఎం కేసీఆర్ ఆడుతున్న డ్రామాని ప్రజలు గమనించాలి” అని కోరారు ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన దాసోజు.. తలకిందులు తపస్సు చేసిన ఈసారి అధికారంలో రాలేమని వాస్తవం గ్రహించిన టీఆర్ఎస్ పార్టీ, ప్రజలని అయోమయానికి గురి చేసి, క్షుద్ర రాజకీయం చేసి రాజకీయ చేసి రాజకీయ లభ్దిపొందాలని చూస్తుంది.

కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్టులని విష ప్రచారం చేస్తూ దొంగే దొంగ అన్నట్టు వుంది టీఆర్ఎస్ పార్టీ తీరు. టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న దుర్మార్గమైన తీరు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది” అని వ్యాఖ్యానించారు దాసోజు.

”గత ఎనిమిదేళ్ళుగా బిజేపిని కొమ్ముకాసింది ఎవరు ? నరేంద్రమోడీ సంకనెక్కి వూరేగింది ఎవరు ? రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చింది ఎవరు ? ప్రజలకు జ్ఞాపకశక్తీ లేదని, వాళ్ళు అలోచించే తెలివి లేదని, తాము ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. దయచేసి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. గణాంకాలు చూసుకుంటే అత్యంత బలహీనమైన పార్టీ బిజేపి.

కానీ కేసీఆర్ సైకిల్ గాలికొట్టినట్లు ఆ పార్టీకి గాలి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్ళుగా బిజేపీతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగి , రాష్ట్రపతి ఎన్ని నుంచి రైతు వ్యతిరేక చట్టాల వరకు అనే నిర్ణయాల్లో బిజేపికి జై కొట్టిన టీఆర్ఎస్ నేడు .. తాము బిజెపి తో యుద్ధం చేస్తున్నామని చెబితే.. నమ్మడానికి ప్రజలు చెవిలో పువ్వుపెట్టుకోలేదు. లాగు వేసుకున్న చిన్నపిల్లాడు కాదు కేసీఆర్ ఆడుతున్నా బిజేపీ యాంటి డ్రామాని నమ్మరు. కాంగ్రెస్ కి పెరుగుతున్న జన ప్రాభల్యం నుంచి ద్రుష్టి మళ్లించడానికి బిజీపీ కోవర్ట్ గా కేసీఆర్ ఆడుతున్నా నాటకం ఇది ”అని వెల్లడించారు దాసోజు.

”గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కి 41శాతం, కాంగ్రెస్ కి 30 శాతం, బిజేపికి 19శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కలు చూస్తే టీఆర్ఎస్ కి పోటి ఇచ్చేది ముఫ్ఫై శాతం ఓట్లు వున్న కాంగ్రెస్. కానీ కేసీఆర్ 19శాతం వున్న బిజేపి పై పడ్డారు. కారణం ప్రజలని డైవర్ట్ చేసి కాంగ్రెస్ ప్రాభల్యంని తగ్గించే విధంగా కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలని మభ్యపెట్టె ప్రయత్నంతో పాటు రేవంత్ రెడ్డి బిజేపీ కోవర్ట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దిన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖడింస్తుంది”అని పేర్కొన్నారు దాసోజు.

నరేంద్ర మోడీతో కోట్లాడి నట్లు భ్రమింపజేసి ప్రజలని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. కానీ కేసీఆర్ కలలు కలలు గానే మిగిలిపోతాయి కానీ నిజం కావు” అని వ్యాఖ్యానించారు దాసోజు.
”తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టడానికి ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ అనే ఇద్దరు ఆర్టిస్టలని పట్టుకొచ్చారు కేసీఆర్. తన పని అయిపోయిందని అర్డమైపోయిందని, ఇక కొట్టుకుపోవడమే మిగిలిందని గ్రహించిన కేసీఆర్ .

గడ్డిపోచలాంటి ఇద్దరిని తెరపై తెచ్చి డ్రామా ఆడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఓ రాజకీయ వ్యభిచారి. వున్నవి లేనట్లు లేనివి వున్నట్లు ప్రజలని మభ్యపెట్టి, సాధ్యం కానీ పధకాలకు రూపకల్పన చేసి దానికి బ్రాండింగ్ మార్కెటింగ్ చేసి ప్రజలని మభ్యపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రాజకీయ వ్యభిచారు ప్రశాంత్ కిషోర్ ని పట్టుకొచ్చి రాజకీయ వ్యభిచారంతో మరోసారి తెలంగాణని కబళించాలానే ప్రయత్నంచేస్తున్నారు కేసీఆర్.

టీఆర్ఎస్ ని అధికారంలో తీసుకురావడం కోసం కేసీఆర్ తో ప్రశాంత్ కిశోర్ కు 500కోట్లకు అగ్రిమెంట్ కుదిరింది. ప్రజలని మభ్యపెట్టి టీఆర్ఎస్ ని గెలిపించడానికి ప్రశాంత్ కిశోర్ అనే రాజకీయ వ్యభిచారి 500 కోట్లు తీసుకుంటున్నాడు. ఇది కేసీఆర్ సొమ్ము కాదు. ప్రజల రక్త మాంసాలతో వచ్చింది. తెలంగాణ సమాజం ఈ రాజకీయ వ్యభిచారాన్ని తీవ్రంగా పరిగణించి కేసీఆర్ కి బుద్ది చెప్పాలి” అని కోరారు దాసోజు.

”ప్రకాష్ రాజ్ మంచి నటుడు. ఆయన నటనని అభిమానిస్తాం. కొన్ని ఆయన మాట్లాడిన తీరు కూడా నచ్చింది. న్యాయంగా ఉంటారని అనుకున్నాం. కానీ ఎనిమిదేళ్ళుగా కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్యాయం అయిపోతుంటే.. స్పృహ లేకుండా ఇప్పుడు కేసీఆర్ పంచన చేరి ఆయనకి భజన చేయడం ప్రకాష్ రాజ్ కి తగదు. పేదలకు, రైతులకు, నిరుద్యోగులకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతుంటే ప్రశ్నించడం పోయి కేసీఆర్ పక్కన చేరడానికి ప్రకాష్ రాజ్ కి సిగ్గు లేదా ? ఇది చాలా బాధాకరం. తెలంగాణ సమాజంకు నష్ట జరిగే చర్యలు మీరు పాల్పడుతుంటే కచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టం సూటిగా ప్రశ్నిస్తాం” అని హెచ్చరించారు దాసోజు.

LEAVE A RESPONSE