Suryaa.co.in

Andhra Pradesh

మా కాల్ డేటా బయటపెట్టేందుకు సిద్ధం.. వైసీపీ నేతలు కాల్ డేటా బహిర్గతం చేయగలరా?

– ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా స్వామి భక్తి చూపిస్తున్న సీఎస్

• మీడియాపై తప్పుడు కేసులు
• పోలీసు వ్యవస్థ దిగాజారేలా ప్రవర్తిస్తున్న అధికారులు
• జవహర్ రెడ్డి, సీతారామాంజనేయులు, రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల డైరెక్షన్ లో
అక్రమ కేసులు పెడుతున్న అధికారులు
• విశాఖలో మహిళలపై జరిగిన దాడి అన్ని మీడియాల్లో వచ్చింది
• కుట్రపూరితంగా నేడు డీసీపీ కనుసన్నల్లో కంచర్లపాలెం స్టేషన్ లో కేసులు పెట్టారు
• అడ్డగోలు ఎఫైఆర్ లపై సిట్ దృష్టి పెట్టాలి.. వెంటనే డీజీపీ స్పందించాలి
• పోలీసుల చెర నుండి పారిపోయిన ఎమ్మెల్యే పిన్నెళ్లి అతని సోదరుడిని అరెస్ట్ చేయాలి, తాడిపత్రి, తిరుపతిలో రక్తపాతానికి కారణమైన వారిని పట్టుకోవాలి
• అరాచకాలకు కారకులైన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలి

• మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

తాడేపల్లి ప్యాలెస్ నుండి సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు ఇచ్చే ఆదేశాలకనుగుణంగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నాడని.. చీఫ్ సెక్రటరీ ఆదేశాలకనుగుణంగా యంత్రాంగం నడుస్తొందని.. అందుకే రాష్ట్రంలో ఎన్నికల తరువాత అరాచకం తాండవించిందని… దాన్ని చూపించిన మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిటీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..

చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న యంత్రాంగం మీడియా మీద కూడా కేసులు పెట్టేంతగా దిగజారారు. ఆపధర్మ ముఖ్యమంత్రి లండన్ వెళ్లిన తరువాత కూడా చీఫ్ సెక్రటరీ స్వామి భక్తి చూపిస్తున్నారు. లండన్ లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషం కోసం కేసులు నమోదు చేస్తున్నారు. విశాఖలో బాధితులు గోడుచెప్పుకున్నారు. ఎన్నిల తరువాత జరిగిన హింస అది. డబ్బులు తీసుకోలేదని ఓటు వేయలేదని మహిళలపై వైసీపీ నేతలు దాడి చేశారు. దానిపై డీసీపీ ప్రెస్ మీట్ ను కూడా మీడియా చూపించింది. తరువాత విష్ణుకుమార్ రాజు ఆ ఘటనపై ప్రెస్ మీట్ పెడితే దాన్ని లైవ్ చూపించిన ఈటివీని ఏ1గా ఏబీఎన్ ను ఏ2గా ఏ3గా విష్ణుకుమార్ రాజులపై కేసులు పెట్టారు. ఇది మీడియా స్వేచ్ఛపై దాడి చేయడమే.

అన్యాయాన్ని వివరిస్తే కేసులు పెట్టడం దారుణం. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. మీడియా మీద పెట్టిన సెక్షన్లు చూస్తే ఆశ్చర్యం కలుగులుంది. జగన్ స్వామి భక్తితో విశాఖ కంచర్లపాలెం పోలీస్టేషన్ ఖ్యాతి రాష్ట్రం దాటి దేశం వెళ్లిపోతుంది. డీసీపీ సత్తిబాబు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నాడు. అడ్డగోలుగా ఎఫైర్ లు కట్టాడు. దీనిపై వెంటనే సిట్ దృష్టి పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. డీజీపీ దీనిపై వివరణ ఇవ్వాలి. దీనికి చీఫ్ సెకట్రరీ బాధ్యత తీసుకోవాలి. ఈరోజుకు కూడా డీజీపీ అధికారం నడుస్తున్నట్లు కనిపించలేదు. ఇక్కడ నుండి రీలీవ్ అయిన అధికారులు ధనుజయ్ రెడ్డి, సీతారామాంజనేయులు, రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని నడిపిస్తున్నట్లు ఉంది.

మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతిలలో ఎన్నికల తరువాత, ఎన్నికల ముందు జరిగిన హింస కావాలని చేసిన కుట్రే. ఎక్కడైతే అధికారుల మార్పు జరిగిందో అక్కడ రక్తపాతాన్ని సృష్టించారు. ఇది ముమ్మాటికి జగన్ రెడ్డి కుట్ర, వైసీపీ కుతంత్రాలను పారదర్శకంగా ఈటీవి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలు జనాలకు ముందుకు దీసుకు వచ్చాయి. విశాఖలో మహిళలపై జరిగిన దాడి కళ్లకు కట్టినట్లు చూపిస్తే… బాధ్యత గల ప్రజా ప్రతినిధి దానిపై ప్రెస్ మీట్ పెడితే కేసులు పెట్టి ప్రతికా స్వేచ్ఛను కట్టడి చేయాలని చూడటం దారుణం.

ముఖ్యమంత్రి డైరెక్షన్ లో, సజ్జల డైరెక్షన్ లో చీఫ్ సెక్రటరీ నడుస్తున్నారు. చీఫ్ సెక్రటరీ తీరులో ఏ మార్పు లేదు. ఏం చేయాలో అదే చేస్తున్నాడు. పించన్లు సచివాలయాల్లో ఇస్తే వృద్ధులు ఇబ్బంది పడతారని మేము చెప్పినా సచివాలయాల చుట్టూ, బ్యాంకుల చూట్టూ పింఛన్ దారులను తిప్పి ఇబ్బంది పెట్టారు. నేడు మీడియాపై కేసులు పెట్టే విధంగా సీఎస్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం పనిచేస్తుంది. దీన్ని కట్టడి చేయాలని ఈసీని కోరుతాం. సిట్ కూడా పారదర్శకంగా పనిచేయాలి.

అధికార పక్షంతో అంటకాగడంతో నేడు కొంత మంది పోలీసులు అధికారులను ఒకే స్థాయి అధికారులు వచ్చి విచారిస్తుంటే తలలు దించుకునే పరిస్థితి వచ్చింది. బాధితుల గొంతు వినిపించడం నేరమా? మీడియా ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? వీటన్నింటిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. డీసీపీ కనుసన్నల్లో మీడియాపై విశాఖ కంచర్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులపై విశాఖ సీపీ వివరణ ఇవ్వాలి. విశాఖ పోలీసులు పెట్టిన చాలా సంఘటనలు ఈటివి, ఏబిఎన్ లు చూపించాయి. ఆరోజు రాని ఎఫైఆర్ లు ఈ రోజు ఎందుకు వచ్చాయి ?

ఎన్నికల్లో ఓట్లు వేయలేదనే కక్షతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డైరెక్షన్ లో దాడి చేశారు. దాడిని చూపించిన మీడియాపై అక్రమంగా కేసులు పెట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పోలీసులు అధికారుపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతాం. సిట్ దృష్టికి తీసుకెళ్తాం. మా కాల్ డేటా బయట పెడతామని టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి దౌర్యంగా చెబుతున్నారు. వైసీపీ నేతలకు ఆ దమ్ము దౌర్యం ఉందా. తప్పు చేసిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలి.

LEAVE A RESPONSE