Suryaa.co.in

Telangana

రాహుల్ ..తులం బంగారం ఏమాయ సారు?

– రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన వదువరుల వినూత్న నిరసన
– రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్లకార్డు ద్వారా పెండ్లిలో వినూత్నంగా నిరసన తెలిపిన ముఖరా కే గ్రామ నూతన వదువరులు కాంబ్లె ఆమోల్ గీతాంజలి

అది ఎన్నికల సమయం. తెలంగాణ ఇచ్చిన తన పార్టీని గెలిపించుకునేందుకు.. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ, ఆయన సోదరి ప్రియాంక, నాటి పీసీసీ చీఫ్ రేవ ంత్‌రెడ్డి కాళ్లకుబలపాలు కట్టుకుని, తెలంగాణ నలుచెరుగులా ప్రచారం చేశారు. ఆ సందర్భంగా కల్యాణలక్ష్మితోపాటు.. కొత్తగా పెళ్లిచేసుకున్న వారికి తులం బంగారం ఇస్తామని ముగ్గురూ ముచ్చటగా ప్రమాణాలు చేశారు.

వెళ్లిన ప్రతిచోటా అదే హామీ గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రేవంత్ సీఎం అయి 15 నెలలయిపోయింది. కానీ ఇప్పటిదాకా తులం బంగారం ముచ్చట లేదు. విపక్షాలు ప్రశ్నిస్తే జవాబు లేదు.

సరే ఇక వారితో పనికాదనుకున్నారే ఏమో.. ముఖరా కే గ్రామానికి చెందిన ఓ నూతన వధూవరులు.. ఏకంగా తులంబంగారం ఏమాయసారూ? అంటూ ప్లకార్డులతో వినూత్న నిరసన తెలిపారు. ఇప్పుడు ఇది సోషల్‌మీడియా తెగ వైరల్ అవుతోంది. అసలే సమస్యలతో సతమతమవుతున్న రేవంత్ సర్కారుకు ఈ ‘మహిళా సెంటిమెంట’ అదనపు శిరోభారమే
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో తమ ప్రభుత్వం వస్తే పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు కానీ అధికారంలో వచ్చి 15 నెలలు అవుతున్న తులం బంగారం ఇస్తలేరు. తులం బంగారం హామీ బోగస్ అయ్యింది. పెళ్ళైన ఆడపిల్లకు ఇప్పటికైనా తులం బంగారం ఇవ్వాలని నూతన వదువరులు ప్లకార్డులు పట్టుకొని ముఖరా కే గ్రామ నూతన వదువరులు కాంబ్లె ఆమోల్ గీతాంజలి నిరసన తెలిపారు.

తులం బంగారం దేవుడేరుగు. ఉన్న కల్యాణ లక్ష్మి ఇస్తలేరని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెళ్ళైన ఆడబిడ్డకు మోసం చేస్తున్నాడని , కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు బోగస్ అయ్యాయని నిరసన తెలిపారు.

కేసీఆర్ ఆడబిడ్డకు మేనమామ లాగ ఆదుకొని.. లక్ష రూపాయలు కల్యాణ లక్ష్మి సమయానికి ఇస్తుండే. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇస్తలేదని, ఇప్పటికైనా పెండ్లి అయినా ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి తో పాటు తులం బంగారం ఇవ్వాలని గురువారం ముఖరా కే గ్రామంలో జరిగిన పెళ్ళిలో నూతన వధూవరులు కాంబ్లె ఆమోల్ గీతాంజలి, వారి తల్లిదండ్రులు నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ గ్రామస్తులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE