Suryaa.co.in

Political News

రాజ్ కసిరెడ్డి: ఐటీ నుంచి.. ఐడీ (జైలు) వరకు !

– ఒక “Ctrl+C”, “Ctrl+V” కథ!

అమెరికా కలల నుండి భారతీయ జైలు కలలకు!

ఇది జోక్ కాదు బాసూ, ఇది మన రాజ్ కసిరెడ్డి గారి “జీవిత సారాంశం”. ఒకప్పుడు సిలికాన్ లోయలో కీబోర్డు యోధుడు, ఇప్పుడు ఆంధ్ర జైలులో ఖైదీ నంబర్! ఏమిటీ మాజీ టెక్ గురువుకు ఈ దుస్థితి? సింపుల్‌గా చెప్పాలంటే… తన కుల కలల జగన్ రెడ్డి రాజకీయ బంధువుల “నెట్‌వర్క్” కు ఒక్కసారి “కనెక్ట్” అయ్యాడు అంతే!

“వారి కుటుంబ దోపిడీ వృత్తి”లో చేరిక – “ఉచిత శిక్షణ”, “జీతం గట్రాలు”!

అమెరికాలో మంచి ఉద్యోగం ఉన్న కసిరెడ్డి గారు రాజకీయాల వైపు ఎలా చూశారు? ఇది రహస్యం కాదు మహాప్రభో, ఇది జగన్మోహన్ రెడ్డి గారి బంధువుల “ప్రత్యేక ఆహ్వానం”! ఒకేసారి ఎన్నారై సెల్ కన్వీనర్, ఐటీ సలహాదారు, మందు సిండికేట్ “పెద్దన్న”… ఆయన బయోడేటాలో “అన్ని పనులూ చేయగలను” అని ప్రత్యేకంగా రాసి ఉంటారు కాబోలు!

ఐటీ నైపుణ్యాలు – “కట్, కాపీ, పేస్ట్” వ్యవహారాలు!
కసిరెడ్డి గారు తన టెక్నాలజీ తెలివిని మద్యం వ్యాపారానికి “వర్తింపజేశారు”! అంటే… ప్రోగ్రామింగ్ కాదు, “ప్రతి లావాదేవీలో వాటా తీసుకోవడం” నేర్చుకున్నారు. ప్రభుత్వ షాపుల్లో ఎవరికీ తెలియని బ్రాండ్ల అమ్మకాలను ఒక “విప్లవాత్మక ఆలోచన”గా భావించారు. ఆర్థిక సంక్షోభాన్ని “ఆర్థిక సంస్కరణ”గా మార్చే ప్రయత్నం! ఎంత తెలివైనోడో కదా!

జ్యుడీషియల్ రిమాండ్ – “ఉచిత బస”, “భోజనం ఉచితం” (నాణ్యతపై సందేహాలు)!

ఆయన కోసం రిమాండ్ సింహా పొన్నవోలు న్యాయపీఠం ముందు గర్జించారు. అయినా నేర తీవ్రత, ఆయన మాత్రం ఏమి చేస్తాడు?

ఇప్పుడు సిట్ అధికారులు ఆయన్ని “ప్రత్యేక అతిథి”గా ఆహ్వానించారు. ఫైవ్ స్టార్ హోటల్ కాదు, సింగిల్ రూమ్ విత్ బార్స్! ఒకవేళ ఈయనకు “జీవితకాల సాఫల్య పురస్కారం” ఇవ్వాలంటే, అది ఖచ్చితంగా జైలు శిక్షే అవుతుంది. అమెరికాలో హెచ్1బీ వీసా కోసం ఎదురు చూస్తే, ఇక్కడ హై సెక్యూరిటీ సెల్ వీసా తక్షణమే లభించింది!

నీతి కథ: జగన్ లాంటి రాజకీయ బంధువులుంటే, మీరు సలహాదారు కావచ్చు… లేదా నేరుగా ముద్దాయి కావచ్చు. మధ్యలో వేరే ఆప్షన్ లేదు!

ఐటీ నేర్పుతుంది కోడింగ్, కానీ జగన్ క్రిమినల్ రాజకీయం నేర్పుతుంది “నో కోడింగ్, ఓన్లీ డీలింగ్”!అమెరికా డాలర్లు దాచుకుంటే, ఇక్కడ కోర్టు ఫీజులు కట్టాల్సి వస్తుంది! కర్మ సిద్దాంతం అంటే ఇదేనేమో!

చివరిగా ఒక మాట: ఏ ఐటీ నిపుణుడికైనా ఒక చిన్న హెచ్చరిక: మీరు కోడ్ రాస్తే మీ భవిష్యత్తు రాజ్ కసిరెడ్డిలా మారే ప్రమాదం ఉంది. కాబట్టి, సాఫ్ట్‌వేర్ కోడ్‌లకే పరిమితం అవ్వండి… వేరే “కోడ్”లు రాయడానికి ప్రయత్నించకండి!

చివరిగా మరో విషయం.. ఇలా ఎన్నారైలు జీవితాలు నాశనం చేసుకోవాలి గానీ.. అక్కడ సంపాయించిన డబ్బులు తెచ్చి, భూములు ప్రభుత్వ పాలసీ ప్రకారం కొని సాఫ్ట్వేర్ కంపెనీలు డాటా సెంటర్లు పెట్టి, ఉద్యోగాలు కల్పిస్తే.. వైకాపా దుర్మార్గులు వికృతంగా ప్రచారం చేస్తే అది నమ్మి.. గొఱ్ఱెల లెక్క కుంభకోణం అని మరికొంతమందికి చెప్పే భావదారిద్య్రపు కులగజ్జిలో మీ మేధావితనాన్ని ఒలకబోసుకోకండి. అభాసుపాలు కాకండి.

ఒక నాయకుడి స్పూర్తితో ఎదిగి లక్షలాదిమంది దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చారు. జగన్ అనే మాస్టర్ డబుల్ మైండ్ క్రిమినల్ చేతిలో మీరు చిక్కుకొని ఇక్కడున్న యువతకు ఉద్యోగాలు దొరకకుండా ప్రయత్నాలు చేస్తుంటే ఎవరూ ఊరుకోదు. మీ బట్టలు ఊడదీస్తాం. జాగ్రత్త.

(ఈవీ స్క్రోలింగ్): మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి రిమాండ్ – 14 రోజులు రిమాండ్ విధించిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి – మే 6వ తేదీ వరకు రాజ్ కెసిరెడ్డికి రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి – రాజ్ కెసిరెడ్డిని విజయవాడ జైలుకు తరలించిన పోలీసులు.
– బాబు

LEAVE A RESPONSE