– ఆటో కార్మికులకు ఇస్తానన్న హామీలు నెరవేరుస్తాడు
– రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ కి వచ్చి సినిమా యాక్టర్లకంటే ఎక్కువ యాక్టింగ్ చేశాడు
– ఆరోజు రాహుల్ గాంధీ హైదరాబాదుకు వచ్చి ఇదే యూసఫ్ గూడా జూబ్లీహిల్స్ లో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారు
– కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12000 ఇస్తామని మోసం చేసింది
– వెంటనే బాకీ పడ్డ 24 వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
– మొత్తం ఆటో కార్మికులకు రెండు సంవత్సరాల బాకీ చెల్లించినా 1500 కోట్లు అవుతుంది
– 3 లక్షలు ఫీజు పెంచితే మద్యం టెండర్లపై 3 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి
– అందులో నుంచి 1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులను కాపాడాలని మా డిమాండ్
రేవంత్ రెడ్డి గురువు ఆంధ్ర ప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తున్నారు
– ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నారు.రైతులు కావచ్చు. చిరు ఉద్యోగులు కావచ్చు. మహిళలు కావచ్చు. ఆటో డ్రైవర్లు కావచ్చు. అందరూ ఆవేదనలో ఉన్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. పేరుకి ఉచిత బస్సు అన్నాడు. ఆడోళ్ళకి ఫ్రీ అన్నారు. మొగోళ్ళకి డబల్ టికెట్ కొడుతున్నారు.
టికెట్ రేట్లు పెంచి కుటుంబం మీద భారం వేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదుసార్లు బస్ చార్జీలు పెంచింది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ కి వచ్చి సినిమా యాక్టర్లకంటే ఎక్కువ యాక్టింగ్ చేశాడు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో మెట్ల మీద కూర్చొని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొదటి ఏడాది 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారు.
నిరుద్యోగులను వాడుకొని వేడుకొని ఓట్లు, డబ్బులు తీసుకొని ఈరోజు నిరుద్యోగ యువతీ యువకులను వదిలేశారు రాహుల్ గాంధీ. ఆరోజు రాహుల్ గాంధీ హైదరాబాదుకు వచ్చి ఇదే యూసఫ్ గూడా జూబ్లీహిల్స్ లో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12000 ఇస్తామని చెప్పారు.
ఆటోనగర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోనగర్ అసలే లేదు. ప్రమాద బీమా 10 లక్షల పెంచుతామని పత్తా లేదు. ఇస్తామన్న 12 వేల రూపాయలకి దిక్కు లేదు. ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఆటోకు 24 వేల రూపాయలు బాకీ పడింది. 24 వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.
ముఖ్యమంత్రి, మంత్రులు వాటాల కోసం తన్నుకుంటున్నారు కదా. వాటికోసం పైసలు ఉన్నాయి. కానీ ఆటో కార్మికులకు నెలకు ₹1000 ఇవ్వడానికి లేవా? నెల నెల మూటలు మోస్తూ ఢిల్లీకి కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి.ఆటో డ్రైవర్లు అంటే ఎందుకు నీకు అంత చిన్న చూపు?
లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తున్నాం. లక్ష కోట్లతో ఫోర్త్ సిటీ నిర్మిస్తానంటున్నావు కానీ ఆటో డ్రైవర్లకు నెలకు వేయి రూపాయలు ఇవ్వలేవా రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ.. ఓట్ల కోసం ఆటో ఎక్కి తిరిగావు ఇప్పుడు ఆటో కార్మికుల కష్టాలు పట్టవా? మరోసారి రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తే శంషాబాద్ లో ఆటోలతో నిరసన తెలుపుతాం.
ఈరోజు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆటో కార్మికుల బాధ తెలివాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. వెంటనే బాకీ పడ్డ 24 వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఆటో కార్మికులకు రెండు సంవత్సరాల బాకీ చెల్లించినా 1500 కోట్లు అవుతుంది.
3 లక్షలు ఫీజు పెంచితే మద్యం టెండర్లపై 3 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. అందులో నుంచి 1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులను కాపాడాలని మా డిమాండ్. ఇప్పటివరకు 161 ఆటో కార్మికులు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆటో కార్మికులు ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ ని ఓడించే విధంగా పనిచేయండి. ప్రతి ఆటో అన్న రెండు ఫోన్లు చేసి మీ బంధుమిత్రులకు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కి ఓటు వేయాలని చెప్పండి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతే కనీసం రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఆటో కార్మికులకు ఇస్తానన్న హామీలు నెరవేరుస్తాడు.
రేవంత్ రెడ్డి గురువు ఆంధ్ర ప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తున్నారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంది. అసెంబ్లీలో ఆటో డ్రైవర్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అసెంబ్లీని స్తంభింపజేస్తాం. ఆటోలకు క్వార్టర్లీ టాక్స్ కేసీఆర్ రద్దు చేశారు. కేసీఆర్ మళ్ళీ వస్తారు. ఆటో డ్రైవర్ ల కష్టాలు తీరుస్తారు.
ఆటో డ్రైవర్లకు 12000 ఇస్తామని చెప్పి మోసం చేసింది: ఆటో డ్రైవర్ రమేష్
హరీష్ రావు ప్రయాణించిన ఆటో డ్రైవర్ రమేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ల జీవితం బాగుండేది. రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టాడు. ఆటో డ్రైవర్లు అప్పుల బాధతో చనిపోతున్నారు. వారి కుటుంబాలు దిక్కులేని వారు అవుతున్నారు. హరీష్ రావు మా అందరి కోసం వచ్చి మాకు సంఘీభావంగా ఆటోలో ప్రయాణించారు. రోజుకి 500 రూపాయలు ఇప్పుడు వస్తున్నాయి. గతంలో 1500 నుండి 2 వేల రూపాయల వరకు వచ్చేది. సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 12000 ఇస్తామని చెప్పి మోసం చేసింది.
కేసీఆర్ ఉన్నప్పుడు మా ఆటో డ్రైవర్ల జీవితాలు బాగుండేది: షేక్ నజీబ్
షేక్ నజీబ్ అనే మరో ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. నా కొడుకుకు ఆరోగ్యం బాగా లేక నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాము. ప్రతి మందులు బయట కొనుక్కొని తేవాల్సి వస్తున్నది. కనీస మందులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవ్వడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో బాగుండేది. మా ఆటో డ్రైవర్ల జీవితాలు బాగుండేది. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు వచ్చింది. షాదీ ముబారక్ వచ్చింది.
రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒకటి కూడా అమలు కాలేదు. ఈరోజు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిస్తాం. ఒక్కొక్క ఆటో డ్రైవర్ పదిమందిని తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయిస్తాం. మాగంటి సునీత ని గెలిపిస్తాం. పది సంవత్సరాల్లో ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉండేటోళ్లు.పోలీస్ వేధింపులు చాలన్లు కట్టే పరిస్థితి లేకుండే. ఇప్పుడు పోలీసులకు చాలాన్లు కట్టడానికి సరిపోతున్నది మా సంపాదన.