Suryaa.co.in

Andhra Pradesh

పురందేశ్వరిని అంటే మోడీ- నడ్డాని అన్నట్టే!

పోసాని వ్యాఖ్యలు.. జగన్ అంతరంగమే
లక్ష రూపాయలు సరుకు అక్కడ అమ్మితే కేవలం ఏడువందలు రసీదులు ఎలా ఇచ్చారు
మద్యం లావాదేవీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి
పురందేశ్వరి ప్రశ్నిస్తే పోసాని ఎందుకు జవాబు ఇస్తున్నారు ?
పిచ్చి ముదిరిన పోసాని కృష్ణ
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్

పిచ్చి ముదిరిన పోసాని కృష్ణ మురళి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ తీవ్రంగా ఖండించారు.ఆ వాక్యాలు మాట్లాడింది పోసాని అయినా మాట్లాడించింది రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డే నని అన్నారు.

ఆదివారం కావలి ప్రెస్ క్లబ్ లో మీడియా తో ఆయన మాట్లాడారు. పురందేశ్వరిని అంటే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ని అన్నట్టే అని విల్సన్ అన్నారు. పోసాని జాతీయ నాయకుల్ని విడదీసి మాట్లాడడం అతడి వంచనా శిల్పమే అన్నారు పోసాని అనే ఒక పిచ్చి కుక్కను రాష్ట్రం మీదకు వదిలి జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని అన్నారు.62 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే 32 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమవుతున్నట్టు చూపిస్తే దాని అర్ధం ఏంటని అన్నారు.

మేడం ప్రశ్నిస్తే సంబంధిత శాఖ నుండి వివరాలు ప్రకటించాలి గాని పోసాని చవకబారు వాగుడు ఏంటని నిల దీశారు. ఆంధ్రప్రదేశ్ లో తయారవుతున్న మద్యం తాగి చిన్న వయసులోనే వేలాదిమంది లివర్ సిరోసిస్ వ్యాదికి గురవుతున్న విషయం నిలదీస్తే మెంటల్ కృష్ణ బయటకు రావడం ఏంటని దుయ్య బట్టారు. ఆంధ్రప్రదేశ్ లో తయారవుతున్న చౌకబారు మద్యం తాగి లివర్ సిరోసిస్ రావడానికి కారణమైన ప్రభుత్వ మద్యం గుట్టు విప్పుతామని అన్నారు.

మద్యం లావాదేవీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిజటలైజేషన్ ద్వారా లావాదేవీలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు జరగడం లేదని అన్నారు. ఒక షాప్ లో విజిట్ చేస్తే లక్ష రూపాయలు సరుకు అక్కడ అమ్మితే కేవలం ఏడువందలు రసీదులు ఎలా ఇచ్చారు అని పురందేశ్వరి ప్రశ్నిస్తే పోసాని ఎందుకు జవాబు ఇస్తున్నారు అన్నారు. ఆయన ఏమైనా సమాచార శాఖ మంత్రి నా అని
నిలదీశారు.

పురందేశ్వరి ఏ పార్టీలో ఉన్నా చిత్తశుద్ధితో పనిచేశారు గాని ఏనాడు పదవుల కోసం పాకులాడలేదన్నారు. జగనన్న అవినీతికి పాల్పడి కోట్లకు పడగ లెత్త లేదు అన్నారు బిజెపి పార్టీకి గత పది ఏళ్ళు గా ఆమె చిత్తశుద్ధితో తన సేవలందిస్తున్నారన్నారు. ఎలాంటి ప్రభుత్వ అధికార హోదా పదవులు రాకపోయినా నిబద్దతగల పార్టీ కార్యకర్తగా ఆమె పార్టీ అభివృద్ధి కోసం అహంరహం కృషి చేస్తున్నారన్నారు. జాతికి సేవలందిస్తున్నారు అన్నారు. ఆమె సేవలు గుర్తించే రాష్ట్ర పార్టీ పగ్గాలు కేంద్ర నాయకత్వం అప్పజెప్పిందని, ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మొఖాన పడుతుందని పోసాని తెలుసుకోవాలన్నారు.

ఆమె పాదదూళి స్థాయి కూడా పోసాని కి లేదన్నారు.పోసాని ఆంధ్రప్రదేశ్ వాసి అయితే రాష్ట్రంలోకి పరిశ్రమలు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతమందికి ఉపాధి జగన్ కల్పించారో చెప్పాలన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బాలకృష్ణ ని కాపాడింది నిజమైతే ఏ ప్రయోజనం కోసం కాపాడారో బహిర్గతం చేయాలన్నారు.

సొంత చిన్నాన్న చనిపోతేనే తొమ్మిది నెలల 11 రోజులు తన అధికార సమయంలో నిందితుల్ని ఎందుకు జైలుకు పంపలేదు అన్నారు. హంతకులకు కొమ్ముకాస్తారా అని నిలదీశారు. పోసాని గురిగింజ నీతులు చెప్పడం విచిత్రం అన్నారు. చంద్రబాబు 6 లక్షల కోట్ల అవినీతి చేశాడని నాలుగేళ్లుగా ప్రచారం చేసి ఎందుకు బయట పెట్టలేదు అన్నారు. ఆరు నెలలు కర్రసాము చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు 300 కోట్ల అవినీతికి ఎందుకు పరిమితమయ్యారు అని నిలదీశారు.

స్పష్టమైన సాక్షాదారాలతో నిరూపిస్తే బిజెపి ఆహ్వానిస్తుందన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసిన తీరుని మేడం వ్యతిరేకించారు తప్ప బాబు అవినీతి నిరూపించాల్సింది ప్రభుత్వమే అన్నారు. జగన్ అవినీతికి సాక్షాలుగా అనేక ప్రాజెక్టులు కనిపిస్తున్నాయని..జగన్ అవినీతికి ఆనవాలుగా 40,0O0 కోట్ల ఈడీ అటాచ్ మెంట్లు కనిపించడం లేదా అని విల్సన్ నిలదీశారు. పిచ్చివాళ్ల చేత ప్రకటనలు ఇప్పించడం వై. ఎస్ జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వెంటనే జగన్ క్షమాపణ చెప్పాలన్నారు.

విలేకరుల సమావేశంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు భరత్ కుమార్, కావలి పట్టణ అధ్యక్షుడు కుట్టు బోయిన బ్రహ్మానందం, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మురళీకృష్ణ, కావలి నియోజకవర్గం సి వి సి సత్యం, బిజెపి పట్టణ మాజీ అధ్యక్షుడు బెల్లంకొండ మాల్యాద్రి.. బిజెపి ఉపాధ్యక్షులు భాస్కర్, బిజెపి మహిళా అధ్యక్షురాలు ఉదయలక్ష్మి బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్, బిజెపి యు మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE