Home » మహాత్మాగాంధి పోరాటపంధా అనుసరణీయం: సజ్జల

మహాత్మాగాంధి పోరాటపంధా అనుసరణీయం: సజ్జల

మహాత్మాగాంధి పోరాటపంధా అనుసరణీయమని తన జీవితమే ఒక ఆచరణ,తను వేసే అడుగులే వ్యక్తిత్వంగా ఆయన చేపట్టిన పోరాటాలు ఉప్పెనలా,మహాసముద్రంలా మారి భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనకు దారితీసిందని ప్రభుత్వ సలహాదారు(ప్రజావ్యవహారాలు) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని స్వర్గీయ లాల్‌ బహుదూర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి,రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్,ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎంఎల్సిలు డొక్కామాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లేళ్ళ అప్పిరెడ్డి,ఎంఎల్ఏ తలారి వెంకట్రావు, నవరత్నాల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి తదితరపార్టీ నేతలు ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖులు,మేధావులు కూడా భారతదేశం అంటే మహాత్మాగాంధీ అనే రీతిలో పేరుపొందారన్నారు.ఇప్పటి అవసరాలకు తగినట్లు మనిషి ఆలోచనలు ఏ రకంగా మారాలనే దిశగా నూతన ఒరవడి తీసుకువచ్చి తన జీవితాన్నే ఆదర్శంగా మనకు అందించి వెళ్లారన్నారు.ప్రజాస్వామ్యం అంటే నాగరికతతో కూడిన నిజమైన సమాజాన్ని నిర్మించేదిశగా మార్గాన్ని సూచించారన్నారు.ప్రజలు తమ పాలన తాము చేసుకుంటూ తమ బతుకులు తాము దిద్దుకుంటూ తమ అభివృధ్దిని తాము నిర్దేశించుకునే శక్తి కలిగేవారిగా ఉండాలనేది గాంధీ చెప్పిన బాట అన్నారు.
ఇందులో అధికార,పాలకుల జోక్యం అతితక్కువగా ఉంటూ ఆ దిశగా అడుగులువేయాలనేది ఆయన చెప్పిన విధానం అన్నారు.అదే విధంగా మతం అనేదానికి దూరంగా ఉండాలని,కులగోడలు పగులగొట్టాలని ఇలాంటి ఉన్నతమైన ఆలోచనలకు రూపం ఇచ్చారు.తద్వారా లక్షలాదిమందిని కదిలించగలిగారు.కోట్లాదిమందికి స్ఫూర్తి ఇవ్వగలిగారన్నారు.స్వాతంత్ర్యం తర్వాత ఆయన మరణానంతరం కూడా అవి నినాదాలుగా మారాయి.ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు,పార్టీలు ఆయన విధానాలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశాయి.ఆ తర్వాత కాలంలో ఆ మహనీయుల జయంతి,వర్ధంతుల సందర్భంలో వాటిని స్మరించుకునే కార్యక్రమాలుగా మారిపోయాయి.
అయితే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆదరించి ప్రజలు తమ అక్కున చేర్చుకున్న తర్వాత ఆయన ప్రభుత్వం చేస్తున్న పాలన,అమలు చేస్తున్న విధానాలు చూస్తే గాంధీ ఆ రోజు చెప్పిన ఆలోచనలు ఆచరణ రూపం సంతరించుకున్నాయి.మరింత లోతుగా నిజాయితితో చూడగలిగితే అవి అమలవుతున్నాయని చెప్పవచ్చు.ఎందుకంటే గతంలో ఇందిరాగాంధి హయాంలోభూసంస్కరణలు,ఎన్టీఆర్ కాలంలో మండలవ్యవస్ధ వచ్చింది.నెహ్రూ గారి పాలనలో సైతం ప్రభుత్వం రంగం బలపడింది.అంటరానితనం పారద్రోలాలి,గరీబీహటావో నినాదాలు వచ్చాయి.
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోని దోపిడీ,అస్పసృత నేడు లేవు. వాటన్నింటిని పక్కకు తోసి ఎన్నికల సమయంలో ఓటర్లకు తాయిలాలు ఇచ్చి వారిని మభ్యపుచ్చే కాలం కూడా నడిచింది.వీటన్నింటికి భిన్నంగా వైయస్ జగన్ మూసధోరణులను బ్రేక్ చేశారు.ప్రభుత్వ పాలనలో జోక్యాన్ని తగ్గించారు.గ్రాస్ రూట్లవరకు చిన్నచిన్న ప్రభుత్వాలు అవే పాలించుకునే రకంగా పైన చట్టాలు చేస్తే కిందిస్దాయిలో ఎవరి బతుకులు వారు చక్కదిద్దుకునే రకంగా ముందుకు వెళ్తున్నారు.విద్య,వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.ఎక్కడా కూడా ప్రలోభాలు అనేవి లేకుండా మతాలకు,కులాలకు అతీతంగా పేదప్రజల బతుకులు బాగుచేసేవిధంగా రెండేళ్లలోనే మార్పు తీసుకువచ్చారన్నారు.ఇది అందరూ గమనించాలి.
వైయస్ జగన్ మహాత్మాగాంధీ జీవనవిధానాన్ని ఔపోసన పట్టి పేదలకు మేలు చేయాలనే దిశగా పనిచేస్తున్నారు.తన తండ్రిలాగా మనుషుల్ని ప్రేమించే లక్షణం ఉంది.తన కుటుంబం ఎంతగా బాగుండాలని అనుకుంటారో పేదలందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు. బ్రహ్మాండమైన మానవతావాద లక్షణం ఉంది.చాలామంది అనుకోవచ్చు గాంధీ గారితో పోలికేంటి అని గాంధీ గారు కూడా ఇలాంటి పోరాటాలే చేశారు.ఎవరు తనను అవమానిస్తే సత్యగ్రహం లాంటి వాటిని ఆచరణలో చేసి చూపారు.అది సిధ్దాంతం అని చెప్పలేదు.నలుగురికి సహాయం చేసేవారు సిధ్దాంతంగా చెప్పాలని లేదు.వైయస్ రాజశేఖరరెడ్డి అది ఆచరించి చూపారు.నేడు వైయస్ జగన్ సమగ్రంగా మనిషి జీవితాన్ని మెరుగుపరిచే రకంగా ముందుకు వెళ్తున్నారు.ఇవన్నీ చూస్తుంటే గాంధీ గారి చూపిన బాట కనిపిస్తోంది.నేడు వైయస్ జగన్ స్వఛ్చ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రోగాలనుంచి విముక్తి కలగ చేయాలనే ఆలోచనతో చేపట్టారు.ఇది ప్రజలంతా భాధ్యతగా అనుసరించాలన్నారు. వైయస్ జగన్ అమలుచేస్తున్న మిగిలిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ప్రజలు బాధ్యతతో చూసుకోవాలన్నారు.
రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంది,లాల్ బహుదూర్ శాస్ర్తిలు దేశానికి లభించిన ఆణిముత్యాలన్నారు.వారి గొప్పఆలోచనలు దేశాభివృధ్దికి తోడ్పడ్డాయన్నారు.అలాంటి వారి ఆలోచనలు నేటి సమాజానికి అనుగుణంగా అమలు చేస్తున్న వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. వైయస్ జగన్ చేపడుతున్న పధకాలు దేశానికే మోడల్ గా ఉండే విధంగా ఉన్నాయన్నారు.స్వఛ్చ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ కు రూపకల్పన చేశారన్నారు.
ఎంఎల్సి డొక్కామాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సూచించిన గ్రామస్వరాజ్యం కలలను నిజం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అన్నారు.ప్రతి గ్రామంలో ఆ గ్రామ సమస్యలు పరిష్కారం కావాలనే దిశగా గ్రామసచివాలయాలను ప్రారంభించారన్నారు.ఇది విప్లవాత్మకమైననిర్ణయమన్నారు.ఇది దేశానికే ఆదర్శమన్నారు.నాడు-నేడు ద్వారా విద్య,వైద్యం విషయంలో అభివృధ్దిచర్యలు చేపడుతున్నారన్నారు.
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ గ్రామస్వరాజ్యం మన దేశానికి ఆచరణీయమని నాడు మహాత్మాగాంధి చెప్పారని నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గ్రామ,వార్డుసచివాలయాల ద్వారా చేసి చూపుతున్నారని తెలియచేశారు.ఎంఎల్సి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధి,లాల్ బహుదూర్ శాస్ర్తిగారి చూపిన మార్గం అందరికి ఆదర్శమని అన్నారు. ఎంఎల్సి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ మహాత్మాగాంధి మార్గంలో నడుస్తూ పేద,బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి వైయస్ జగన్ కృషి చేస్తున్నారని వివరించారు.కార్యక్రమంలో ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి,ఆప్కోఛైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు,బిసి కార్పోరేషన్ లఛైర్మన్లు,పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply