– ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్
విజయవాడ: రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని అందుకోసమే అనారోగ్యం బారిన పాడిన వారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు, ఎల్ఓసి పత్రాలను అందజేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ అన్నారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్. ఓ. సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమినేతలతో కలిసి అందజేశారు.
52 వ డివిజన్ మల్లికార్జున పేటకు చెందిన ఆకుల దివ్య (34 ) లంగ్ క్యాన్సర్ తో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 24 లక్షల 24 వేల విలువైన ఎల్ఓసి పత్రాన్ని బాధితురాలి తండ్రికి అందజేశారు. త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితురాలి తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్డీఏ కూటమి నేతలు పచ్చి పులుసు వెంకట శివప్రసాద్, అవ్వారు బుల్లబ్బాయి, దాడి మురళీకృష్ణ, వీర్ల వాసు, హెన్రీ, రామకృష్ణ, బండి లక్ష్మీ, రౌతు రమ్య ప్రియ,దొడ్ల రాజా, సప్పా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.