Suryaa.co.in

Features

సమాచారం అడిగితే ఇవ్వము అనడం కూడా నేరమే

– సమాచారం అడిగితే లేదు ,ఇవ్వము ,అందుబాటులోలేదు అంటున్న అధికారులు తెలుసుకోవాలిసిన అంశాలు

సమాచారం ఇవ్వకపోతే ఆ ప్రజా సమాచార అధికారి గారు IPC సెక్షన్స్ 166,167, 217, 218, 219, 220, 420, 406, 407, మరియు 408 నేరపరిదిలోకి వస్తారు అందువలన స.హ చట్టం కింద దరఖాస్తు దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. లేని పక్షములో సమాచార నిబంధనలు ఉల్లంఘించి నందుకు చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను పై సెక్షన్ల ప్రకారం కేంద్ర, రాష్ట్ర కమీషనర్లు కూడా సమాచారం ఇవ్వని వారిని జైలుకు పంపవచ్చు అని చట్టంలో పేర్కొనబడింది.లేదా అర్జీదారుడే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు.పోలీసు స్టేషన్ అధికారి కేసు రిజిస్టర్ చేసేందుకు అంగీకరించకుండా ఫిర్యాదు ను తిరస్కరిస్తే కోర్టు లో ప్రయివేటు కంప్లైంట్ ద్వారా క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు పొందవచ్చు.

ఒకవేళ పూర్తి అవగాహన లేకపోతె క్రింది వివరాలు పరిశీలించవచ్చు.
“సమాచార హక్కు ప్రతి దరఖా స్తుదారుడు వినియోగదారుడే”
30రోజుల్లో సమాచారం ఇవ్వకుంటే వినియోగదారుల ఫోరమ్ కు వెళ్ళవచ్చు.
సమాచారాన్ని కోరడానికి దరఖాస్తు ఫారం లేదు, కావలసిన సమాచారం తెల్లకాగితం పై రాసి IPO (ప్రజా సమాచార అధికారికి) అడగవచ్చు. అధికారికి డైరెక్టు గా గాని రిజిస్టర్ పోస్టు ద్వారా అయిన పంపి అడగవచ్చు.
“దరఖాస్తు దారునికి వయసు స్థానికత అవసరం లేదు”.
సెక్షన్ 2 (f)ప్రకారం సమాచారం నిర్వచనం.(కార్యాలయాల్లో రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మైయిల్స్, అభిప్రాయాలు, పుస్తకాలు, ప్రకటనలు, సీడీలు, డివిడిలు, మొదలైనవి).
సెక్షన్ 2 (h)ప్రకారం సమాచార చట్ట పరిధిలోకి వచ్చే కార్యా లయాలు. (ప్రభుత్వంచే గుర్తింపుబడిన, స్వచ్చంద సంస్థలు).
సెక్షన్2(i) ప్రకారం రికార్డు నిర్వచనం.
సెక్షన్ 2(j)ప్రకారం ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు పరిశీలించవచ్చు,
ఏ ప్రభుత్వపు కార్యాలయంలో రికార్డులనైనా దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చు అవసరం అయితే జిరాక్స్ చేసుకోవచ్చు.
సెక్షన్2(j)(1) ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు (ఒక గంటకు రూ5/-).
గ్రామస్థాయి సమాచారం ఉచితం
సెక్షన్ 3 ప్రకారం పౌరులందరికి సమాచారం ఇవ్వాలి. (దరఖాస్తు చేసుకోవడానికి మీ పరిధి కాదు అని ప్రశ్నించడానికి వీలు లేదు).
సెక్షన్4(1)(a) ప్రకారం ప్రతి శాఖ వారు రికార్డు నిర్వహణ.
సెక్షన్ 4(b) ప్రకారం స్వచ్చందముగా వెల్లడించవలసిన సమాచారం ఎవరు ఆడగక ముందే ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.
సెక్షన్ 4(1)(c), (d) ప్రకారం నిర్ణయాలు వాటికీ కారణాలు చెప్పకరలేదు, (సమాచారం ఎందుకు అని చెప్పక్కరలేదు)
సెక్షన్4(2) ప్రకారం వీలయినంత ఎక్కువుగా స్వచ్చందంగా ఇవ్వవలసిన సమాచారం.
సెక్షన్4(4) ప్రకారం స్థానిక భాషలో ఇవ్వాలి.
సెక్షన్5(1),(2) ప్రకారం ప్రజాసమాచార అధికారులు (IPO) అప్పిలేట్ అధికారుల నియామకం.
సెక్షన్-6(1)ప్రకారం
సమాచార హక్కు దాఖలు విధానం.
సెక్షన్6(2)ప్రకారం సమాచారం ఎందుకో చెప్పనక్కరలేదు.
సెక్షన్ -6(3) ప్రకారం కోరిన సమాచారం సంబంధిత శాఖ అధికారికి దరఖాస్తు బదిలీ (సమాచారం మరో కార్యాలయానికి పంపవలసిన బాద్యత అధికారులదే).
సెక్షన్-7(1) ప్రకారం 30రోజుల లోపు సమాచారం ఇవ్వవలసిందే…
వ్యక్తి జీవితానికీ స్వేచ్ఛ సంభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.
సెక్షన్7(3)(a)ప్రకారం సమాచార రుసుము (కోర్టు సంబంచిన మాత్రం రూ25/- మిగతా శాఖ వారికి రూ10/- మాత్రమే చెల్లించాలి.
ఏ రూపంలో చెలించాలంటే
(1) నగదు రూపంలో,
(2) ఇండియన్ పోస్టల్ ఆర్డర్లు,
(3) డిమాండ్ డ్రాఫ్టు,
(4) కోర్టు ఫీ స్టాంపు వేయాలి,
(5)బ్యాంకర్స్ చెక్కురూపంలో మాత్రమే దరఖాస్తు రుసుం. ఎకౌంట్ అధికారి పేరిట పంపించాలి.
విలయినంతగా పోస్టల్ ఆడారు మాత్రమే రుసుముగా చెల్లించాలి.
(ప్రతి పేజీకి, ఏ-4 రూ 2/- చెప్పున, సీడికి రూ100/- చెప్పున, ప్లాపికి రూ50/- చెప్పున, డీవీడీ కి 200 చెలించాలి.
కోర్టు లో ప్రతి పేజీకి రూ 5/- చెప్పున చెల్లించాలి).
సెక్షన్ 7(1) ప్రకారం దరఖాస్తు గడువు 30 రోజులు
సెక్షన్7(6) ప్రకారం గడువులోపు సమాచారం ఇవ్వకుంటే సమాచారం ఉచితముగా ఇవ్వాలి.
సెక్షన్8(1)ప్రకారం సమాచారం మినహహింపులు (డాక్టర్ పేషెంట్ కు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చిన మందులు, మనిషికి ఉన్న వ్యాధులు, దేశ రక్షణ కు సంబంచించిన ఒప్పందాలు)
సెక్షన్8(2)ప్రకారం అడిగిన సమాచారంలో ప్రజాప్రయోజనం ఉంటే మినహాయింపులు వర్తించవు.
సెక్షన్18(1)ప్రకారం కమీషన్లకు పిర్యాదు
సెక్షన్19(1)ప్రకారం మొదటి అప్పీలు
సెక్షన్19(3)రెండవ అప్పీలు, 90 రోజుల లోగా రాష్ట్ర కేంద్ర సమాచార కమీషన్ అప్పీల్ చేసుకోవాలి. సరైన కారణాలు ఉంటే 90 రోజుల తరువాత అప్పీల్ చేసుకోవచ్చు.
సెక్షన్19(1)ప్రకారం కమీసన్ల నిర్ణయాలు
సెక్షన్-19(8)(b) ప్రకారం ధరాఖస్తుదారు తనకు కలిగిన ఆర్థికపరమైన కష్టనష్టలపై కమిషన్ ఆధారాలు సమర్పించాలి సక్రమంగా ఉంటే నష్టపరిహారం మంజూరు చేయాలి.
సెక్షన్20(1)ప్రకారం సమాచారం ఇవ్వకపోతే (తప్పుడు సమాచారం ఇస్తే రోజుకు రూ 250 చొప్పున రూ 25,000 వరకు జరిమానా.
సెక్షన్20(2)ప్రకారం క్రమక్షణ చర్యలకు సిపారసు
గడువులోగా సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల ఫోరానికి వెళ్ళవచ్చు.
పీఐవో (PiO) తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమిసనర్ లేకుంటే డైరెక్టుగా న్యాయస్థానానికి వెళ్ళవచ్చు.
సమాచార హక్కుచట్టాన్ని ఉపయోగించండి అవినీతి అధికారుల భరతం పట్టండి. మెరుగైన సమాజానికి తోడ్పాటు ఇవ్వండి.

LEAVE A RESPONSE