పీవీ మన ఠీవి:ఎర్రబెల్లి

Spread the love

ఢిల్లీ : భారత మాజీ ప్రధాని పీవీ 17వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ లోని అంబేద్కర్ హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర మంత్రులు, ఎంపీ లతో కలిసి, పీవీ చిత్ర పటానికి పూలు చల్లి, ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఏమన్నారంటే … అఖండ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగు వాడు… తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. పీవీ మేధావి, బహుభాషావేత్త, కవి, రచయిత, అనువాదకుడు. అపార జ్ఞానం ఉన్నవాడు. అపర చాణక్యుడు. రాజనీతి పరాయణుడు. తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత.

ఆచరణ శీలి
ఆర్థిక సంస్కరణలు చేపట్టిన ఆర్థిక వేత్త,ఆర్థిక సంస్కర్త
సుదీర్ఘ రాజకీయ, ప్రజా జీవితాన్ని అనుభవించి, సంపూర్ణ జీవన సాఫల్యానికి సాధించి, 2004 డిసెంబర్ 23 న పరమపదించారు. పీ.వీ వరంగల్ లోనే చదువుకున్నారు. జర్నలిస్టు గా మొదలు పెట్టి, కాకతీయ పత్రిక నడిపి, బహు భాషలు నేర్చి, రాజకీయాల్లో చేరి, అనేక పదవులు అలంకరించారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి పదవులు చేపట్టారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. దేశాన్ని కాపాడారు. దేశ రక్షణ కొరకు అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలు పెట్టింది పీవీ నరసింహారావు. పీవీ హంగు, ఆర్భాటాలు లేని సాదా సీదా సహజ నాయకుడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్న నేత. వారితో నాకు చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉంది. వారు మా నాన్న ఇద్దరు కలిసి అనేక ఉద్యమాల్లో పని చేశారు.మా నాన్న… పీవీ శిష్యుడు.

రాజకీయాల్లో నేను ఇంతగా ఎదగడానికి పీవీ కారణం.పీవీ గారి దగ్గరకు, నన్ను మా నాన్న తీసుకుపోయే వారు.రాజకీయాలు మా నాన్నకు పెద్దగా అచ్చి రాలేదు అని అంటుండే వారు. ఆ మాటలే నన్ను బాగా తొలిచేవి. పీవీ మాటలను ఛాలెంజ్ గా తీసుకుని, నేను రాజకీయాల్లో ఎదిగాను.నా నియోజకవర్గ ప్రజలు, సీఎం కెసిఆర్ ఆశీస్సులతో మంత్రిగా ఉన్నాను.సీఎం కేసిఆర్ కి కూడా పీవీ అంటే ఎంతో ఇష్టం. పీవీ సంస్కరణల స్ఫూర్తి తోనే, మన రాష్ట్రంలో కెసిఆర్ అనేక పరిపాలన సంస్కరణలు తెస్తున్నారు. 2020, జూన్ 28 నుండి 2021 జూన్ 28 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించింది.

రాష్ట్రమే కాదు యావత్ దేశం, ప్రపంచంలోని 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని, వారి చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టాలని కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా కెసిఆర్ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పీవీ కి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వoగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.బీఇప్పటికే, నేను, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లము కలిసి లక్నేపల్లి ని సందర్శించినం. వారు పూర్వ వరంగల్ జిల్లా వారు కావడం మా అదృష్టం భారత జాతి, జాతీయ నాయకుడైన పీవీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. నిరాడంబర జీవితానికి, నిజాయితీకి, రాజకీయ నీతికి, రాజనీతికి నిలువెత్తు నిదర్శనం పీవీ. అందుకే పీవీ మన ఠీవి.

మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ఎంపీ లు బండా ప్రకాశ్, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply