సచివాలయాల్లో రిజిస్ట్రేషన్  సేవలు

-ప్రయోగాత్మకంగా క్రిష్ణా జిల్లాలో 103 సచివాలయాలు ఎంపిక
-ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం, అక్టోబర్ 08: రాష్ట్ర ప్రజలకు సమస్త సేవలు అందిస్తున్న గ్రామ వార్డు సచివాలయాలు కేంద్రంగా స్థిరాస్తి క్రయ విక్రయాలు, ఇతర లావాదేవీల రిజిస్ట్రేషన్లు చేపట్టేలా ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన రిజిస్ట్రేషన్ సేవలు, మరికొన్ని సచివాలయాలకు విస్తరించేందుకు ప్రభుత్వం తాజాగా పలు సచివాలయాలను ఎంపిక చేసిందని అన్నారు. ఈ మేరకు క్రిష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా 103 సచివాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసిందని అన్నారు.

ఏపీ ప్రభుత్వం సమర్పించిన 9 ప్రతిపాదనలకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని విజయసాయి రెడ్డి కోరారు. పీఎం గతి శక్తి  స్కీం కింద కర్నూలు, కొప్పర్తి లలో ప్రతిపాదించిన ప్రాజక్టులు, భోగాపురం ఎయిర్ పోర్టు, తదితర ప్రాజక్టుల కొరకు రూ 782 కోట్లు ఆర్థిక సహకారం కోరుతూ సమర్పించిన ప్రాజక్టులు త్వరిత గతిన క్లియర్ చేయాలని కోరారు.

వర్షాకాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, దాని ప్రభావానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. వాతావరణ శాఖ నిపుణులు, వ్యవసాయ శాఖ నిపుణులు, విపత్తు నిర్వహణ నిపుణులు ఆ కమిటీలో సభ్యలుగా చేర్చాలని కోరారు.

Leave a Reply