Suryaa.co.in

Telangana

రేవంత్ .. చంద్రబాబును అడుక్కుంటావా..సిగ్గులేదా?

– 500 టీఎంసీ లకోసం రేవంత్ అడగడం ఎంగిలి మెతుకులకోసం ఆశ పడటం కాదా?
– హక్కుగా రావలసిన వాటా కోసం సాగిలబడతావా?
– పెద్ద పెద్ద మాటలు ఎందుకు గానీ, ముందు బంక చర్ల ను ఆపు
– దమ్ముంటే రేవంత్ రెడ్డి హరీష్ రావు తో చర్చకు రావాలి
– ఎంతమందినైనా చర్చకు తీసుకురా ? ఎవరికెంత జ్ఞానం ఉందో తేల్చేద్దాం
– పద్దెనిమిది నెలల్లో రేవంత్ రెడ్డి ఏదైనా మంచి పని చేశారని నిరూపిస్తే గుండు కొట్టించుకుంటా
– చిల్లర మాటలకు చిరునామా రేవంత్ రెడ్డి
– నువ్వు పొట్టిగా ఉండి సీఎం కాలేదా ?
– తెలంగాణ కు రేవంత్ రెడ్డి శాపం
– ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు జి .దేవి ప్రసాద్ , చిరుమళ్ల రాకేష్ కుమార్ ,రాంచంద్ర నాయక్

హైదరాబాద్ : ‘‘ రేవంత్ రెడ్డి చిల్లర మాటలకు చిరునామాగా మారారు. పచ్చి అబద్ధాలకు మారుపేరు రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కుగా డిమాండ్ చేయాల్సిన నీటివాటాను తన గురువు చంద్రబాబును అడుక్కోవడం సిగ్గుచేటు. ఇది యావత్ తెలంగాణను అవమానించడమే కాదు. తెలంగాణ ప్రజలను దేశ ప్రజల దృష్టిలో బిచ్చగాళ్లగా చిత్రీకరించడమే. అడుక్కోవడం కాదు. కేసీఆర్‌ను చూసి పోరాటం ఎలా చేయాలో నేర్చుకో. పెద్ద పెద్ద మాటలు ఆపి ముందు బనకచర్లను ఆపు. నీ సత్తా ఏందో తెలుస్తుంది’’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.

శ్రవణ్ ఇంకా ఏమన్నారంటే.. కేసీఆర్ ,కే టీ ఆర్ ,హరీష్ రావు ,బీ ఆర్ ఎస్ ల పై నరనరాన విషం నింపుకుని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మోడీ ని నొప్పియ్యొద్దు ,చంద్రబాబు ను మెప్పియ్యాలి అనే ధోరణి తో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు.

మిడిమిడి జ్ఞానం తో మిడతలా ఎగిసి పడుతున్నాడు. తెలంగాణ కు శాపం లా మారాడు రేవంత్ రెడ్డి. మోడీ ,చంద్రబాబు ల గురించి ఎందుకు రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రజల గురించి నీకు పట్టదా ? చంద్రబాబుకు రేవంత్ రుణపడి ఉండాలి. తప్పు లేదు . కొడంగల్ లోనో నీ ఫార్మ్ హౌజ్ లో చంద్రబాబు గుడి కట్టుకో తప్పులేదు.

చంద్రబాబు గురించి గోదావరి ,కృష్ణా జలాలను ఫణంగా పెడితే మాత్రం రేవంత్ రెడ్డి కి కర్రు కాల్చి వాత పెడుదాం జాగ్రత్త.

బుద్ధి జ్ఞానం లేకే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేదంటున్నాడు. కేసీఆర్ కు నీళ్ల పై శ్రద్ధ లేకుంటే తెలంగాణ ఇంత సస్య శ్యామలం అయ్యేదా ? కేసీఆర్ హయం లో తెలంగాణ లోని 86 శాతం సాగు యోగ్యమైన భూమి గా మారింది. రేవంత్ హయం లో 2 శాతం తగ్గింది.

కేసీఆర్ గోదావరి జలాలను వాడుకుని తెలంగాణ ను సస్యశ్యామలం చేశాక, రాయలసీమ కు నీళ్లివ్వాలి అన్నాడు .ఇందులో తప్పు ఏమి ఉంది ? అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ చేసిన వాదనలు రేవంత్ రెడ్డి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఎజెండా నెంబర్ 5 ను ఉద్దేశపూర్వకంగా రేవంత్ విస్మరించి ఎజెండా 1 గురించి మాట్లాడుతున్నారు.

తెలంగాణ అనుమతి లేకుండా ఏపీ లో గోదావరి ప్రాజెక్టులకి అంగీకరించమని కేసీఆర్ స్పష్టం చేశారు. 2 .10 .2020 లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు రాసిన లేఖలో సముద్రం లో కలుస్తున్న 3 వేల టీఎంసీ ల్లో 1950 టీఎంసీ లు, తెలంగాణ కు కేటాయించాలని కేసీఆర్ కోరారు. గోదావరి లో హక్కుగా ఉన్న 968 టీఎంసీ లకు తోడు 1950 టీఎంసీ లు కావాలని అంటే దాదాపు 3 వేల టీఎంసీ లు కావాలని కోరారు.

వెయ్యి టీఎంసీ లు చాలు అంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాదా ? నీ తాత జాగీరా రేవంత్ రెడ్డి.. వెయ్యి టీఎంసీ లు చాలు అనడానికి? చంద్రబాబు ను అడుక్కుంటావా ? 2023 లో హరీష్ రావు కేంద్రానికి రాసిన లేఖను కండ్లు పెద్దవి చేసుకుని చూడు రేవంత్ రెడ్డి .వాస్తవాలు తెలుస్తాయి. 26 జూన్ 2017 నాడు కృష్ణా జలాల్లో వాటా కోసం మరో లేఖ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం రాసింది. 299 టీఎంసీ లు తాత్కాలిక అవగాహన మాత్రమే ..ఫైనల్ అగ్రిమెంట్ కాదు .ఇది రేవంత్ కు కూడా తెలుసు.

సెక్షన్ 3 ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్ లో వాదన జరగాలని 32 సార్లు లేఖలు రాసి కేసీఆర్ చివరకు విజయం సాధించారు. ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు మెప్పుకోసం కేసీఆర్ ,హరీష్ రావు లపై రేవంత్ రెడ్డి బట్ట కాల్చి మీద వేస్తున్నాడు. కృష్ణా ట్రిబ్యునల్ లో 763 టీఎంసీ ల కోసం వాదనలు జరుగుతుంటే, 500 టీఎంసీ లకోసం రేవంత్ అడగడం ఎంగిలి మెతుకులకోసం ఆశ పడటం కాదా?

గోదావరి లో 3 వేల టీఎంసీ లు కృష్ణా లో 763 టీఎంసీ లు అడుగుతున్న కేసీఆర్ గొప్పనా ? గోదావరి లో వెయ్యి టీఎంసీ లు ,కృష్ణా లో 500 టీఎంసీ లు అడుగుతున్న రేవంత్ గొప్పనా ? బాడీ షేమింగ్ గురించి సీఎం హోదాలో ఉండి మాట్లాడొచ్చా ?వేరే దేశం లో అయితే కేసు పెట్టేవారు హరీష్ రావు పొడుగ్గా ఉంటే నీకు వచ్చిన నష్టం ఏమిటి ? నువ్వు పొట్టిగా ఉండి సీఎం కాలేదా ?

దమ్ముంటే రేవంత్ రెడ్డి హరీష్ రావు తో చర్చకు రావాలి. హరీష్ రావు ఒక్కరే చర్చకు వస్తారు .మేము ఒప్పిస్తాం .రేవంత్ రెడ్డి.. ఎంతమందినైనా చర్చకు తీసుకురా ? ఎవరికెంత జ్ఞానం ఉందో తేల్చేద్దాం. ఏ విషయం తెలియని రేవంత్ రెడ్డి ఇకనైనా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. పద్దెనిమిది నెలల్లో రేవంత్ రెడ్డి ఏదైనా మంచి పని చేశారని నిరూపిస్తే నేను గుండు కొట్టించుకుంటా.

అందాల పోటీలతో రాష్ట్రాన్ని అభాసు పాలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీ జే పి కి బీ ఆర్ ఎస్ అవయవ దానం చేయడం కాదు. బీజేపీ కి ఎనిమిది ఎంపీ లు గెలిపించి మోడీకి నజరానా ఇచ్చిన నువ్వా మాట్లాడేది రేవంత్ రెడ్డి. ఈ పెద్ద పెద్ద మాటలు ఎందుకు గానీ, ముందు బంక చర్ల ను ఆపు రేవంత్ రెడ్డి. ఇందుకు కేసీఆర్ ను ఏ సాయమైనా అడుగు. చేస్తారు.

LEAVE A RESPONSE