ఏపీ వాలంటీర్ల జీతాలు పెంపు

– 5 వేల నుంచి రూ. 5,750

తిరుమల : ఏపీ వాలంటీర్లకు శుభవార్త అందింది. ఏపీ వాలంటీర్ల జీతాలు పెంచబోతున్నట్లు ప్రకటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తిరుమల శ్రీవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు బహుమానం ప్రకటిస్తున్నామన్నారు. జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్లకు గౌరవ భృతిని 5 వేల నుంచి రూ. 5,750 పెంచుతున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటన చేశారు.

Leave a Reply