నెల్లూరులో మైనర్ బాలికపై అత్యాచారయత్నం, కామాంధుడికి స్థానికుల దేహశుద్ధి

Spread the love

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా మహిళలు, బాలికలు, చిన్నారులపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. వావివరసలు మర్చిపోయి బాలికలకు మాయమాటలు చెప్పి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఓ చిన్నారిపై అత్యాచారం చేయబోయిన ఘటన నెల్లూరులో వెలుగుచూసింది. అతడు వరుసకు అన్న అవుతాడు… అన్న అంటే ఆపదలో ఆదుకునేవాడని అర్థం. కానీ ఇక్కడ మాత్రం ఆపద సృష్టించాడు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ‘నెల్లూరు జిల్లా పులికల్లులోని నాగమ్మ కాలనీకి చెందిన శ్రీను అనే వ్యక్తి చెల్లి వరస అయ్యే చిన్నారిపై కన్నేసి.. దైవ దర్శనం కోసం తిరుపతి తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి జిల్లాలోని చేజర్ల మండలం ఆదూరుపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న చిన్నారి.. దగ్గరలోని బస్టాండ్కు వచ్చింది. కూల్డ్రింక్ షాపు వద్ద అనుమానంగా తిరుగుతుండడంతో గమనించిన కాలేషా అనే స్థానికుడు పాపను చేరదీసి వివరాలు తెలుసుకున్నారు’ అని తెలిపారు. పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply