-బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్
-రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద నిన్న జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండిస్తూ బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్ , ఓబీసీ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విదేశాలలో నరేంద్ర మోడీ భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలే గుర్తిస్తున్నప్పుడు తరుణంలో దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఎప్పుడు నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శించింది కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాజకీయంగా గాని బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి గానీ ఈ దేశ చరిత్రలో మోడీ చేసిన సంక్షేమ అభివృద్ధి పనులు ఏ పార్టీ గాని ఏ ప్రధానమంత్రి గాని చేసిన చరిత్ర లేదు.
అలాంటి మోడీ ని మీరు బిసి కాదు అని దేశాన్ని మోసం చేశాడని రాహుల్ గాంధీ అనడం.. తెలిసి తెలియని జ్ఞానంతో నరేంద్ర మోడీ ని విమర్శిస్తేనే నన్ను ఈ దేశంలో గుర్తిస్తారని ఒకే ఒక కారణంతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి వెంటనే క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ముఖ్య నాయకులు సంజయ్ ఘనటే, పిట్టల చంద్రశేఖర్, శరద్ సింఘ్ ఠాకూర్, రవికుమార్ శంకరోళ్ల , వెంకట్ జన్ను తదితరులు పాల్గొనటం జరిగింది.