Suryaa.co.in

National

రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల నిధి

రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు
ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు

డిజిటల్ రూపీ..
ఆర్బీఐ ద్వారా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ
రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీ
కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్‌ కరెన్సీ రూపకల్పన
పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక గ్రీన్‌ బాండ్లు
గిఫ్ట్‌ సిటీలో ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలకు అవకాశం
స్థానిక నిబంధనల నుంచి విదేశీ విద్యాసంస్థలకు మినహాయింపు
అవసరాల ప్రాతిపదికన ప్రత్యేక సదుపాయాలకు నిబంధన కల్పన
పెట్టుబడుల కోసం రూ. 10.68 లక్షల కోట్ల కేటాయింపు..
భారత్‌ ఆర్థిక వ్యవస్థ కరోనా ఉత్పాతాన్ని తట్టుకుని బలంగా నిలబడింది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు వెన్నుదన్నుగా అవసరమైన ప్రభుత్వ పెట్టుబడులు
మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రసాయం
దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్ల కేటాయింపు
సోలార్ ప్లేట్ల తయారీకి రూ. 19,500 కోట్లు..
దేశీయంగా సౌర విద్యుత్‌ ప్లేట్ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం రూ.19,500 కోట్లు కేటాయింపు
బొగ్గు ద్వారా గ్యాస్‌ ఉత్పత్తి కోసం 4 పైలట్‌ ప్రాజెక్టులు

అడవులు ప్రైవేటు..
ప్రైవేటు రంగంలో అడవుల ఉత్పత్తి కోసం నూతన పథకం
గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకం
విద్యా, పారిశ్రామిక అనుసంధానంతో..
విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య బలమైన అనుసంధానం
విద్యా, పారిశ్రామిక అనుసంధానం ద్వారా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం
రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం
డీఆర్‌డీఓ, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకు అవకాశం
రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించి స్వయంసమృద్ధి సాధించేలా కృషి

ఎగుమతులపై..
ఎగుమతుల వృద్ధికి పారిశ్రామిక సంస్థలకు నూతన ప్రోత్సాహకాలు
మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, వినియోగంపై దృష్టి
దేశవ్యాప్తంగా ఈ ఏడాది అందుబాటులోకి 5జీ సాంకేతికత
2022-23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత ప్రవేశపెడుతున్నాం
2022-23లో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌
దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్‌ పథకం(ఎన్‌జీడీఆర్ఎస్‌)
దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌కు నూతన వ్యవస్థ
దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ
కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులు పెట్టుకునే అవకాశం
బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం
దేశీయ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌, గేమింగ్‌, కామిక్స్‌ రంగాలకు ప్రోత్సాహం

LEAVE A RESPONSE