– బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలి
– బీసీల బంద్ కు మద్దతు కోరిన బీసీ జేఏసీ నాయకులు, సంపూర్ణ మద్దతు ప్రకటించిన కల్వకుంట్ల కవిత
– తెలంగాణ జాగృతి, బీసీ జేఏసీ నాయకుల ఉమ్మడి ప్రెస్ మీట్
– తెలంగాణ జాగృతి కార్యాలయానికి బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని , జాతీయ బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ నాయకులు.. ఘన స్వాగతం పలికిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఇతర నాయకులు
హైదరాబాద్: బీసీల్లో పుట్టి పోరాటం చేయడం కామన్. కవిత బీసీల గురించి పోరాటం చేయడం అభినందనీయం. కవితను బీసీలు ఆదర్శంగా తీసుకోవాలని బిజెపి ఎంపి, బీసీ జాతీయ నేత పిలుపునిచ్చారు. . కవితకు బీసీల మద్దతు తప్పకుండా ఉంటుంది. బీసీ రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేసింది. సందర్భాలను బట్టి రిజర్వేషన్లను పెంచుకోవచ్చని కోర్టులు తీర్పు ఇచ్చాయి. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలి అన్నారు.
ఎస్సీ,ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ల ఉన్నాయి. బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లను ఇవ్వాలి. బీసీలలో బలమైన ఉద్యమం ఒక్క రాష్ట్రంలో తయారు అయిన కేంద్రంపై ప్రభావం పడుతుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు చట్టసభల్లో సైతం రిజర్వేషన్లను ఇవ్వాలి.
తెలంగాణలో మొదలైన బీసీ ఉద్యమం అన్ని రాష్ట్రాలకు పాకాలి. బీసీలు అడిగేది శత్రువుల పంచాయతీ కాదు. అన్నదమ్ముల వాటాను బీసీలు అడుగుతున్నారు. బీసీల ఉద్యమానికి తెలంగాణ జాగృతి సహకరించాలి.
తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతి: కల్వకుంట్ల కవిత
ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ జేఏసీ ఏర్పడింది. తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతిగా ఉంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మభ్యపెడుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశాయి. రేపు జరిగే బంద్ లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎక్కడికక్కడ పాల్గొంటారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటు లో చట్టం చేసే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది.
మద్దతు అడగకపోయినా బీసీల కోసం తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తుంది. తెలంగాణ జాగృతి కార్యాలయానికి వచ్చిన బీసీ జేఏసీ నేతలకు ధన్యవాదాలు.
కవితలా అగ్రవర్గాల నేతలు బీసీల గురించి మాట్లాడాలి : వీజీ ఆర్ నారగోని
తెలంగాణలో రెండవ దశ ఉద్యమం బీసీ ఉద్యమ రూపంలో ప్రారంభం అయింది. అన్ని పార్టీలు కట్టకట్టుకుని బీసీలను మోసం చేస్తున్నాయి. బీసీలకు రావాల్సిన హక్కులు, అజెండా మాత్రమే మిగిలి ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. బీసీలకు ఎలాంటి సిద్ధాంతాలు, రాద్దాంతాలు లేవు. రేపు జరిగే బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి.
మావోయిస్టులు సైతం మద్దతు ఇచ్చారు. కవిత కొంతకాలంగా పూలే విగ్రహం గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నారు. కవిత లాగా అగ్రవర్గాల నేతలు బీసీల గురించి మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వంపై,కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చే విధంగా మనం పోరాటం చేద్దాం. బీసీ జెఏసీకి మద్దతు ఇచ్చిన తెలంగాణ జాగృతికి ధన్యవాదాలు.