Suryaa.co.in

Andhra Pradesh

పరిశ్రమలు, వాణిజ్యానికి రూ. 2,602 కోట్ల కేటాయింపు

అమరావతి: పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చి, ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ రాష్ట్రం పటిష్టతను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఎన్టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ గ్రూప్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ వపర్‌, భారత్‌ బయోటెక్‌, జీఎంఆర్‌ గ్రూప్‌, దాల్మియా గ్రూప్‌, రెన్యూ పవర్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌, సెంచురీ ఫ్లైబోర్డ్స్‌, శ్రీ సిమెంట్‌, రామ్‌కో సిమెంట్స్‌, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ఇతరప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇజ్రాయెల్‌, పోలాండ్‌, డెన్మార్క్‌,న ఆర్వే, నెదర్లాండ్స్‌, సింగపూర్‌, జపాన్‌ల నుంచి ఏడు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధుల బృందాలు ఏపీ పారిశ్రామిక సామర్థ్యాలపై ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ, నెదర్లాండ్స్‌, వియత్నాం, పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో నాలుగు సమావేశాలు జరిగాయి. 13.42 లక్షల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో ఏపీలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం.

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుంచి వచ్చిన ఈ విశేష, స్పందన, అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి, విశ్వసనీయతకు నిదర్శనం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల అన్ని అవసరాల కోసం సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ సర్వర్‌లు వన్‌ స్టాప్‌ షాప్‌గా ఉంటాయి. దీనిలో భాగంగా ఏప్రిల్‌ 2019, నుంచి 36,972 దరఖాస్తులు స్వీకరించండి. వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్‌లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి.

డిసెంబర్ 2022 వరకు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూలు కులాలకు చెందిన 3,748 యూనిట్లకు షెడ్యూలు తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.

అలాగే ఈ ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు-క్లస్టర్ అభివృద్ధి (ఎమ్‌ఎస్‌ఈసీడీపీ) ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం ఐదు క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతే కాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోట్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి-ఏర్పేడు నోడ్లోని చిత్తూరు సౌత్ క్లస్టర్, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) కింద కడప నోడ్ కొప్పర్తి క్లస్టర్ ఈ మూడు పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెల్పింది.

3,155 ఎకరాలలో కొప్పర్తి సమీపంలో వైయ‌స్ఆర్‌ జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్ గా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకుని వైయ‌స్ఆర్‌ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది దీని ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని 25,000 మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుంది.

జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో, సంవత్సరానికి రెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగల సామర్ధ్యంతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని మొదటి దశలో 1000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

► 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయించింది.

రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు
రాష్ట్రంలో దాదాపు 32,725 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కి.మీ పొడవున ఉన్న బి.టి. రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది. రూ. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కి.మీ. రాష్ట్ర రహదారుల, జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని సాధించింది.

‘రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్’ క్రింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ. పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి.

► 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారుల మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయించింది.

LEAVE A RESPONSE