– గోదావరి కృష్ణా జలాలు మీ అయ్య సొమ్మా?
– రేవంత్ చేసిన ద్రోహానికి ఉరి తీసిన తప్పులేదు
– నల్లమల బిడ్డ కాదు.. వెకిలి మాటల వెర్రిబిడ్డ రేవంత్
– మీ అయ్య జాగీరా? నువ్వేమైనా రాజువా?
– బాబును అడుక్కునే బుద్ధి పోతలేదు
– చంద్రబాబు ఎవడు ఇచ్చేది? మనకు అనుమతులు వచ్చాక?
– అంటే బనకచర్ల కట్టుకో అనే అర్థం. గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నవా.
– రేవంత్ రెడ్డి కుసంస్కారి.. వదులుబోతు
– సలహాదారుడు అంతకంటే గొప్ప ఘనుడు
– ఆదిత్యా దాస్ బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉంది అంటాడు
– బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ ల గురించి తెలుసుకోవడం
– బనకచర్ల విషయంలో మొద్దునిద్ర లేపింది బిఆర్ఎస్
– తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. గత కొంతకాలంగా బనకచర్లను అడ్డుకోండి అని మేము మాట్లాడితే, బోడి గుండు కు మోకాలుకు లంకె పెట్టినట్లు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కనపెట్టి సొల్లు వాగుడు వాగారు. ముఖ్యమంత్రి బేసిన్ ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నేను రేవంత్ రెడ్డి మాట్లాడారు.
బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది గాని బేసిన్ల మీద నాలెడ్జ్ లేదు.
పిపిటి పెట్టి మరీ రేవంత్ రెడ్డి , ఉత్తంకుమార్ రెడ్డి తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. సీఎం, నీళ్ల మంత్రి బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు. దేశం ముందు పరువు పోయే పరిస్థితి. అవగాహన లేకుండా మాట్లాడడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. రేవంత్ రెడ్డి అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తిభవించిన మూర్ఖత్వంతో మాట్లాడారు.
దేవాదుల ఏ బేసిన్ లో ఉందో తెలియదు, బనకచర్ల ఏ బేసిన్లో కడుతున్నారో తెలియదు.రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్లు? బనకచర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల నుండి పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాల రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ కేంద్ర జల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే, అమాయకంగా ముఖ్యమంత్రి అడుగుతారు బనకచర్ల ఏ బీసీల్లో ఉందని.
నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియార్టీ ఉందో ఆరు నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినావో నిన్న బయటపడ్డది. ఆంధ్ర దోపిడీ అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు పారియ్యి ముఖ్యమంత్రి అంటే, అక్రమ ప్రాజెక్టును ఆపవయ్యా రేవంత్ రెడ్డి అంటే, అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్దాల ప్రవాహాన్ని ముఖ్యమంత్రి పారించారు.
అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్క తోవ పట్టించారు. రాజకీయ వేదికగా మార్చకు, బనకచర్ల ఆపాలి అని మా ఇంటి రవిచంద్ర అంటే అబద్ధాలకు వేదికగా మార్చారు. రేవంత్ రెడ్డి కుసంస్కారి. వదులుబోతు. ఉద్యమాల నుంచి మేము వచ్చినం. నీలాగా అడ్డమైన తొక్కులు తొక్కుతూ రాలేదు.
దేవాదుల కూడా గోదావరి బేసిన్ కదా అని కొత్తగా అడుగుతున్నాడు. బనకచర్ల ఏ బేసిన్ లో ఉంది అంటడు. బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ ల గురించి తెలుసుకోవడం. అజ్ఞానం బయట పెట్టుకుని, రాష్ట్ర ముందు పరువు తీసుకుని నిన్ను నువ్వు. ఆయన సలహాదారుడు ఆదిత్యా దాస్ బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉంది అంటాడు. అది ఉన్నది నంద్యాల జిల్లాల్లో. ముఖ్యమంత్రి అట్లంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప ఘనుడుగా ఉన్నాడు.
మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. తొక్కుకుంటా వచ్చిన అంటడు. నల్లమల తెలంగాణ కిందికి వస్తదా ఆంధ్ర కిందికి వస్తదా అంటాడు. నల్లమల బిడ్డ కాదు వెకిలి మాటల వెర్రిబిడ్డ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ. బనకచర్ల విషయంలో మొద్దునిద్ర లేపింది బిఆర్ఎస్ పార్టీ. నేను రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి వాయిస్తే, పాత డేట్లు వేసి ఉత్తరాలు విడుదల చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా రాజకీయ వేదికగా మార్చిండు. బనకచర్ల ను ఆపడానికి ప్రయత్నం చేయలేదు. బనకచర్లను గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు. గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టిఎంసీలు ఇచ్చి ఎంతైనా తీసుకుపో అంటాడు. మీ అయ్య జాగీరా? నువ్వేమైనా రాజువా. నువ్వు ఎలా చెబుతావు. ఇది డెమొక్రటిక్ ప్రభుత్వం. స్టేట్ ఆఫ్ తెలంగాణ. హూ ఆర్ యు టెల్ లైక్ దట్.
మీ మూర్ఖత్వం వల్ల రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ముందు రేవంత్ రెడ్డి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నిన్నటి ప్రెజెంటేషన్ లోనే సుబ్రమణ్య ప్రసాద్ స్పష్టంగా చెప్పాడు. 968 టీఎంసీలకు తెలంగాణలో ప్రాజెక్టుగా రూపకల్పన జరిగింది, అందులో 946 Tmc CWC హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది అని చెప్పిండు. చంద్రబాబును అడుక్కునే బుద్ధి పోతలేదు. చంద్రబాబు దయ మీద బతికే బుద్ధి పోతలేదు.
చంద్రబాబు ఇచ్చేది ఏంది వెయ్యి టీఎంసీలు? తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ 968 లో 946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించాము.
చంద్రబాబు ఎవడు ఇచ్చేది? మనకు అనుమతులు వచ్చాక? అంటే బనకచర్ల కట్టుకో అనే అర్థం. గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నవా? సోయి ఉంది మాట్లాడుతున్నావా లేదా? కేసీఆర్ జల శక్తిమంత్రికి రాసిన లేఖలో.. గోదావరిలో 968 TMC మాకు కేటాయించారు, 3000 TMC నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి అందులో 1950 tmc మాకు కావాలి అని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మాత్రం వేయి ఇచ్చి మొత్తం తీసుకో అంటున్నాడు. కెసిఆర్ 968 మరియు 1950 మా లెక్క అంటున్నాడు. ఎవరు ఏపీకి దాసోహం అవుతున్నారు. రేవంత్ రెడ్డి ఈ రికార్డు తెప్పించి చూసుకో. కృష్ణ విషయంలోనూ అదే అజ్ఞానం. ఆ జిల్లాలో పుట్టి కృష్ణ నదిపై అవగాహన లేకపోవడం దారుణం.
ముఖ్యమంత్రి పక్కన పెట్టు. జడ్పిటిసి ఎమ్మెల్యేగా చేసినావు కదా. అందులో కూడా 500 టిఎంసి ఇచ్చి మొత్తం నీళ్లు తీసుకో అంటడు. రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఉరి తీసిన తప్పులేదు. కెసిఆర్ తెలంగాణ కోసం, నీళ్ల కోసం ఎంతో పోరాటం చేశారు. కెసిఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి దిగివచ్చి, ఎడమ కాలువ లిఫ్టులు కూడా కుడి కాలువలే ప్రభుత్వమే మెయింటైన్ చేస్తున్నది.
750 టీఎంసీల నీళ్ళు రావాలని బ్రిడ్జెస్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదించాం. సెక్షన్ 3 కోసం పోరాడిండు కేసీఆర్. కృష్ణాలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం మనకు 299 టీఎంసీలే వచ్చాయి. అది ఈ కాంగ్రెస్ దరిద్రం వలనే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల నిర్ణయం జరిగింది. ఆ పాపం కాంగ్రెస్దే.
న్యాయమైన వాటా కోసం సుప్రీం వెళ్ళారు. 763 tmc నీళ్ళు రావాలని విధించాలని లాయర్లకు సూచించారు. పోలవరం ద్వారా మళ్ళించే 80 tmc లో 45 రావాలని కూడా చేర్చారు. దాని ప్రకారం 75% డిపెండబిలిటీ కింద 555 tmc, 65 డిపెండబులిటీ కింద 43 tmc , average కింద 120 tmc, వాటర్ డైవర్షన్ కింద 45 టీఎంసీ అన్ని కలిపి 763 టీఎంసీలు కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాలని ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్ ఫైల్ చేసింది.
మీరు చెబుతున్నది ట్రిబ్యునల్ ను ఎఫెక్ట్ చేయదా? 500 చాలు అని ఎలా అంటావు. మన వాదనకు విలువ ఉంటదా? బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? గోదావరి కృష్ణా జలాలు మీ అయ్య సొమ్మా? నువ్వు తెలంగాణకు కాపలాదారుడు మాత్రమే. రాష్ట్ర హక్కులను చంద్రబాబు కు రాసిస్తా ఆంధ్ర ప్రదేశ్కు రాసిస్తా అంటే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఎవరు చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఎవరు చంద్రబాబుకు దాసోహం అంటున్నారు?
తప్పుడు సమాచారం ఇస్తే జైల్లో వేస్తామని హెచ్చరికలు పొందిన వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డికి సలహాదారుడు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బకొడుతూ ఏపీకి వత్తాసు పలుకుతూ.. ఏపీ అక్రమ ప్రాజెక్టులను కాపాడే ప్రయత్నం చేస్తే జైల్లో వేస్తామని కోర్టు బెదిరించింది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అంటున్నాడు రేవంత్. ఈరోజు చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి ఈ ఆదిత్యనాథ్.
3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనిపెట్టిండు అంటడు. గోదావరి నుండి ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తాయని 60 ఏళ్ల లెక్కలు cwc చెప్పింది. దాని ప్రకారం ప్రతి ఏటా కనీసం 3000 tmc సముద్రములో కలుస్తున్నాయి. ఇదే విషయాన్ని కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చెప్పారు. దీనికి కూడా రేవంత్ రెడ్డి వక్రీకరించారు. బనకచర్లనే ముచ్చట ఇక్కడ లేదు.
తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పది అబద్దాలు మాట్లాడడం రేవంత్ రెడ్డి అలవాటు. నిన్న రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో చదివిన దాన్ని నేను కూడా చదువుతాను. బనకచర్లకు నీళ్లు తీసుకువెళ్లాలని అందులో ఎక్కడా లేదు.
కృష్ణా నదిలో రెండు రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు ముంచడం లేదు. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని రెండు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని రెండు రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసిఆర్ సూచించారు.
అదే పేజీలో చెప్పిన ఇంకో అంశాన్ని మాత్రం కావాలని చదవలేదు. చాలా స్పష్టంగా గోదావరి కృష్ణ నదుల అనుసంధాన విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని చెప్పారు. దీని మాత్రం దాచి పెట్టిండు. వేయి ఇచ్చి ఎన్నైనా పట్టుకోపో అంటున్నాడు.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ ఎన్నడూ అగ్రి చేయలేదు. అసలు బనకచర్ల అనే చర్చ లేదు. జగన్తో ఏమి మాట్లాడామో ఎజెండా ఉంటే బయట పెట్టు. రెండు రాష్ట్రాలకు నదీ జలాల గురించి కేసీఆర్ మాట్లాడారు. వాస్తవానికి ఆ ప్రస్తావన ముందుకు పోలేదు. జగన్ అంగీకరించలేదు. నది మార్గంగా నీళ్లు తేవాలని అప్పుడు అనుకున్నారు. దానివల్ల నాగార్జునసాగర్, శ్రీశైలం పరిధిలో నీళ్లు వస్తాయి అని.
కానీ ఈరోజు వీళ్లు చేస్తున్నది నది మార్గంగా కాకుండా, తెలంగాణ టచ్ కాకుండా 200 టీఎంసీలు తన్నుకు పోతున్నారు. దీని ఆపాల్సిన బాధ్యత మన మీద లేదా?
తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు అంటరు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ 2004- 14 మద్యలో ఆయకట్టు 6.64 లక్షల ఎకరాలు బిఆర్ఎస్ 2014- 23 మద్యలో 48. 74 లక్షల ఎకరాలు. గోదావరి మీద కేసీఆర్ అనేక ప్రాజెక్టులు కట్టారు. సమ్మక్క సాగర్ సీతమ్మ సాగర్ ఇలా అన్ని ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చాం.
కల్వకుర్తి బీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ పూర్తిచేసి 6.50 లక్షలు ఎకరాలకు నీళ్లు ఇచ్చాము. 18 నెలల్లో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసావా, ఒక్క చెక్ డామ్ కట్టావా? పెద్దవాగు కొట్టుకుపోయింది, SLBC కూలింది. వట్టెం పంపు మునిగింది. తమ్మిడిహట్టి వద్ద గ్రావిటీ తో నీళ్ళు వస్తాయి అంటడు. రెండు లిఫ్టులు అవసరం. ప్లాన్ లోనే ఉంది. ఇంత అబద్ధం. ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావు? ఆచి తూచి మాట్లాడు మిస్టర్ రేవంత్ రెడ్డి.
నాడు 4000 కోట్లు ఎవరి జేబుల్లో పోయాయి అని నువ్వే అన్నావు, ఇప్పుడు ప్రాజెక్టులను పడావు పెట్టింది బిఆర్ఎస్ పార్టీ అంటున్నావు. ప్రాజెక్టులు అప్పగించేది లేదు అని ఆనాడు తెగేసి చెప్పినం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు అప్పగించింది. కెసిఆర్ ప్రశ్నిస్తే ప్రాజెక్టులు అప్పగించమని అసెంబ్లీలో చెప్పారు.
హరీష్ రావు కేసీఆర్ సంతకాలు పెట్టరు. సెక్రటరీలు సంతకం పెట్టారు. 66:34 రేషియోలో పదేళ్లు బి ఆర్ ఎస్ వాడుకున్నది. కానీ కాంగ్రెస్ వచ్చాక తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా వాడుకోలేదు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఆపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది.
దానిమీద ఎందుకు స్పందించవు?
ఎస్ఎల్బీసీ కూలీ ఇన్ని రోజులు అవుతుంది ndsa ఎందుకు రాదు. బిజెపి ఎందుకు పంపదు. మేం ప్రశ్నిస్తే ఆనందం అంటున్నావ్ సిగ్గు లేదు నీకు. క్షమాపణ చెప్పు. మీ నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పకూలింది. నీటిపారుదుల శాఖ మంత్రిగా ఉత్తం రాజీనామా చేయి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ఇప్పటికి శవాలు కూడా బయటికి తేలేదు. తప్పు మీది కాదా?
పోతిరెడ్డి ప్రాజెక్టును నిరసిస్తూ ఆరుగురు మంత్రులం రాజీనామా చేశాము. నాటి నుంచి నేటి వరకు నీది తెలంగాణ ద్రోహ చరిత్రనే.