Suryaa.co.in

Andhra Pradesh

రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాఫియాలా తయారయ్యాడు…

  • కేవలం ఒక్క లే ఔట్ లో 70 కోట్ల కుంభకోణం జరిగింది…
  • 70 కోట్ల కుంభకోణం లో జిల్లా కలెక్టర్ కు ఐదు కోట్ల అక్రమ వాటా ఉందని విమర్శలు వస్తున్నాయి…
  • లే అవుట్ పై చర్యలు తీసుకుని, కలెక్టర్ తన నిజాయితీని నిరూపించుకోవాలి…
  • జిల్లా అధ్యక్షుడిగా నా ఫోన్ కే స్పందించకపోతే ఇక సామాన్య ప్రజలకు కలెక్టర్ ఏం స్పందిస్తారు…
  • 70 కోట్ల కుంభకోణంలో జిల్లా కలెక్టర్ కే కాక ఎస్సీ, ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ల హస్తం ఉందని విమర్శలు వస్తున్నాయి..
  • అవినీతికి పాల్పడ్డ అధికారులపై విజిలెన్స్ విచారణ కోరబోతున్నాం సిబిఐకి లేఖ రాయబోతున్నాం…
  • ఇలాంటి కుంభకోణాలు చేయడానికే చుక్కల భూములు తొలగించినట్టు ఉన్నారు…
  • చుక్కల భూములు తొలగించిన ప్రతి చోటా శ్రీధర్ రెడ్డి భూములు ఉన్నాయి…
  • వ్యాపారాలు చేసి, నగరాన్ని అభివృద్ధి పరచాలే కానీ, ప్రజాధనాన్ని దోచుకోకూడదు…
  • దొంగ రాజకీయ నాయకులతో దొంగ అధికారులతో కలిసి ప్రజలు మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు…
  •  షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి…

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అల్లిపురం వద్ద శ్రీ లక్ష్మీ భగవాన్ వెంకయ్య స్వామి స్మార్ట్ సిటీ పేరుతో వేస్తున్న అక్రమ లేఔట్ ను శనివారం నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, తదితర టిడిపి నేతలతో కలిసి పరిశీలించారు.పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ….

దాదాపు 23 ఎకరాల స్థలంలో లేఅవుట్ వేశారని అయితే ఈ స్థలంలో జాఫర్ సాహెబ్ కాలువ లేబరు కాలువ గుడిపల్లిపాడు కాలువ మరొక కాలువ మొత్తం నాలుగు కాలువలు పోతున్నాయని తెలిపారు…

నాలుగు కాలువలకు, ఒక డ్రైన్ కు సంబంధించిన 4.5 ఎకరాల ఇరిగేషన్ శాఖ భూమిని ఆక్రమించి లేఔట్ లో కలిపి రోడ్లు వేసేస్తున్నారని తెలిపారు..

లేఔట్ లోకి రావడం కోసం ఇరిగేషన్ కాలువపై ఒక అనుమతిలేని బ్రిడ్జిని నిర్మించారని, పక్కనే వంద మీటర్ల దూరంలో మరో బ్రిడ్జి ఉందని, పక్కపక్కనే రెండు బ్రిడ్జి లకు అనుమతి ఇవ్వరని తెలిపారు.

ఈ కాలువల కింద 40 నుంచి 50 వేల ఎకరాల ఆయకట్టు ఉందని, కాలువలలో డీసెల్టింగ్ చేయడానికి కూడా వీలు లేకుండా స్థలం లేకుండా చేసి స్మార్ట్ సిటీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

వీళ్లకు ఉండే భూమి అంతా వీళ్ళు వేస్తున్న లేఅవుట్ ఎంత అని ప్రశ్నించారు. నుడా పరిమితులు లేకుండా పర్మిషన్లు లేకుండా ఎంతో అన్యాయంగా లే ఔట్ వేస్తున్నారని తెలిపారు..

అంకణం ఒకటిన్నర లక్ష రూపాయలకు అమ్ముతున్నారని, పరిమితులు పాటించి స్థల ఆక్రమించకుండా అమ్మి ఉంటే 86 కోట్ల రూపాయలు వచ్చి ఉండేవని అన్నారు…

పరిమితులు పాటించకుండా ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ఆక్రమించి 86 కోట్లకు అమ్మవలసిన స్థలాన్ని 150 కోట్లకు అమ్ముతున్నారని కేవలం ఒక లేఅవుట్లో 70 కోట్ల రూపాయల కుంభకోణం చేస్తున్నారని తెలిపారు..

70 కోట్ల కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనీ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా ఇలాంటి కుంభ కారణాలు చేయడం కోసమేనా చుక్కల భూములను తొలగించింది అని ప్రశ్నించారు..

చుక్కల భూములు తీయించిన ప్రతి చోటా శ్రీధర్ రెడ్డి భూములు ఉన్నాయని అందుకే ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి చుక్కల భూములను తీయించాడని విమర్శించారు..

70 కోట్ల కుంభకోణం గురించి తెలియపరచడానికి రెండు రోజుల నుంచి కలెక్టర్ తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే, అందుబాటులోకి రాలేదని, గతంలో జూలై 25వ తేదీన టిడిపి స్థానిక నాయకులు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి సమస్యను తెలిపారని వివరించారు..

లేఔట్లు రావాలని నగరం అభివృద్ధి చెందాలని కానీ ఓపెన్ స్పేస్ లేకుండా ఇల్లు కట్టేస్తే 100 సంవత్సరాలు బతకాల్సిన ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు…

నియమ నిబంధనలు పాటించకుండా లేఔట్ ను నిర్మిస్తున్నారని కలెక్టర్ కూడా ఇరిగేషన్ వారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అందరూ కుమ్మక్కైపోయారని విమర్శించారు..

విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఐదు కోట్లు ఇచ్చినట్లు విమర్శలు వస్తున్నాయని, రెండు రోజుల నుంచి మా ఫోన్లు ఎత్తకపోతే నిజమేనేమో అనిపిస్తుందని అన్నారు..

ఈ కుంభకోణంలో కేవలం రాజకీయ నాయకులదె కాదు అధికారుల హస్తం కూడా ఉందని, ఇక్కడున్న ఎస్సీ గత ఏడు సంవత్సరాల నుంచి ఎన్నో పాపాలు చేశారని ఇంత జరుగుతుంటే నుడా అధికారులు ఏం పీకుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు…

ఇంటి ముందు మట్టి వేస్తేనే వారిని రాత్రి పగలు నిద్రపోనివ్వకుండా ఫైన్లు వసూలు చేస్తారని అలాంటిది 22 ఎకరాల్లో నాలుగున్నర ఎకరా ఇరిగేషన్ శాఖ భూమిని ఆక్రమిస్తుంటే అధికారులకు తెలియడం లేదా అని మండిపడ్డారు..

ఈ లేఔట్ కి పెట్టాల్సింది భగవాన్ వెంకన్న స్వామి స్మార్ట్ సిటీ అని కాదని బాబా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్మార్ట్ సిటీ అని పెట్టాలని అన్నారు..

బాబా అని ఎందుకు అంటున్నాను అంటే ఆయన ఎవరు చేతులు పట్టుకున్న వారికి చేతులు వచ్చేస్తున్నాయని కళ్ళు పట్టుకుంటే కళ్ళు వచ్చేస్తున్నాయని కాళ్లు పట్టుకుంటే కళ్ళు వస్తున్నాయని అందుకే బాబా అంటున్నాను అని తెలిపారు..

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు అనేది మర్చిపోయాడని, ఇతను ఒక మూర్ఖుడు దుర్మార్గుడు అని తెలిపారు…

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఎన్ని రోజులు స్వాతిముత్యం లో కమల్ హాసన్ అనుకున్నామని కాదని, అలాగే అతను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదని 1000 కోట్ల శ్రీధర్ రెడ్డి అని తన ఇంటిపేరు ముందు ఒక అక్షరం కలుపుతున్నామని హేళన చేశారు.

ఈ ఒక్క లేఔట్ లో ప్రజలను మోసం చేసి 70 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేస్తున్నారని తెలిపారు…

70 కోట్ల కుంభకోణంలో కలెక్టర్, ఎస్సీ, నుడా వైస్ చైర్మన్, సెక్రటేరియట్ లో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ల హస్తం ఉందని, విమర్శలు వస్తున్నాయని, వీటన్నిటి పై విజిలెన్స్ విచారణ చేయబోతున్నామని, సిబిఐ కి కూడా లేఖ రాయపోతున్నామని తెలిపారు..

ఈ అక్రమ లేఔట్ లో కలెక్టర్ కు అక్రమ వాటా లేకపోతే, రేపే ఇక్కడికి వచ్చి ఈ అక్రమ లే ఔట్ సంగతి తేల్చి, తన నిజాయితీని నిరూపించుకోవాలని తెలిపారు…

ప్రజల ఆస్తుల్ని దున్నపోతుల రాబందుల్లా తింటుంటే అధికారులు చూస్తూ ఉన్నారని అదే తమ ఆస్తి అయితే ఇలానే వదిలేస్తారా అని ప్రశ్నించారు…

గతంలో వెంకటేశ్వర్లు నాయుడు అనే వ్యక్తి నరకూరులో లే ఔట్ వేసినప్పుడు, వంకరగా ఉన్న కాలువను తిన్నగా చేశాడన్న నెపంతో జెసిబీలను తీసుకువచ్చి ధ్వంసం చేశారని, తెలిపారు..

వైసీపీకి చెందిన అవగారి అనే వ్యక్తి పది ఎకరాల్లో లేవుటేస్తే ఎంతో అద్భుతంగా లేఅవుట్ వేశారని తెలిపారు..

వ్యాపారాలు చేసిన నగరాన్ని అభివృద్ధి చేయాలే కానీ దొంగ రాజకీయ నాయకులతో దొంగ అధికారులతో కలిసి ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు..

రేపు లేఅవుట్ను సందర్శించి దీనిపై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ పై పడిన నిందను జరుపుకోకపోతే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు..

వ్యక్తిగతంగా కలిసి ఈ సమస్యను వివరిద్దామని ఫోన్లు చేస్తుంటే కలెక్టర్ ఫోన్లు ఎత్తడం లేదని ఒక జిల్లా అధ్యక్షుడిగా నా ఫోన్ కే స్పందించకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏం స్పందిస్తారని ప్రశ్నించారు..

ఐఏఎస్ ఆఫీసర్లు అంటే పైనుంచి ఓడి పడలేదని మనం ఎక్కడ నుంచి వచ్చామో ఎవరు కూడా మర్చిపోకూడదని తెలిపారు.

1000 కోట్ల శ్రీధర్ రెడ్డి ఒక మాఫియాగా తయారయ్యాడని, తమ కుటుంబంలో ఎవరు రాజకీయ నాయకులు లేరని తానే రాజకీయ నాయకుడిని అని హరికథలు చెబుతారని శ్రీధర్ రెడ్డి నుంచి తమ ఆడబిడ్డని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు….

కార్యక్రమంలో డాక్టర్ సురేంద్ర బాబు, మేకల నరేంద్ర రెడ్డి, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, చెన్నా రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, చెంచయ్య, అల్లాబక్షు, మేకల అనీల్, ఆస్లామ్, చంద్ర, బిల్లుపాటి రవి, ఇజ్రాయేల్, కరిముల్ల, రమేష్ చౌదరి, సాజీడ్, ఆకుల రాజేష్, సుబ్బన్న, రబ్బానీ, హుస్సేన్, అజీజుల్ల, సత్తార్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE