Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల

గుంటూరు : వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇంఛార్జిల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది.

మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ఎంపీలకూ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.

1) అనంతపురం ఎంపీ – మాలగుండ్ల శంకరనారాయణ
2) హిందూపురం ఎంపీ – జోలదరాశి శాంత
3) అరకు ఎంపీ (ఎస్టీ) – కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి
4) రాజాం (ఎస్సీ) = డా! తాలె రాజేష్‌
5) అనకాపల్లి – మలసాల భరత్‌ కుమార్‌
6) పాయకరావుపేట (ఎస్సీ) – కంబాల జోగులు
7) రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాష్‌
8) పి.గన్నవరం (ఎస్సీ) – విప్పర్తి వేణుగోపాల్‌
9) పిఠాపురం – వంగా గీత
10) జగ్గంపేట – తోట నరసింహం
11) ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు.
12) రాజమండ్రి సిటీ – మార్గాని భరత్‌
13) రాజమండ్రి రూరల్‌ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
14) పోలవరం (ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మి
15) కదిరి బి ఎన్ మక్బుల్ అహ్మద్
16) ఎర్రగొండపాలెం (ఎస్పీ) తాటిపర్తి చంద్రశేఖర్‌
17) ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్‌
18) తిరుపతి భూమన అభినయ్‌ రెడ్డి
19) గుంటూరు ఈస్ట్‌ – షేక్‌ సూరి ఫాలిమా
20) మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
21 చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి
22) పెనుకొండ – కె.వి. ఉషా శ్రీచరణ్‌
23) కళ్యాణదుర్గం – తలారి రంగయ్య
24) అరకు (ఎస్టీ) – గొడ్డేటి మాధవి
25) పాడేరు (ఎస్టీ) = మత్స్య రాస విశ్వేశ్వర రాజు
26) విజయవాడ సెంట్రల్‌ – వెలంపల్లి శ్రీనివాస రావు
27) విజయవాడ వెస్ట్‌ – షేక్‌ ఆసిఫ్‌

LEAVE A RESPONSE