M13 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన శాంసంగ్..

శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లో భాగంగా… M13 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. 50 మెగాపిక్సెల్ కమెరాతో.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీని ధర ఇంకా… కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే బడ్జెట్ లోనే ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కెమేరా క్వాలిటీ..
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4 జీబీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.

M13 స్పెసిఫికేషన్లు..
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను అందించారు.
ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉండగా… 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టం అందించారు.
దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా… బరువు 192 గ్రాములుగా ఉంది.
శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్లో కూడా ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా అధికారింగా ప్రకటించనప్పటికీ.. ధర 10- 15వేలు మధ్యలోనే ఉండే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు అంచనా.. అయితే ఇండియాలో ప్రస్తుతం రూ.10,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ నార్జో 50ఐ, రెడ్‌మీ 9ఏ స్పోర్ట్, రియల్‌మీ సీ31, రెడ్‌మీ 10ఏ , రెడ్‌మీ 10 ఇన్ఫీనిక్స్ హాట్ 11 2022 మోడల్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్‌ఫోన్ రూ.10,000 లోపు రిలీజైతే ఇక ఈ మోడల్స్‌ అన్నింటికి పోటీ మాములుగా ఉండదు.!

Leave a Reply