Home » సజ్జల.. అధికార మదం తలకు ఎక్కిందా ?

సజ్జల.. అధికార మదం తలకు ఎక్కిందా ?

వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా ?
మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లా ?
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

తనను పెయిడ్ ఆర్టిస్టు అని నిందించిన సలహాదారు సజ్జలపై ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి కన్నెర్ర చేశారు. మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? నీలాంటి వాళ్లు సలహాదారుగా ఉండటం జగన్ ఖర్మ అని విరుచుకుపడ్డారు.

ఇంకా షర్మిలా రెడ్డి ఏమన్నారంటే.. సజ్జల నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటున్నారు. వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా ? అధికార మదం తలకు ఎక్కిందా ? మతి ఉండే మాట్లాడుతున్నావా ? నువ్వు , నీ కొడుకు పేమెంట్ తీసుకొని నన్ను,సునీతను నానా రకాలుగా హింసించారు. నువ్వు, నీ కొడుకు కలిసి సోషల్ మీడియా లో మాపై దృష్ప్రచారం చేశారు నేను వైఎస్ కే పుట్టలేదని…విజయమ్మ ను అవమాన పరిచారు. సజ్జల జగన్ కి సలహాదారుగా ఉండటం జగన్ చేసుకున్న ఖర్మ. నోరు ఉంది కదా అని ఎదిపడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా ? మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లా ? మేము అంత పెద్ద మాటలు మాట్లాడలేము. మాకు సంస్కారం ఉంది.

Leave a Reply