– సీమ ప్రజల నోటికాడ గుక్కెడు నీళ్లను అడ్డుకోవాలనుకోవడం దురదృష్టం
– ప్రాంతాల మధ్య విద్వేషం పెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రికి భావ్యం కాదు
– శ్రీరామ ఎత్తిపోతల పథకం మోటార్లు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు
ఒంటిమిట్ట: నదుల అనుసంధానం చెయ్యడం ఒక్కటే రాయలసీమ కరువుకు పరిష్కారం అని చంద్ర బాబు బనకచర్ల రిజర్వాయర్ నిర్మాణం ద్వారా గోదావరి , కృష్ణ , పెన్నా నదుల అనుసంధానం చేయాలని సంకల్పాన్ని కొందరు అడ్డుకోవాలనుకోవడం దురదృష్టం. రేవంత్ రెడ్డి సైతం రాజకీయంగా ఆర్థికంగా ఆంధ్రుల చేతుల్లో పెరిగి, తీరా ముఖ్యమంత్రి అయ్యి సీమ ప్రజల నోటికాడకు వస్తున్న గుక్కెడు నీళ్లను అడ్డుకోవాలనుకోవడం దురదృష్టం అన్నారు. ప్రాంతాలమధ్య విద్వేషం పెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రికి భావ్యం కాదు అని హెచ్చరించారు
2014 కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట ఆలయం అధికారికంగ , ప్రకటించి, ఆలయం పక్కన వున్న చెరువు నిరంతరం జలకల వుండాలని, చర్యలు చేపట్టన్నారు.
చామర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ.. శ్రీరామ నవమి నాడు తెప్పొస్తవం, ఒంటిమిట్ట ప్రజల త్రాగు సాగు మరియు మండలం మొత్తం భూగర్భ జలాలు పెంచాలని 35 కోట్లు వెచ్చించి సోమశిల వెనుక జలాలు ఎత్తిపోతల పథకం అభివృద్ధి చేస్తే , జగన్ పాలనలో మోటర్లు మెయింటినెన్స్ చెయ్యలేదు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు అన్నారు.
భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం కొరకు ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతున్నట్లు చెప్పారు, ఈ కార్యక్రమంలో చెరువు అధ్యక్షుడు గంగిరెడ్డి , బిజెపి టీడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు