Suryaa.co.in

Telangana

రేవంత్ .. మీ సొంత ఊరికి పోదామా?

– మా గాడిచర్లపల్లికి వస్తావా చెప్పు?
– రుణమాఫీ ఎంతమందికయిందో ఎంతమంది కాలేదో చూపిస్తా
– ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే ప్రభుత్వ పరువు పోయినట్టే.
– నిర్బంధాల మధ్య గ్రామసభలు
– ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి?
– దరఖాస్తు పెట్టిన ప్రతిసారి 30, 40 రూపాయలు ఖర్చు అవుతుంది
– ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్ లైన్ చేయడంలో విఫలమైంది
– ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం చెప్పాలి
– ఏడాదికి ఐదు లక్షల ఇల్లు కడతామని హామీ ఇచ్చారు
– ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు
– ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల రూపాయలు బాకీ పడింది
– సిద్దిపేట పట్టణం గాడిచర్లపల్లి 15 వ వార్డ్ లో నిర్వహించిన వార్డ్ సభలో ( గ్రామ సభలో) మాజీ మంత్రి హరీష్ రావు.

సిద్దిపేట: నవంబర్ 30 నాడు 2750 కోట్లకు మహబూబ్ నగర్ లో రుణమాఫీ చెక్కు ముఖ్యమంత్రి ఇస్తే ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే ప్రభుత్వ పరువు పోయినట్టే. ముఖ్యమంత్రికి, ఆర్ధిక మంత్రికి రైతుల కోసం ఇచ్చిన చెక్కు రాకపోతే ఇచ్చే బాధ్యత లేదా?

15000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావ్, 5000 కోట్లతో మీ ఊరికి ఆరు లైన్ల రోడ్డు వేసుకుంటున్నావు. మీ ఊరికి రోడ్ ఏసుకునేందుకు పైసలు ఉంటాయి..మూసి సుందరీకరణకు పైసలు ఉంటాయి ఔటర్ రింగ్ రోడ్డుకు పైసలు ఉంటాయి కానీ రైతులకి ఇవ్వడానికి డబ్బులు ఉండవా?

ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారి 30, 40 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాం, మీ సేవలో అప్లికేషన్ పెట్టాం. ఇప్పుడు మళ్లీ గ్రామసభల్లో అప్లికేషన్ పెట్టుకున్నాం అని ప్రజలు అంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్ లైన్ చేయకపోవడం వల్ల, కట్టగట్టి పక్కకు పడేయడం వల్ల మళ్ళీ మళ్ళీ దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తయిందని అంటున్నాడు.

గాడిచర్లపల్లి చిన్న గ్రామం. ఇక్కడ రుణమాఫీ కానీ రైతులే ఎక్కువ ఉన్నారు. రేవంత్ రెడ్డి.. మీ సొంత ఊరికి పోదామా? మా గాడిచర్లపల్లికి వస్తావా చెప్పు? రుణమాఫీ ఎంతమందికయిందో ఎంతమంది కాలేదో చూపిస్తా.

ఆకుల రాజుకు 1.35 లక్షల రుణం ఉంటే ఇంకా రుణమాఫీ కాలేదు. ప్రజాపాలనను దరఖాస్తు పెట్టుకున్నాడు.కుసుంబ నగేష్ కు లక్ష రూపాయలు వ్యవసాయ రుణముంది.ఇంకా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగమ్మగారి పూజకు లక్ష రూపాయల రుణం ఉంది. నర్సింగ రావుకు 47 వేల రూపాయలు. ఏల్పుల రాములుకు 42 వేల రూపాయల అప్పు ఉంది.వీళ్లంతా లక్షలోపు రుణమున్నవారే ఇంకా ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని గ్రామసభలు దరఖాస్తు పెట్టుకున్నారు.

ముఖ్యమంత్రి 2 లక్షల పైనున్న రుణాన్ని కడితే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాడు. ముఖ్యమంత్రి అబద్ధం చెప్తారని ఎవరూ అనుకోరు. ముఖ్యమంత్రి మాటలు విని 68 వేల రూపాయలు అప్పు తెచ్చి కడితే, ఇప్పటివరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదని గ్రామసభలో దరఖాస్తు పెట్టుకున్నాడు.

ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని దరఖాస్తులు వచ్చాయి.

ముఖ్యమంత్రి హైదరాబాదులో ఉండడం కాదు, ఊర్లలో గ్రామసభలోకి రావాలి. పోలీస్ పహారాల మధ్య గ్రామసభలు నిర్వహించి మాట్లాడితే అరెస్టు చేస్తున్నారు. నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారు. రుణమాఫీ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం చెప్పాలి.

నిన్న రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్లయినా లేదు. గాడిచర్ల పల్లి గ్రామసభలో రైతులు అడుగుతున్నారు… వానకాలం రైతుబంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు అని అడుగుతున్నారు. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.వానకాలం, యాసంగి కలిపి..ఇచ్చిన మాట ప్రకారం 15000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

2014లో కేసీఆర్ పెంచితే 2024 లో కూడా అదే పరిమితితో రేషన్ కార్డు ఇవ్వడం దుర్మార్గం. ఇండ్ల విషయంలో ఏడాదికి ఐదు లక్షల ఇల్లు కడతామని హామీ ఇచ్చారు. ఏడాది పూర్తయింది ఒక్క ఇల్లయిన ప్రభుత్వం కట్టిందా? ఎస్సీ,ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టించలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టుకునేందుకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

రకరకాల సాకులతో కోతలు పెట్టి కోటిమంది కూలీలు ఉంటే ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు. ఆరు పైసలు ఇచ్చి 94 పైసలు ఎగబెడుతున్నారు. రుణమాఫీ 30 పైసలు ఇచ్చి, 70 పైసలు ఎగబెట్టారు.

2500 మహాలక్ష్మి పథకం ఎప్పుడు ఇస్తారు అని మహిళలు అడుగుతున్నారు. ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల రూపాయలు బాకీ పడింది. జార్ఖండ్ లో హేమంత్ సొరెన్ గారు గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు 2500 ఇస్తున్నారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంక పెన్షన్లు పెంచిన 4000 రూపాయలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి..అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్?

 

LEAVE A RESPONSE