Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే ప్రజలకు నిజమైన స్వేచ్ఛ

– తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్) లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
– జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
– పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించిన నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయ సిబ్బంది
– వేడుకల్లో టీడీపీ నేతలు అశోక్ బాబు, టీ.డీ.జనార్థన్, వర్ల రామయ్య, మొహమ్మద్ షరీఫ్, పీతలసుజాత, గురజాల మాల్యాద్రి, కోవెలమూడి రవీంద్ర , గురుమూర్తి, ఏ.వీ.రమణ, బుచ్చిరామ్ ప్రసాద్, నజీర్, దారపనేని నరేంద్ర, అఖిల్, హసన్ బాషా, శంకర్ నాయుడు, పిరయ్య వల్లూరి చిన్ని కిరణ్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

“గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులకు, ఇతరులం దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రజలకు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి తరుపున, నా తరుపున, లోకేశ్ తరుపున 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

ఈ రోజు భారతదే శానికి, భారత పౌరులకు అత్యంత ప్రాధాన్యమైన రోజు. మనకు స్వాతంత్ర్యం వచ్చాక మనకు మనం స్వయం పరిపాలను ప్రారంభించుకున్న రోజు ఈ రోజు. ఆనాడు ఒకసామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అత్యంత పేదరికం అనుభ వించిన వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగ రచన చేపట్టాల్సిందిగా అభ్యర్థించారు.

నాడు దేశంలో ఉన్న నాటి పరిస్థితులతో పాటు, అన్నివర్గాలు.. కులాలు.. మతాలు.. ప్రాంతాలతో పాటు, భిన్నభాషలు..విభిన్న సంస్కృతుల్ని ప్రతిబింబించేలా, దేశంలో సుపరిపాలన సాగేలా రాజ్యాంగాన్ని లిఖించాలని కోరారు.

చాలా మంది పెద్దలు, అనేక సందర్భాల్లో చెప్పారు. రాజ్యాంగం చెడ్డదైనా దాన్ని అమలుచేసే వ్యక్తి మంచివాడయితే, రాజ్యాంగం, పరిపాలన చక్కగా ముందుకు సాగుతాయని. రాజ్యాంగం ఎంత మంచిదైనా పాలించేవాడు దుర్మార్గు డు అయితే దానికి ఏమాత్రం విలువ ఉండదని కూడా చెప్పారు. గత ఐదేళ్ల నుంచీ రాష్ట్రంలో రెండో విధానమే అమలవుతోంది. రాజ్యాంగం చాలా గొప్పదైనా, దాన్ని అమలుచేస్తున్న వ్యక్తి దుర్మార్గుడు కావడంతో దానికి ఏమాత్రం విలువ లేకుండా పోయిందని చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం.

రాష్ట్రంలో ఎక్కడా అంబేద్కర్ రాజ్యాంగం అమలుకావడంలేదు. తనకు తాను తయారుచేసుకున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలుచేస్తున్నాడు. సొంత రాజ్యాంగం అమలు చేస్తూ, జగన్ సాగిస్తున్న దుర్మార్గపు పాలనతో రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం.

రాష్ట్రంలో మరలా అంబేద్కర్ రాజ్యాంగం ఎలాంటి అరమరికలు లేకుండా అమలు కావాలన్నా, స్వేచ్ఛా స్వాతంత్ర్యంతో పాటు పౌరులు వాక్ స్వాతంత్ర్యం పొందాలన్నా, ప్రజలంతా దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డిని, అతని నియంత్రత్వ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితే తప్ప ప్రజలు సుఖసంతోషాలతో జీవించలేరనేది కాదనలేని వాస్తవం.” అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE