– ఎంపి సానా సతీష్
తుని: నియోజకవర్గంలోని ఎస్ అన్నవరం గ్రామంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన ఎంపీ నిధుల నుండి 25 లక్షలతో నిర్మించిన వీరాంజనేయ పాత గోనె సంచల రిపేర్ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు యనమల దివ్యతపాటు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో గ్రామానికి చెందిన ఛాంబర్ మాజీ అధ్యక్షులు నరిసే శివాజీ , చోడిశెట్టి త్రిమూర్తులు స్వామిలు మాట్లాడుతూ .. రుద్రభూమి అభివృద్ధికి ఎంపీ గ్రాంట్ నుండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభ సభ్యు సాన సతీష్ బాబు మాట్లాడుతూ.. తన ఎంపీ గ్రాంట్ నిధులు యువతలో స్కిల్ డెవలప్మెంట్ కి ఖర్చు చేస్తున్నా. ప్రత్యామ్నాయంగా సానా సతీష్ ఫౌండేషన్ నుండి నిధులు ఇస్తానని ప్రకటించారు. అలాగే వందేభారత్ రైలుకు తునిలో హాల్టు ఇచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు
ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును, ఎమ్మెల్యే యనమల దివ్యలను శ్రీ వీరాంజనేయ పాత గోనే సంచుల రిపేరు వర్క్స్ కార్మికుల సంఘం అధ్యక్షులు కొత్తూరు నాగు, ఉపాధ్యక్షులుచిక్కాల రమణ, కార్యదర్శి వీరబాబు, కోశాధికారి ప్రసాదకుమార్, జాయింట్ కోశాధికారి వీరబాబులు ఘనంగా సత్కరించారు.
అంతకు ముందు ఎస్. అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే యనమల దివ్యలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్ధ ప్రసాదలను స్వీకరించారు.
ఎం.పీ. నిధులు ప్రకటించడంతో సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వర రావు,అప్పన్న రమేష్, బోడల జమీల్, చోడిశెట్టి గణేష్, వంగలపూడి వంశీ వంగలపూడి నాగేంద్ర తదితరులు హర్షం వ్యక్తం చేశారు.