తెలంగాణలో ‘రెడ్డి’ రాజ్యం!

– సీఎం కూడా రెడ్డే
– 52 శాతం అగ్రకులాల ఎమ్మెల్యేలే
– 119 మంది ఎమ్మెల్యేలలో 43 ముందు రెడ్లే
-కాంగ్రెస్‌లో 29 , బీఆర్‌ఎస్‌లో 14, బీజేపీలో ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు
-కాంగ్రెస్‌ 42 మంది, బీఆర్‌ఎస్‌ 41 మంది రెడ్లకు టికెట్‌
– కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేని వైనం
– 31 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు
– 7 గురు మజ్లిస్‌ ముస్లిం ఎమ్మెల్యేలు
– మిగిలిన 81 స్థానాల్లో 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలే
– కమ్మ 4,వెలమ 13, బీసీ 19, బ్రాహ్మణ-వైశ్య ఒక్కోటి
– సభలో సగం శాతం రెడ్లే
– గత సభలో 30 మంది రెడ్డి ఎమ్మెల్యేలు
– తెలంగాణ ఫలితాల్లో ‘రెడ్డి’ కార్పెట్‌
– ప్రజలు రెడ్ల నాయకత్వాన్ని ఆమోదించారన్న రెడ్డి సంఘ నేత కరుణాకర్‌రెడ్డి
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ఎన్నికల ఫలితాలలో గెలుపు ఓటమి ఎవరిదన్నది పక్కనపెడితే.. మళ్లీ కొన్ని దశాబ్దాల తర్వాత రెడ్డిరాజ్యం ఉద్భవించింది. నిజాం కాలంలో తెలంగాణలో రెడ్లు రాజ్యమేలగా, దేశ్‌ముఖ్‌లు గ్రామాలను శాసించారు. మళ్లీ అలాంటి కులవ్యవస్థ కాకపోయినా… మళ్లీ అదే కులం తెలంగాణను ఏలబోలవడమే విశేషం.

తాజా ఎన్నికలు ఆశ్చర్య ఫలితాలు మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో 119 శాసనసభ స్థానాలు ఉన్న అసెంబ్లీలో, 43 మంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అడుగుపెట్టబోతున్నారు. అంటే సగం శాతం రెడ్డి ఎమ్మెల్యేలు శాసనాలలో భాగస్వాములు కానున్నారన్నమాట.

ఈ ఫలితాలు మరో తమాషాను మిగిల్చాయి. అటు కాంగ్రెస్‌-ఇటు బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్క ముస్లిం కూడా శాసనసభకు ఎన్నిక కాకపోవడమే ఆ తమాషా. రాష్ట్రంలో 31 స్థానాలు ఎస్సీ-ఎస్టీకి చెందినవే కాబట్టి, అక్కడ ఆ వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎలాగూ మజ్లిస్‌ నుంచి గెలిచిన 7 గురు ఎమ్మెల్యేలూ ముస్లింలే కాబట్టి, దానిని పెద్దగా పరిగణనలోకి తీసుకుకోవలసిన పనిలేదు.

ఇక అన్ని పార్టీల నుంచి 43 మంది.. రెడ్డి కులానికి చెందిన ఎమ్మెల్యేలు, ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే ఈసారి విశేషం. ముఖ్యమంత్రి కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే కావడం ఇంకో విశేషం. ఈ ఎన్నికల్లో బీసీ 19 మంది, కమ్మ -4, వెలమ13, బ్రాహ్మణ-ఒకరు, వైశ్య-ఒకరు చొప్పున శాసనసభకు ఎన్నికయ్యారు. మొత్తంగా 62 శాతం అగ్ర కులాలకు చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

తెలంగాణలో రెడ్లది 9 శాతం. కమ్మ వర్గ జనాభా 4 శాతం. వెలమ వర్గ జనాభా ఒక శాతం లోపే. జనాభా-ఓటర్లలో అధికశాతం మాత్రం బీసీ, తర్వాత దళితులు. అయినా వెలమ వర్గానికి చెందిన వారు 13 మంది, కమ్మ వర్గానికి చెందిన వారు నలుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడమే ఆశ్చర్యం. కానీ జనాభాలో సింహభాగం ఉన్న బీసీలు మాత్రం, 19 స్థానాలకే పరిమితం కావడమే విస్మయం కలిగించే అంశం.

ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రెడ్లకు 42 టికెట్లు ఇవ్వగా, బీఆర్‌ఎస్‌ కూడా ఏమాత్రం తక్కువ చేయకుండా 41 మంది రెడ్లకు సీట్లిచ్చింది. అయితే అందులో కాంగ్రెస్‌ నుంచి 29 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 14 మంది, బీజేపీ నుంచి ముగ్గురు రెడ్లు విజయం సాథించారు. గత సభలో అన్ని పార్టీల నుంచి 30 మంది రెడ్డి ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు. ఈసారి ఆ సంఖ్య 13కు పెరగడం విశేషం. అంటే రెడ్ల వాటా 36-13 శాతమన్నమాట.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ సీఎంగా ఉండగా.. రెడ్ల హవా బాగా నడిచించి. రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి సాధారణ నామినేటెడ్‌ పదవుల వరకూ రెడ్లదే సింహభాగం. సీఎం-స్పీకర్‌-డీజీపీ వంటి కీలకస్థానాలన్నీ రెడ్లతోనే నిండిపోయేవి. దానిపై నాటి టీడీఎల్పీ ఉపనేత దేవేందర్‌ గౌడ్‌, ఇప్పటి ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ‘రెడ్డివారే దొడ్డవారా? అని నిప్పులు చెరిగారు. ఆ మేరకు ప్రభుత్వంలో రెడ్లు, ఏయే పదవుల్లో ఉన్నారన్న జాబితా ఒకటి విడుదల చేయడం చర్చనీయాంశమయింది.

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంపై రెడ్డి జెండా ఎగిరింది. ఫలితంగా వెలమ రాజ్యానికి తెరపడినట్లయింది. ‘రావుల పాలన’కు తెరదించి ఇప్పుడు రెడ్డి రాజ్యం వచ్చినా.. కాంగ్రెస్‌ అంతర్గత ఒప్పందం ప్రకారం, మళ్లీ రెండున్నర ఏళ్ల తర్వాత దళిత రాజ్యం రానుంది.

గతంలో రెడ్డి సంఘం నిర్వహించిన సభకు, హాజరైన రేవంత్‌రెడ్డి ప్రతి రెడ్డికి 10 ఎకరాల భూమి ఉండాలన్నారు. రెడ్ల చేతిలో రాజకీయ పార్టీలు ఉండాలని, ఉంటేనే అవి క్షేమంగా ఉంటాయన్న రేవంత్‌ వ్యాఖ్యలను, కాంగ్రెస్‌లోని బీసీ-దళిత నేతలు ఖండించడంతో అవి వివాదమైన విషయం తెలిసిందే.

ఇంతచేసినా తెలంగాణ రెడ్లు.. పెద్దమనిషిగా గౌరవించి అభిమానించే, వివాదరహిత నేత జనారెడ్డి సభలో లేకపోవడమే పెద్ద లోటు. ప్రస్తుతం ఉన్న నాయకులందరి కంటే అనుభవజ్ఞుడు, లౌక్యం-రాజకీయ వ్యూహాలు-సమన్వయ పరిచే శక్తి ఉన్న జానారెడ్డి, ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. దానితో నాగార్జునసాగర్‌లో ఆయన చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డి, తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టనున్నారు.

కాగా తాజా ఫలితాలపై ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సామాజికన్యాయం మీద ఆధారపడి జనాలను కలవకుండా, సమస్యలు వినకుండా సామాజిక న్యాయ నినాదమే తమను గట్టెక్కిస్తుందనే పార్టీలకు తెలంగాణ ఫలితాలు గుణపాఠ’‘మని కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. వీరంతా తమ సామాజికన్యాయ లెక్కలను పక్కనపెట్టి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాదిరిగా అందరికీ అందుబాటులో ఉంటే విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో రెడ్ల నాయకత్వాన్ని అన్ని వర్గాలు ఆమోదించాయన్న వాస్తవం ఈ ఫలితాలు చాటాయని విశ్లేషించారు. రెడ్లు మానవతాదృక్పథంతో పాలిస్తారని విశ్లేషించారు. బీసీని సీఎంను చేస్తామన్న బీజేపీ నుంచి, 5మంది ఓసీ ఎమ్మెల్యేలు గెలిచారని గుర్తు చేశారు. ఆ మేరకు ఆయన ‘తెలంగాణలో గెలిచిన రెడ్డి ఆణిముత్యాలు’ అంటూ, వారి ఫొటోలను విడుదల చేశారు.

సామాజికవర్గాల వారీగా వివరాలు..

రెడ్డి
1) ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌),
2) పైడి రాకే్‌షరెడ్డి (ఆర్మూర్‌),
3) పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (బోధన్‌),
4( పోచారం శ్రీనివా్‌సరెడ్డి (బాన్సువాడ),
5) కాటిపల్లి వెంకటరమణారెడ్డి (కామారెడ్డి),
6) డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి (నిజామాబాద్‌ రూరల్‌),
7) వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ),
8) పాడి కౌశిక్‌రెడ్డి (హుజూరాబాద్‌),
9) సంజీవరెడ్డి (నారాయణఖేడ్‌),
10) సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్‌),
11) గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు),
12) కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక),
13) చామకూర మల్లారెడ్డి (మేడ్చల్‌),
14) మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజ్‌గిరి),
15) బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్‌),
16) మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం),
17) దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్‌),
18) పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం),
19) టి. రామ్మోహన్‌రెడ్డి (పరిగి),
20) మనోహర్‌రెడ్డి (తాండూర్‌),
21) ఎనుముల రేవంత్‌రెడ్డి (కొడంగల్‌),
22) చిట్టెం పర్ణికారెడ్డి (నారాయణపేట),
23) యెన్నం శ్రీనివా్‌సరెడ్డి (మహబూబ్‌నగర్‌),
24) అనిరుధ్‌రెడ్డి (జడ్చర్ల),
25) మధుసూదన్‌రెడ్డి(దేవరకద్ర),
26) తూడి మేఘారెడ్డి(వనపర్తి),
27) బండ్ల కృష్ణమోహన్‌రెడి ్డ(గద్వాల),
28) కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్‌),
29) కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి),
30) కుందూరు జైవీర్‌రెడ్డి (నాగార్జునసాగర్‌),
31) బత్తుల లక్ష్మారెడ్డి(మిర్యాలగూడ),
32) నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్‌), 33) నలమాద పద్మావతిరెడ్డి (కోదాడ),
34) గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి (సూర్యాపేట),
35) కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(నల్లగొండ),
36) కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(మునుగోడు),
37) కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి),
38) పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ),
39) మామిడాల యశస్వినిరెడ్డి(పాలకుర్తి),
40) దొంతి మాధవరెడ్డి(నర్సంపేట),
41) రేవూరి ప్రకాశ్‌రెడ్డి(పరకాల),
42) నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్‌ పశ్చిమ),
43) పొంగులేటి శ్రీనివాసరెడ్డి(పాలేరు)

బీసీలు
పాయల్‌ శంకర్‌(ఆదిలాబాద్‌),
రామారావు పటేల్‌(ముథోల్‌),
మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌(రామగుండం),
గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌),
ఆది శ్రీనివాస్‌ (వేములవాడ),
పొన్నం ప్రభాకర్‌(హుస్నాబాద్‌),
చింతా ప్రభాకర్‌(సంగారెడ్డి),
కేపీ వివేకానంద(కుత్బుల్లాపూర్‌),
వి. ప్రకాశ్‌గౌడ్‌(రాజేంద్రనగర్‌),
ముఠా గోపాల్‌(ముషీరాబాద్‌),
కాలేరు వెంకటేశ్‌(అంబర్‌పేట),
దానం నాగేందర్‌(ఖైరతాబాద్‌),
తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(సనత్‌నగర్‌), రాజాసింగ్‌(గోషామహల్‌), టి.పద్మారావుగౌడ్‌(సికింద్రాబాద్‌),
వాకిటి శ్రీహరి(మక్తల్‌),
వీర్లపల్లి శంకర్‌ (షాద్‌నగర్‌),
బీర్ల అయిలయ్య(ఆలేరు),
కొండా సురేఖ(వరంగల్‌ తూర్పు)

వెలమలు
1) డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు(సిర్పూర్‌),
2) కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(మంచిర్యాల),
3) మదన్‌మోహన్‌రావు(ఎల్లారెడ్డి),
4) కల్వకుంట్ల సంజయ్‌(కోరుట్ల),
5) డాక్టర్‌ సంజయ్‌కుమార్‌(జగిత్యాల),
6) చింతకుంట్ల విజయరమణారావు(పెద్దపల్లి),
7) కల్వకుంట్ల తారక రామారావు(సిరిసిల్ల),
8) తన్నీరు హరీశ్‌రావు(సిద్దిపేట),
9) మైనంపల్లి రోహిత్‌రావు(మెదక్‌),
10) కల్వకుంట్ల చంద్రశేఖరరావు(గజ్వేల్‌),
11) మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి),
12) జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్‌),
13) గండ్ర సత్యనారాయణరావు(భూపాలపల్లి).

ఎస్సీలు
1) గడ్డం వివేక్‌(చెన్నూరు),
2) గడ్డం వినోద్‌(బెల్లంపల్లి),
3) తోట లక్ష్మీకాంతరావు(జుక్కల్‌),
4) అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌(ధర్మపురి),
5) మేడిపల్లి సత్యం(చొప్పదండి),
6)కవ్వంపల్లి సత్యనారాయణ(మానకొండూర్‌),
7) దామోదర రాజనరసింహ(ఆందోల్‌),
8) మాణిక్‌రావు(జహీరాబాద్‌),
9) కాలె యాదయ్య(చేవెళ్ల),
10) గడ్డం ప్రసాద్‌కుమార్‌(వికారాబాద్‌),
11) లాస్య నందిత(కంటోన్మెంట్‌),
12) విజయుడు(అలంపూర్‌),
13) చిక్కుడు వంశీకృష్ణ (అచ్చంపేట),
14) వేముల వీరేశం(నకిరేకల్‌),
15) మందుల సామేల్‌(తుంగతుర్తి),
16) కడియం శ్రీహరి(స్టేషన్‌ ఘన్‌పూర్‌),
17) కేఆర్‌ నాగరాజు (వర్దన్నపేట),
18) మల్లు భట్టి విక్రమార్క(మధిర),
19) మట్టా రాగమయి(సత్తుపల్లి).

మైనార్టీలు:-
1) అక్బరుద్దీన్‌ ఓవైసీ(చాంద్రాయణగుట్ట),
2) అహ్మద్‌ బలాలా(మలక్‌పేట),
3) మాజిద్‌ హుస్సేన్‌(నాంపల్లి),
4) కౌసర్‌ మొహి యుద్దీన్‌(కార్వాన్‌),
5) జుల్ఫికర్‌ అలి (చార్మినార్‌),
6) జాఫర్‌ హుస్సేన్‌(యాకత్‌పురా),
7) మహ్మద్‌ మొబిన్‌(బహదూర్‌పురా)

కమ్మ
1) అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి),
2) మాగంటి గోపీనాథ్‌(జూబ్లీహిల్స్‌),
3) తుమ్మల నాగేశ్వరరావు(ఖమ్మం),
4) కూనంనేని సాంబశివరావు (కొత్తగూడెం)

బ్రాహ్మణ
1) దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(మంథని)

వైశ్య
1) ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా (నిజామాబాద్‌ అర్బన్‌),

Leave a Reply