– త్వరలో ముఖ్యమంత్రితో ముస్లిం సంఘాల సమావేశం
– టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు మరియు పార్టీ పొలిటికల్ సెక్రెటరీ తొండేపు దశరథ జనార్ధన్
ఇబ్రహీంపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ముస్లింల పక్షపాతి అని త్వరలో ముఖ్యమంత్రితో ముస్లిం సంఘాల సమావేశానికి అవకాశం కల్పిస్తానని తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు మరియు ఆ పార్టీ పొలిటికల్ సెక్రటరీ తొండేపు దశరథ జనార్ధన్ హామీ ఇచ్చారు .
మంగళవారం రాష్ట్ర అహలే సున్నతుల్ జమాత్ కో-కన్వీనర్ అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో దశరథ జనార్ధన్ ను అహలే సున్నతుల్ జమాత్ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అండగా నిలిచారని, ఎప్పటికీ ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, గత ఎన్నికలలో బిజెపితో జత కట్టినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ముస్లింలు ఆయనకు అండగా నిలిచారని అన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళుతుందని.. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి, సమస్యలు వివరించి, కృతజ్ఞతలు తెలిపే విధంగా అవకాశం కల్పించాలని దశరథ జనార్ధన్ ను కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
దశరథ జనార్ధన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ముస్లింల పక్షపాతి అని, ముస్లింల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ముస్లింల సమస్యలు తెలిపేందుకు త్వరలో ముఖ్యమంత్రితో సమావేశం అవకాశం కల్పిస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం నాయకులు ఫారుక్ షుబ్లీ,అహలే సున్నతుల్ జమాత్ పెద్దలు అప్సరజమా, ఫహీంఅక్తర్, ఇంతిఖాబ్, ఇతరులు పాల్గొన్నారు.