– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు.
దేశానికి జ్యోతిబాపులే అందించిన సేవలను ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్మరించుకున్నారు. వర్ణవివక్షను రూపుమాపడం కోసం దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం ,మహాత్మా జ్యోతిరావు పూలే ఆచరించిన కార్యచరణ మహోన్నతమైందని తెలిపారు. భారతదేశంలో అట్టడుగు వర్గాల పై జరుగుతున్న దాస్టికాలపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. తన జీవితాన్ని భార్య సావిత్రిబాయి సహకారంతో పోరాటం ప్రతిఘటన సంస్కరణకు అంకితం చేసిన మహోన్నతుడాయన.కుల లింగ వివక్షతకు తావు లేకుండా విద్యా సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయని, పూలే ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం జ్యోతి బాపులే ను స్మరించుకుంటూ ప్రగతి భవన్ కు మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా నామకరణం చేసుకున్నామని గుర్తు చేశారు. జ్యోతిబాపూలే విద్యా కు ఇచ్చిన ప్రాధాన్యత తో వెనుకబడిన తరగతుల గురుకులాలకు మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాలుగా ముందుకు వెళ్తున్నాయి. .