Suryaa.co.in

Telangana

స్వీపర్లకు అభివాదం చేసిన ప్రధాని మోదీ

-ఆఫీస్ బోయ్ నుండి ఇంఛార్జ్ దాకా అభివాదం చేసిన మోదీ
-అందరి వివరాలు ఆరా తీసిన మోదీ
-అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేసిన మోదీ
-బండి సంజయ్ చొరవతో బీజేపీ స్టేట్ ఆఫీస్ సిబ్బంది అందరినీ కలిసిన ప్రధానమంత్రి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీజేపీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందిని కలిశారు. ఆఫీస్ లో పనిచేసే స్వీపర్, ఆఫీస్ బోయ్, డ్రైవర్ మొదలు అక్కడ పనిచేసే సిబ్బంది అందిరిని ఆప్యాయంగా పలకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో ఈరోజు కార్యాలయానికి చెందిన సుమారు 40 మంది ఆఫీస్ సిబ్బందిని కలిసేందుకు మోదీ కార్యాలయం అనుమతిచ్చింది.

దీంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఆయా సిబ్బందిని వెంటబెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 వద్దకు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన మోదీ ఫామ్ నెంబర్ – 10 వద్ద కు వస్తూ అక్కడున్న సిబ్బందికి అభివాదం చేశారు.

మీరంతా ఎన్నేళ్ల నుండి బీజేపీ ఆఫీస్ లో పనిచేస్తున్నారు? ఎలా ఉన్నారు?’’అంటూ పలకరించారు. అనంతరం ఒక్కొక్కరి వద్దకు వచ్చి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దేవుడి లాంటి మోదీని కలిసే అవకాశం రావడం తమ అద్రుష్టమని ఆయా సిబ్బంది పేర్కొనడం గమనార్హం. మోదీని కలిసిన వారిలో బంగారు శ్రుతి తో పాటు ఆఫీస్ ఇంఛార్జ్ కేవీఎస్ఎన్.రాజు, కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ తదితరులున్నారు.

LEAVE A RESPONSE