Suryaa.co.in

National

రామమందిర ప్రారంభోత్సవం కు 108 అడుగుల అగరబత్తీ తయారీ!

-అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు
-కార్యక్రమం కోసం 108 అడుగుల పొడవున్న అగరబత్తీ తయారీ
-గుజరాత్‌లోని వడోదరలో ఈ భారీ అగరబత్తీని సిద్ధం చేస్తున్న వైనం

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం 108 అడుగుల పొడవున్న అగరబత్తీ సిద్ధం చేస్తున్నారు. గుజరాత్‌లోని వడోదరలో ఈ అగరబత్తీని సిద్ధం చేస్తున్నారు.

ఇక జనవరి 22న నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయోధ్యలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. నగరంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఫేజ్-1 ప్రాజెక్టు ఈ నెలాఖరుకల్లా పూర్తి కానుంది.

ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన సప్లిమెంటరీ బడ్జెట్‌లో అయోధ్య అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అయోధ్య కన్సర్వేషన్, డెవల్‌ప్మెంట్ ఫండ్‌కు రూ.50 కోట్లు, రామోత్సవ్ 2023-24 కోసం రూ.100 కోట్లు, ఇంటర్నేషనల్ రామాయణ్, వైదిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విస్తరణకు రూ.25 కోట్లు కేటాయించారు .

LEAVE A RESPONSE