Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి అంటే తొక్కుడు సీఎం

– ఎంతమంది మహిళలను ఎమ్మెల్సీలను చేసిన్రు ?
– రాజ్యసభ సభ్యుల్లో ఎంతమంది మహిళలున్నారు?
– హోంమంత్రి లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎట్ల ఉంటది..?
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి

హైదరాబాద్: అడ్డెడు పాలాలు బుక్కిన ఆకలి తీరదన్నట్లు.. అడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రాన పరిపాలన చేసినట్లు కాదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోయే సామెత. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా విజయోత్సవ వారోత్సవాల పేరిట వరంగల్ లో కాంగ్రెస్ సభ నిర్వహించింది. భద్రవారి అమ్మవారి సాక్షిగా, సమ్మక్క-సారలమ్మ సాక్షిగా సభ పెట్టింది.

మహిళలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, మహిళల సాక్షిగా మహిళలను వంచించి పెట్టిన సభ అది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు చేస్తున్న పరిస్థితి. మహిళల రక్షణ కోసం సమీక్ష చేసేందుకు హోంమంత్రి కూడా దిక్కులేని పరిస్థితి దాపురించింది. హోంమంత్రి లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎట్ల ఉంటది..?

అలాంటి పరిస్థితుల్లో.. మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడిది? గత అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాయకులు డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన్రు. మహిళా డిక్లరేషన్ చేసిన్రు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చిన్రు.. ఇప్పటికీ కూడా ఎందుకు ఇవ్వలేదు..? డిగ్రీ చదువుకునే ఆడబిడ్డలందరికీ స్కూటీ ఇస్తమన్నరు. ఈరోజు వరకు ఎందుకివ్వలేదు.

పెండ్లి చేసుకునే ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తమన్నరు. ఇప్పటివరకు ఎందుకివ్వలేదు? స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణం పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచుతమని చెప్పిన్రు.. ఇంకా ఎందుకు పెంచలేదు? ఇండ్లు కట్టించి, మహిళల పేరిట రిజిస్ట్రేషన్లు చేయిస్తమని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఒక్క ఇంటి నిర్మాణానికి కూడా భూమిపూజ చేయలేదు.

రేవంత్ రెడ్డి….. సోనియమ్మ, ఇందిరా గాంధీలు మీకు దేవత అయితే.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను కూడా దేవతగా కొలచి, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. దేశంలో ఆడబిడ్డలు అనారోగ్యానికి గురికావొద్దని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మరుగుదొడ్లను నిర్మించిన పార్టీ బిజెపి. 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మహిళల సంక్షేమం పట్ల సోయి లేకుండా పాలించడం సిగ్గుచేటు.

బీజేపీ ని, ప్రధాని నరేంద్ర మోదీ ని, కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పట్ల ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం పరిపాలన దక్షత అనిపించుకోదని రేవంత్ రెడ్డి గుర్తెరగాలి. గత కేంద్ర కేబినెట్ లో 12 మంది మహిళలకు, ఈ కేబినెట్ లో ఏడుగురు మహిళలకు కేంద్రమంత్రి పదవులు కట్టబెట్టింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కేబినెట్ లో కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే మంత్రి పదవులిచ్చి, మహిళల పార్టీ కాంగ్రెస్సని చెప్పుకోవడం సిగ్గుచేటు.

ఎంతమంది ఎమ్మెల్సీలను చేసిన్రు ? రాజ్యసభ సభ్యుల్లో ఎంతమంది మహిళలున్నారు..? కాంగ్రెస్ పార్టీ గుర్తుతెచ్చుకోవాలి. మహిళల గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డి కి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులను ఎందుకు రద్దు చేయలేదు? హైదరాబాద్ లో ఒక్క పబ్బు కూడా మూసేయలేదు?

మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలకు కారణం బెల్ట్ షాపులు, పబ్బులు, బార్లు, డ్రగ్స్, గంజాయి. వీటిని అదుపుచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క చర్య కూడా తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలపై గౌరవం లేదు. మహిళల రక్షణపై బాధ్యత లేదు. కాంగ్రెస్ పార్టీకి మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత లేదు.

రేవంత్ రెడ్డి అంటే తొక్కుడు సీఎం. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో… మొన్నటిదాక కాంగ్రెస్ పార్టీలో నాయకులను తొక్కుకుంటూ రావొచ్చు. కానీ నేడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పడు మందిని తొక్కాలనుకుంటున్నారా? మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రజలను తొక్కడానికా? రేవంత్ రెడ్డి కి కొంచమైన జ్ఞానముంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి పనిచేయాలి.

కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు ఉద్యోగులకు జీతాల్లేవు.కొత్త రేషన్ కార్డులకు దిక్కులేదు. కానీ, హెచ్చులకు మాత్రం తక్కువలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి .. బిజెపిని విమర్శించడం బంద్ పెట్టి, మందిని తొక్కుడు బంద్ చేసి, మహిళలను ముంచుతూ, మోసం చేయడం బంద్ చేసి పరిపాలన మీద దృష్టిపెట్టాలి. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తీరు మార్చుకోకుంటే, నిన్న సభకు వచ్చిన లక్షలాది మంది మహిళలే.. రేపు చీపురు పట్టుకుని మీ వెంటపడక తప్పదని హెచ్చరిస్తున్నం.

LEAVE A RESPONSE